శుక్రుడి అస్తమయంతో ఈ 4 రాశుల వారికి అదృష్టం.. డబ్బు, ఉద్యోగం, వ్యాపారంలో లాభాలు!

జ్యోతిష్య ప్రకారం సెప్టెంబర్ 23న శుక్రుడు అస్తమించనున్నాడు. అనంతరం అక్టోబర్ 3న తిరుగమనంలో సంచారం చేయనున్న నేపథ్యంలో కొన్ని రాశుల వారికి ఆర్థిక, కెరీర్, వ్యాపార పరంగా అనుకూల ఫలితాలు కలగవచ్చని ఈ కథనం చెబుతోంది.  

Published on: Sep 17, 2026, 16:01:01 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

గ్రహాలు కాలానుగుణంగా వాటి రాశులను, నక్షత్రాలను మారుస్తూ ఉంటాయి. గ్రహాల సంచారంలో మార్పు వస్తే, అది 12 రాశుల వారి జీవితంలో అనేక మార్పులను తీసుకొస్తుంది. సెప్టెంబర్ 23న శుక్రుడు అస్తమించబోతున్నాడు. తర్వాత అక్టోబర్ 3న తిరుగమనంలో సంచారం చేస్తాడు. దీంతో కొన్ని రాశుల వారికి విపరీతంగా లాభాలు వచ్చే అవకాశం ఉంది. మరి అదృష్ట రాశులు ఎవరు? వీరిలో మీరు ఒకరేమో చూసుకోండి.

శుక్రుడి అస్తమయంతో ఈ 4 రాశుల వారికి అదృష్టం.. డబ్బు, ఉద్యోగం, వ్యాపారంలో లాభాలు! (AI)
శుక్రుడి అస్తమయంతో ఈ 4 రాశుల వారికి అదృష్టం.. డబ్బు, ఉద్యోగం, వ్యాపారంలో లాభాలు! (AI)

శుక్రుడి అస్తమయం.. ఈ రాశుల వారికి లాభాలే లాభాలు

శుక్రుడి అస్తమయంతో కొన్ని రాశుల వారికి బాగా కలిసి రాబోతోంది. కెరీర్, వ్యాపారాల్లో భారీగా లాభాలను పొందబోతున్నారు. సంపద కూడా పెరుగుతుంది. మరి అదృష్ట రాశులు ఎవరో ఇప్పుడే చూసేద్దాం.

ధనుస్సు రాశి

ధనుస్సు రాశి వారికి శుక్రుడి అస్తమయంతో బాగా కలిసి రాబోతోంది. డబ్బు, పొదుపు విషయాల్లో అనుకూలంగా ఉంటుంది. ఆర్థిక పరంగా లాభాలు ఉంటాయి. ఆదాయం పెరుగుతుంది. ఈ రాశి వారు సక్సెస్‌ను కూడా అందుకుంటారు. కుటుంబం నుంచి శుభవార్తలను వింటారు. అనేక విధాలుగా కలిసి వస్తుంది.

సింహ రాశి

సింహ రాశి వారికి శుక్రుడి అనుగ్రహంతో భారీగా కలిసి వస్తుంది. శుక్రుని సంచారం ఈ రాశి వారికి కెరీర్‌లో మంచి అవకాశాలను తీసుకొస్తుంది. ఉద్యోగులకు కూడా ఇది అద్భుతమైన సమయం అని చెప్పొచ్చు. కొత్త బాధ్యతలను చేపడతారు. వ్యాపారస్తులకు కూడా ఇది అనుకూలమైన సమయం. కొత్త ఒప్పందాలను చేసుకుంటారు. వాటి ద్వారా బాగా కలిసి వస్తుంది.

కర్కాటక రాశి

కర్కాటక రాశి వారికి శుక్ర సంచారం అద్భుతంగా ఉంటుంది. ఆర్థిక విషయాల్లో ఊరట లభిస్తుంది. ఇతరుల చేతిలో ఆగిపోయిన డబ్బులు చేతికి వస్తాయి. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. వ్యాపారస్తులకు కూడా ఇది శుభసమయం అని చెప్పొచ్చు. కొత్త పరీక్షలు ఏర్పడతాయి. భారీగా లాభాలను పొందుతారు.

కుంభ రాశి

ఈ రాశి వారికి శుక్ర సంచారం ఎన్నో విధాలుగా కలిసి వస్తుంది. కెరీర్, వ్యాపారాల్లో పురోగతిని చూస్తారు. ఉద్యోగంలో కీలక బాధ్యతలను చేపడతారు. ఆర్థిక పరంగా బాగుంటుంది. వివిధ మార్గాల ద్వారా డబ్బు సంపాదిస్తారు. వ్యాపారస్తులకు కూడా ఇది అద్భుతమైన సమయం.

నిరాకరణ: ఈ వ్యాసంలో ఉన్న సమాచారం పూర్తిగా నిజం మరియు ఖచ్చితమైనది అని మేము చెప్పము. మరిన్ని వివరాలు మరియు మరింత సమాచారం కోసం, సంబంధిత నిపుణుడిని సంప్రదించండి.

  • Peddinti Sravya
    ABOUT THE AUTHOR
    Peddinti Sravya

    పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More