పేరు ఈ అక్షరంతో మొదలవుతుందా? అయితే ప్రేమలో నిజాయితీ ఉంటారు, భాగస్వామి కూడా సంతోషంగా ఉంటారు!
జ్యోతిష్య ప్రకారం ఒక వ్యక్తి పేరు మొదటి అక్షరం ఆధారంగా వారి వ్యక్తిత్వం, స్వభావం, ప్రవర్తన గురించి కొన్ని విషయాలను అంచనా వేయవచ్చని భావిస్తారు. ముఖ్యంగా A అక్షరంతో పేరు ప్రారంభమయ్యే వారు ప్రేమలో నిజాయితీ, నమ్మకం, గౌరవం, భావోద్వేగ అనుబంధానికి ప్రాధాన్యత ఇస్తారని ఈ కథనం చెబుతోంది.
రాశుల ఆధారంగా, నక్షత్రాల ఆధారంగా ఒక మనిషి వ్యక్తిత్వం గురించి తెలుసుకోవచ్చు. అదే విధంగా, ఒక మనిషి పుట్టిన తేదీ ఆధారంగా కూడా అనేక విషయాలను తెలుసుకోవచ్చు. ఇవే కాదు, ఒక మనిషి పేరులోని మొదటి అక్షరం కూడా వారి గురించి చాలా విషయాలను చెబుతుంది. మనిషి పేరులోని మొదటి అక్షరం ద్వారా వారి వ్యక్తిత్వం ఎలా ఉంటుంది, వారి ప్రవర్తన ఏ విధంగా ఉంటుంది, వారి స్వభావం, తీరు ఇలా అనేక విషయాలను చెప్పడానికి వీలవుతుంది. ఈరోజు A అక్షరంతో పేరు మొదలవుతుంటే వారు ఎలా ఉంటారనే దాని గురించి తెలుసుకుందాం.

మీ పేరు A అక్షరంతో మొదలవుతుందా? అయితే కచ్చితంగా మీరు ఇది తెలుసుకోవాలి. A అక్షరంతో పేరు మొదలవుతున్న వారు చాలా నిజాయితీగా ఉంటారు. ప్రేమలో నమ్మకం, గౌరవం, భావోద్వేగ అనుబంధానికి ప్రత్యేక ప్రాధాన్యతను ఇస్తారు. వారి ప్రేమ జీవితం గురించి ఆసక్తికరమైన విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.
ప్రేమలో నిజాయితీ, స్వచ్ఛమైన మనస్తత్వం
మీ పేరు A అక్షరంతో మొదలవుతున్నట్లయితే, ప్రేమలో మీరు నటించడానికి ఏ మాత్రం ఇష్టపడరు. ప్రేమ దానంతట అదే కలిగి, నిజాయితీగా వారిని ఇష్టపడతారు. అలాగే A అక్షరంతో పేరు మొదలవుతున్నట్లయితే, వారి భావాలను వ్యక్తపరచడానికి వెనుకాడరు. భాగస్వామి నుంచి నిజాయితీని ఆశిస్తారు. వారు కూడా పూర్తి నిజాయితీతో వుంటారు.
గౌరవం లభిస్తే బంధం బలపడుతుంది
A అక్షరంతో పేరు మొదలవుతున్నట్లయితే, వారి అభిప్రాయాలు, పనులు, వ్యక్తిగత నిర్ణయాలను భాగస్వామి గౌరవించాలని అనుకుంటారు. పదే పదే నిర్లక్ష్యం చేయడం, ఇతరుల ముందు వారు తక్కువ చేసి మాట్లాడటం అంటే అసలు ఇష్టపడరు. సంబంధాన్ని సీరియస్‌గా తీసుకుంటారు.
వ్యక్తిగత స్వేచ్ఛ
ప్రతి రిలేషన్‌షిప్‌లో వ్యక్తిగత స్వేచ్ఛ అనేది చాలా ముఖ్యం. A అక్షరంతో పేరు ప్రారంభమయ్యే వారు వ్యక్తిగత జీవితం, నిర్ణయాలు తీసుకునే స్వేచ్ఛకు విలువ ఇస్తారు. భాగస్వామి ప్రతి విషయాన్ని అతిగా ప్రశ్నించడం లేదా ఎక్కువగా జోక్యం చేసుకోవడం సంబంధంలో ఒత్తిడికి దారి తీయొచ్చు. అలా ఉండకూడదంటే పరస్పర అవగాహనతో పాటుగా వ్యక్తిగత స్వేచ్ఛ అవసరం.
ఎక్కువగా కోపం ఉండదు
భాగస్వామితో ఏదైనా విభేదం వచ్చినప్పుడు అప్పటికప్పుడు కోపం వచ్చి తగ్గిపోతుంది తప్ప, దానిని అలా ముందుకు తీసుకెళ్లరు. ఎప్పటికప్పుడు కోపాన్ని తగ్గించుకుంటూ ఉంటారు. మళ్లీ సంభాషణతో ప్రేమను ముందుకు తీసుకెళ్తారు.
భావోద్వేగ అనుబంధం
A అక్షరంతో పేరు మొదలయ్యే వారు బలమైన భావోద్వేగ అనుబంధం ఉండాలని అనుకుంటారు. రోజువారీ జీవితంలో చిన్న విషయాల నుంచి ముఖ్యమైన విషయాల దాకా భాగస్వామి శ్రద్ధగా వినడం, వారి భావాలను అర్థం చేసుకోవడం వారికి సంతోషాన్ని ఇస్తుంది. కొన్నిసార్లు ఏ ప్రత్యేక కారణం లేకుండా పంపే ప్రేమపూర్వక మెసేజ్‌లు లేదా ఫోన్ కాల్ కూడా వారికి ఎంతో ప్రత్యేకంగా అనిపిస్తుంది. A అక్షరంతో మొదలయ్యే వారి భాగస్వామి మీరు అయితే, వారితో కలకాలం సంతోషంగా ఉంటారు.
గమనిక: ఒక వ్యక్తి ప్రేమ జీవితం లేదా వ్యక్తిత్వాన్ని పేరు మొదటి అక్షరం ఆధారంగా చెప్పొచ్చు, కానీ పూర్తిగా నిర్ణయించలేము. సమగ్ర జ్యోతిష్య విశ్లేషణ కోసం పుట్టిన సమయం, పుట్టిన తేదీ, పుట్టిన ప్రదేశం ఆధారంగా రూపొందించిన జాతకాన్ని కూడా పరిగణలోకి తీసుకోవాలి.
ABOUT THE AUTHORPeddinti Sravyaపెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More

E-Paper


