మిథున రాశిలోకి సూర్యుడు, జూన్ నుంచి ఈ 3 రాశుల వారికి రాజయోగం.. డబ్బు, ఇంక్రిమెంట్లు, పదోన్నతులు ఇలా అనేకం!
గ్రహాల రాజు సూర్యుడు జూన్ 15న మిథున రాశిలోకి ప్రవేశించబోతున్నారు. ఈ సూర్య గోచారం వల్ల మేషం, మిథునం సహా మూడు రాశుల వారికి కెరీర్‌లో తిరుగుండదు. ఆ రాశుల వివరాలు, పండితులు సూచిస్తున్న పరిహారాలు మీకోసం.
వైదిక జ్యోతిష్య శాస్త్రంలో సూర్య భగవానుడి సంచారానికి అత్యంత ప్రాధాన్యత ఉంటుంది. గ్రహాలన్నింటికీ రాజుగా భావించే సూర్యుడు.. మనిషి ఆత్మకు, గౌరవ మర్యాదలకు, ప్రభుత్వ రంగానికి కారకుడు. సూర్యుడు ప్రతి నెలా ఒక రాశి నుంచి మరో రాశిలోకి మారుతుంటారు. ఈ మార్పునే మనం 'సంక్రాంతి' అని పిలుచుకుంటాం. జ్యోతిష్య గణాంకాల ప్రకారం, సూర్యుడు 2026 జూన్ 15వ తేదీన మధ్యాహ్నం 12 గంటల 34 నిమిషాలకు వృషభ రాశిని వీడి మిథున రాశిలోకి ప్రవేశించబోతున్నారు.

బుధుడు అధిపతిగా ఉండే మిథున రాశిలోకి సూర్యుడు రావడం వల్ల ద్వాదశ రాశులపై దీని ప్రభావం ఉంటుంది. అయితే, మూడు రాశుల వారికి మాత్రం ఈ గోచారం అద్భుతమైన ఫలితాలను ఇస్తుందని ప్రముఖ జ్యోతిష్య నిపుణులు వివరించారు. ముఖ్యంగా కెరీర్, ఆర్థిక అంశాల్లో వీరు ఊహించని ప్రగతిని సాధిస్తారు.
1.మేష రాశి:
సూర్య సంచారం మేష రాశి జాతకుల తలరాతను మార్చబోతోంది. మీరు గతంలో చేసిన కష్టానికి ఇప్పుడు తగిన ప్రతిఫలం దక్కుతుంది. నిలిచిపోయిన పనుల్లో వేగం పెరుగుతుంది. మీలో ఆత్మవిశ్వాసం రెట్టింపు అవుతుంది. అదృష్టం తోడవడంతో ధన లాభం కలిగే అవకాశాలు మెండుగా ఉన్నాయి. కొత్త ఆదాయ మార్గాలు పుట్టుకొస్తాయి. పాత బాకీలు వసూలు కావడంతో ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది. ఆరోగ్య సమస్యల నుంచి కూడా మీకు ఉపశమనం లభిస్తుంది. వృత్తి జీవితంలో ఉన్నత స్థానాలకు చేరుకునే సూచనలు కనిపిస్తున్నాయి.
2.మిథున రాశి:
సూర్యుడు మీ రాశిలోనే సంచరించబోతున్నారు. ఇది మీకు ఎంతో లాభదాయకమైన సమయం. కార్యక్షేత్రంలో మీ ప్రతిభకు తగిన గుర్తింపు లభిస్తుంది. పై అధికారుల నుంచి పూర్తి సహకారం అందుతుంది. కొత్తగా వ్యాపారాలు ప్రారంభించాలనుకునే వారికి ఇది గోల్డెన్ పిరియడ్ అని చెప్పాలి. ఆర్థిక పరిస్థితిలో స్థిరత్వం ఏర్పడుతుంది. మీ నిర్ణయాలు సత్ఫలితాలను ఇస్తాయి. శారీరక, మానసిక ఆరోగ్యం బాగుంటుంది. సమాజంలో మీ గౌరవం పెరుగుతుంది.
3.సింహ రాశి:
సూర్యుడు మిథున రాశిలోకి ప్రవేశించడం వల్ల సింహ రాశి వారికి రాజయోగం పట్టినట్లే. ఆఫీసులో మీ పరపతి పెరుగుతుంది. ఉద్యోగస్తులకు ఇంక్రిమెంట్లు లేదా పదోన్నతులు వచ్చే అవకాశం ఉంది. మీలోని నైపుణ్యాలను నిరూపించుకోవడానికి సరైన వేదిక దొరుకుతుంది. వ్యాపారస్తులు మంచి లాభాలను ఆర్జిస్తారు. కుటుంబ సభ్యులతో ఉన్న సంబంధాలు బలపడతాయి. మీరు వేసుకున్న ఆర్థిక ప్రణాళికలు విజయవంతం కావడంతో బ్యాంకు బ్యాలెన్స్ పెరుగుతుంది.
సూర్య అనుగ్రహం కోసం ఈ పరిహారాలు పాటించండి
సూర్య భగవానుడి అనుగ్రహం మెండుగా ఉండాలంటే ఈ నియమాలు పాటించాలని పండితులు సూచిస్తున్నారు:
- ప్రతిరోజూ ఉదయం సూర్యోదయ సమయంలో రాగి చెంబుతో నీరు ఇవ్వాలి. ఆ నీటిలో ఎర్ర చందనం, కుంకుమ కలిపితే ఇంకా మంచిది.
- "ఓం ఘృణి సూర్యాయ నమః" అనే మంత్రాన్ని లేదా గాయత్రీ మంత్రాన్ని వీలైనన్ని ఎక్కువ సార్లు జపించండి.
- తండ్రిని లేదా తండ్రి సమానమైన వ్యక్తులను గౌరవించాలి. వారి ఆశీస్సులు సూర్య గ్రహ దోషాలను తొలగిస్తాయి.
- ఆదివారం నాడు గోధుమలు, రాగి వస్తువులు లేదా ఎర్రటి వస్త్రాలను దానం చేయడం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయి.
ఈ కథనంలో అందించిన సమాచారం కేవలం జ్యోతిష్య శాస్త్ర పండితుల అభిప్రాయాలు, విశ్వాసాల ఆధారంగా మాత్రమే ఇచ్చాం. దీనికి ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు. పూర్తి వివరాల కోసం మీ వ్యక్తిగత జాతకాన్ని నిపుణులకు చూపించుకోవడం ఉత్తమం.
ABOUT THE AUTHORPeddinti Sravyaపెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More

E-Paper


