Venus Transit 2026 : మిథున రాశిలోకి శుక్రుడు - ఈ 3 రాశుల వారికి ఇక పట్టరాని అదృష్టం...!

Venus Transit Effects : మే 14, 2026న శుక్రుడు మిథున రాశిలోకి ప్రవేశించబోతున్నాడు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం విలాసాలకు…. సంపదకు కారకుడైన శుక్రుడి మార్పు వల్ల వృషభం, మిథునం, కుంభ రాశుల వారికి ఆర్థిక లాభాలు, కెరీర్‌లో పురోగతి లభించనున్నాయి.

Published on: May 4, 2026, 08:26:57 IST
By , नई दिल्ली
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Venus Transit 2026 : జ్యోతిష్య శాస్త్ర దృక్కోణం నుండి చూస్తే…. గ్రహాల కదలికలు కేవలం ఆకాశానికే పరిమితం కావు. వాటి ప్రభావం నేరుగా మన దైనందిన జీవితంపై, మన ఆలోచనలపై కనిపిస్తుంది. ముఖ్యంగా ఒక ప్రధాన గ్రహం తన రాశిని మార్చినప్పుడు, ఆ ప్రభావం కెరీర్, వ్యక్తిగత సంబంధాలు, ఆర్థిక స్థితిగతులపై స్పష్టంగా ఉంటుంది.

శుక్ర సంచారం 2026: మిథున రాశిలోకి శుక్రుడు
శుక్ర సంచారం 2026: మిథున రాశిలోకి శుక్రుడు

ఈ క్రమంలోనే 2026 మే 14వ తేదీన ఒక కీలక మార్పు జరగబోతోంది. కళలు, ఆనందం, ప్రేమ, ఐశ్వర్యానికి కారకుడైన శుక్రుడు తన స్వక్షేత్రమైన వృషభం నుండి మిథున రాశిలోకి ప్రవేశించబోతున్నాడు.

నవగ్రహాలలో శుక్రుడికి ప్రత్యేక స్థానం ఉంది. మనిషి జీవితంలో భోగభాగ్యాలను, సౌకర్యాలను ప్రసాదించే ఈ గ్రహం యొక్క సంచారం సాధారణంగా జీవితంలో కొత్త వెలుగులను, ఉత్సాహాన్ని తెస్తుంది. మే 14న జరిగే ఈ మార్పు అన్ని రాశులపై ప్రభావం చూపినప్పటికీ….. మూడు రాశుల వారికి మాత్రం ఇది ఒక సువర్ణావకాశంలా మారబోతోంది. ఆ రాశుల జాతకాల్లో ధన యోగంతో పాటు సామాజిక గౌరవం పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి.

వృషభ రాశి: ఆర్థిక ఇబ్బందులకు చెక్

వృషభ రాశి వారికి ఈ శుక్ర సంచారం ఒక ఊరటనిచ్చే వార్త. గత కొంతకాలంగా ఆర్థిక పరమైన ఇబ్బందులతో సతమతమవుతున్న వారికి పరిస్థితులు అనుకూలంగా మారుతాయి. ముఖ్యంగా ఎక్కడైనా డబ్బు నిలిచిపోయినా లేదా పెండింగ్‌లో ఉన్న పనులు ముందుకు సాగకపోయినా, ఈ సమయం నుండి అవి ఊపందుకుంటాయి. ఉద్యోగస్తులకు కార్యాలయంలో తగిన గుర్తింపు లభిస్తుంది. కొత్త బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది. ఇక కుటుంబ విషయానికి వస్తే….. ఇంట్లో ఆహ్లాదకరమైన వాతావరణం నెలకొంటుంది. జీవిత భాగస్వామితో ఉన్న చిన్నపాటి విభేదాలు తొలగిపోయి, బంధం మరింత బలపడుతుంది.

మిథున రాశి: ఆత్మవిశ్వాసమే మీ ఆయుధం

శుక్రుడు నేరుగా మీ రాశిలోకి ప్రవేశిస్తున్నాడు కాబట్టి, మిథున రాశి వారికి ఈ సమయం అత్యంత విశేషమైనది. ఈ కాలంలో మీలో ఆత్మవిశ్వాసం అమాంతం పెరుగుతుంది. మీ మాట తీరు, ప్రవర్తన ఇతరులను ఇట్టే ఆకట్టుకుంటాయి. మీరు కొత్తగా ఏదైనా వ్యాపారం ప్రారంభించాలన్నా లేదా ఉద్యోగం మారాలన్నా ఈ సమయం మీకు పూర్తి సహకారాన్ని అందిస్తుంది. నిర్ణయాలు తీసుకోవడంలో మీకు స్పష్టత లభిస్తుంది. కమ్యూనికేషన్ రంగంలో ఉన్న వారికి, కళాకారులకు ఈ సంచారం అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది. మీ ప్రతిభకు తగిన గౌరవం దక్కుతుంది.

కుంభ రాశి: ఆకస్మిక ధన లాభాలు

కుంభ రాశి జాతకులకు ఈ గ్రహ మార్పు అదృష్టాన్ని తెచ్చిపెడుతుంది. ఊహించని విధంగా ధన లాభం కలిగే అవకాశాలు ఉన్నాయి. పాత పెట్టుబడుల నుండి మంచి లాభాలు వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. ప్రేమ జీవితంలో గతంలో ఉన్న అపార్థాలు తొలగిపోయి… మనశ్శాంతి లభిస్తుంది. విద్యార్థులకు, ముఖ్యంగా పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి ఇది ఏకాగ్రత పెంచుకోవాల్సిన సమయం. మీరు పడే కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. నిరుద్యోగులకు నచ్చిన రంగంలో అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి.

మొత్తానికి శుక్రుడి ఈ మార్పు ఈ మూడు రాశుల వారి జీవితాల్లో కొత్త ఆశలను, సంపదను నింపబోతోంది. అయితే గ్రహ ప్రభావాలతో పాటు మీ వ్యక్తిగత కృషి, పట్టుదల కూడా తోడైనప్పుడే పూర్తి ఫలితాలను పొందగలరు.

గమనిక: ఈ కథనంలోని సమాచారం కేవలం జ్యోతిష్య శాస్త్ర ప్రాధాన్యతపై ఆధారపడి ఉంది. దీనిని పూర్తిగా ధృువీకరించడం లేదు. మరింత స్పష్టత కోసం మీ వ్యక్తిగత జాతకాన్ని నిపుణులైన జ్యోతిష్కులకు చూపించుకోవడం ఉత్తమం.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More