శని - గురు నవపంచమ రాజయోగం : కర్కాటకం, కుంభంతో సహా 4 రాశులకు ఊహించని ధనలాభాలు, కెరీర్‌లో బంపర్ సక్సెస్
జూన్ 2వ తేదీ (మంగళవారం) నుంచి బృహస్పతి, శని గ్రహాల కలయికతో అత్యంత శక్తిమంతమైన నవపంచం రాజయోగం ఏర్పడనుంది. దీని ప్రభావం వల్ల కర్కాటకం, కుంభంతో సహా 4 రాశుల వారికి ఊహించని ధనలాభాలు, కెరీర్‌లో బంపర్ సక్సెస్ లభించనున్నాయి.
జ్యోతిష్య ప్రపంచంలో రేపటి రోజున ఒక అరుదైన, అత్యంత శక్తిమంతమైన గ్రహాల మార్పు చోటుచేసుకోబోతోంది. జూన్ 2వ తేదీ…. మంగళవారం నాడు దేవగురువైన బృహస్పతి తన ఉచ్ఛ రాశి అయిన కర్కాటక రాశిలోకి ప్రవేశించనున్నాడు. ఈ క్రమంలోనే శని దేవుడితో కలిసి 'నవపంచమ రాజయోగాన్ని' సృష్టించబోతున్నాడు. వేద జ్యోతిష్యశాస్త్రంలో శని, బృహస్పతి గ్రహాల ప్రభావంతో ఏర్పడే ఈ నవపంచం రాజయోగానికి ఎంతో ప్రాధాన్యత ఉంది. ఇది అత్యంత శుభప్రదమైనదిగా, మానవ జీవితాలపై తీవ్రమైన సానుకూల ప్రభావం చూపేదిగా జ్యోతిష్య నిపుణులు అభివర్ణిస్తారు.

నవపంచమ రాజయోగం అంటే…?
నవగ్రహాలలో ఒకదానికొకటి ఐదవ, తొమ్మిదవ స్థానాల్లో గ్రహాలు సంచరించినప్పుడు ఈ అరుదైన యోగం సిద్ధిస్తుంది. జ్యోతిష్యశాస్త్రంలో ఐదవ ఇల్లు అనేది మనిషి యొక్క తెలివితేటలు, జ్ఞానం, సంతానం, సృజనాత్మకత, ఉన్నత విద్య, ఆకస్మిక ధనలాభాలకు ప్రతీకగా నిలుస్తుంది. అలాగే, జాతకంలోని తొమ్మిదవ ఇల్లు అదృష్టం, ఆధ్యాత్మికత, ధర్మం, సమాజంలో మంచి అవకాశాలు మరియు సుదూర ప్రయాణాలను సూచిస్తుంది.
ఎప్పుడైతే శని, బృహస్పతి గ్రహాలు కలిసి ఈ నవపంచం రాజయోగాన్ని సృష్టిస్తాయో, అప్పుడు మానవుల మేధస్సు, అదృష్టం రెండూ అద్భుతంగా రాణిస్తాయని జ్యోతిష్యులు నమ్ముతారు. ఈ రాజయోగ ప్రభావం వల్ల అభ్యర్థులు తమ కెరీర్, సామాజిక ప్రతిష్ట, ఆర్థిక రంగాల్లో ఊహించని విజయాలను అందుకుంటారు. ఇప్పటివరకు పడిన కష్టానికి పూర్తి ప్రతిఫలం దక్కే సమయం ఆసన్నమైందని చెప్పవచ్చు. ఈ రాజయోగం వల్ల భారీగా లబ్ధి పొందే ఆ 4 అదృష్ట రాశుల వివరాలు ఇక్కడ తెలుసుకోండి….
1. కర్కాటక రాశి :
దేవగురువైన బృహస్పతి సంచారం మీ స్వరాశిలోనే జరుగుతోంది. దీనికి తోడు నవపంచం రాజయోగం కూడా తోడవడంతో ఈ సమయం మీకు సువర్ణావకాశంగా మారబోతోంది. శని, గురుల ఉమ్మడి అనుగ్రహంతో చాలా కాలంగా నిలిచిపోయిన మీ పనులన్నీ ఎలాంటి ఆటంకాలు లేకుండా పూర్తవుతాయి. మీలో నిర్ణయం తీసుకునే సామర్థ్యం, లీడర్‌షిప్ క్వాలిటీస్ అద్భుతంగా మెరుగవుతాయి. మీ మాటతీరు, ఆకర్షణీయమైన వ్యక్తిత్వంతో నలుగురినీ ఆకట్టుకుంటారు. వ్యాపారంలో ఆకస్మిక లాభాలు రావడంతో పాటు, మీరు పడే కష్టానికి తగిన ప్రతిఫలం దక్కుతుంది.
2. కుంభ రాశి :
కుంభ రాశి జాతకులకు శని-బృహస్పతి నవపంచం రాజయోగం కెరీర్ పరంగా సరికొత్త పురోగతిని తీసుకువస్తుంది. ఉద్యోగ రంగంలో ఉన్న వారికి ఉన్నత పదవులు దక్కడం లేదా ఆఫీసులో సరికొత్త బాధ్యతలు వచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఈ కాలంలో ఆకస్మికంగా భారీ ఆర్థిక లాభాలు చేకూరుతాయి. వ్యాపారస్తులు తమ రంగంలో ఊహించని ప్రగతిని సాధిస్తారు. గతంలో ఇరుక్కుపోయిన ప్రాజెక్టులు, నిలిచిన పనులు వేగంగా పూర్తయి విజయాలు చేకూరుతాయి.
3. వృశ్చిక రాశి :
వృశ్చిక రాశి వారికి ఈ సమయం ఒక వరమనే చెప్పాలి. పెట్టుబడులు పెట్టాలని చూస్తున్న వారికి ఈ కాలంలో అద్భుతమైన అవకాశాలు లభిస్తాయి. శని, గురు గ్రహాల కరుణ వల్ల మీ కుటుంబ బంధాలలో, వ్యక్తిగత సంబంధాలలో ఉన్న సమస్యలు తొలిగిపోయి సాన్నిహిత్యం పెరుగుతుంది. ప్రేమ జీవితంలో కొత్త ఉత్సాహం నిండుతుంది. ఇంట్లో ఏదైనా శుభవార్త వినడం వల్ల మనస్సుకు ఎంతో సంతోషం కలుగుతుంది. అదృష్టం మీ వెంటే నడుస్తుంది. మీ కెరీర్‌లో ఊహించని విధంగా ఒక సానుకూల మలుపు ఎదురవుతుంది.
4. మీన రాశి :
నవపంచం రాజయోగం మీన రాశి వారికి అత్యంత శుభ ఫలితాలను ఇవ్వబోతోంది. ముఖ్యంగా విద్యార్థులకు ఇది చాలా అనుకూలమైన సమయం. చదువులో, కాంపిటేటివ్ ఎగ్జామ్స్‌లో అనుకూల ఫలితాలు సాధిస్తారు. విద్య మరియు గత పెట్టుబడులకు సంబంధించిన శుభవార్తలు వింటారు. ఎలాంటి ఆటంకాలు, కోర్టు సమస్యలు లేకుండా పాత పనులు సులువుగా పూర్తవుతాయి. ఆకస్మిక ధనలాభాలు కలగడం వల్ల మీ ఆర్థిక పరిస్థితి మునుపటి కంటే చాలా బలంగా మారుతుంది.
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper

