నవపంచమ రాజయోగం: శని, శుక్ర గ్రహాల కలయిక.. ఈ రాశులకు డబ్బు, శుభవార్తలు ఇలా ఎన్నో ఊహించని లాభాలు!
శని, శుక్ర గ్రహాల కలయికతో జూన్ నెలలో అత్యంత శక్తివంతమైన 'నవపంచమ రాజయోగం' ఏర్పడబోతోంది. శని, శుక్ర గ్రహాల కలయిక వల్ల ఇది ఏర్పడుతోంది. దీని ప్రభావంతో కొన్ని రాశుల వారికి అదృష్టం వరించడమే కాకుండా ఆర్థికంగా ఊహించని లాభాలు కలగనున్నాయి.
గ్రహాలు కాలానుగుణంగా వాటి రాశులను, నక్షత్రాలను మారుస్తాయి. ఆ సమయంలో శుభ యోగాలను, అశుభ యోగాలను ఏర్పడడం చూస్తూ ఉంటాం. జూన్ నెలలో శక్తివంతమైన రాజయోగం ఏర్పడబోతోంది. ఇది శని, శుక్ర గ్రహాల కలయిక వల్ల ఏర్పడుతోంది. జూన్ నెలలో కొన్ని ముఖ్యమైన గ్రహాల సంచారంలో మార్పులు రాబోతున్నాయి. కొన్ని రాశుల వారు జూన్ నెలలో అనేక రకాల లాభాలను పొందుతారు.

శుక్ర సంచారం
శుక్రుడు డబ్బు, ప్రేమ, విలాసాలు, సంతోషం మొదలైన వాటికి కారకుడు. శని న్యాయదేవుడు. మనం చేసే పనులను బట్టి ఫలితాలను ఇస్తాడు. మంచి వాటికి మంచి ఫలితాలు, చెడ్డ వాటికి చెడ్డ ఫలితాలను ఎదుర్కోక తప్పదు. ఈ రెండు గ్రహాల కలయికతో నవపంచమ రాజయోగం ఏర్పడబోతోంది.
ఇది జూన్ 25న ఏర్పడుతుంది. దీంతో కొన్ని రాశుల వారికి ఈ శక్తివంతమైన యోగం కారణంగా వివిధ లాభాలు కలుగుతాయి. మరి అదృష్ట రాశులు ఎవరు? ఈ రాజయోగంతో రాజయోగం పట్టే రాశులు ఎవరనేది ఇప్పుడు తెలుసుకుందాం.
శని, శుక్ర గ్రహాల కలయిక.. ఈ రాశుల వారికి రాజయోగం
1.కన్య రాశి:
కన్య రాశి వారికి నవపంచమ రాజయోగం బాగా కలిసి రాబోతోంది. ఈ రెండు గ్రహాల కలయిక వలన ఈ రాశి వారు ఇన్వెస్ట్మెంట్ చేస్తే బాగా సక్సెస్ అందుకుంటారు. ఉద్యోగస్తులు కొత్త అవకాశాలను పొందుతారు. వారి కెరీర్ బాగుంటుంది. ప్రేమ జీవితం మరింత దృఢంగా మారుతుంది. రానున్న రోజులు ఈ రాశి వారికి శుభ ఫలితాలను తీసుకొస్తాయి.
2.వృషభ రాశి:
వృషభ రాశి వారికి కూడా జూన్ నెల బాగుంటుంది. ఈ రెండు గ్రహాల కలయికతో ఏర్పడే రాజయోగం అదృష్టాన్ని తీసుకు వస్తుంది. ఈ రాశి వారు విపరీతంగా ప్రయోజనాలను పొందుతారు. ఎప్పటి నుంచో పూర్తి కాని పనులను కూడా చక్కగా పూర్తి చేస్తారు. కొత్త అవకాశాలు పని ప్రదేశంలో వెతుక్కుంటూ వస్తాయి. వ్యాపారస్తులకు కూడా ఇది అద్భుత సమయం.
3.మిథున రాశి:
మిథున రాశి వారికి రెండు గ్రహాల కలయిక మంచి ఫలితాలను అందిస్తుంది. కెరీర్‌లో అద్భుతమైన మార్పులను చూస్తారు. శుభవార్తలు వింటారు. అనేక విధాలుగా లాభాలను పొందుతారు. ఊహించని విధంగా జూన్ నెల ఉంటుంది.
4.కుంభ రాశి:
కుంభ రాశి వారికి కూడా ఇది శుభ సమయం. ఈ రాజయోగానికి అధిపతి శని కావడంతో, ఈ రాశి వారికి కూడా ఈ నెల బాగుంటుంది. ఈ రెండు గ్రహాల కలయిక వలన ఏర్పడే నవపంచమ యోగం ఈ రాశి వారికి అదృష్టాన్ని తీసుకొస్తుంది. కొత్త ప్రణాళికలతో ముందుకు దూసుకెళ్తారు. పిల్లల నుంచి కూడా ఈ రాశి వారు శుభవార్తలను వింటారు. ఇలా మొత్తానికి ఈ సమయం ఈ రాశి వారికి కూడా చాలా బాగుంటుంది.
ABOUT THE AUTHORPeddinti Sravyaపెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More

E-Paper


