Zodiac signs: ఈ 4 రాశుల వారికి ఏకాంతమే ఇష్టం.. ఒంటరిగా ఉంటేనే సంతోషంగా ఉంటారు!
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ప్రతి రాశికి ప్రత్యేకమైన వ్యక్తిత్వ లక్షణాలు ఉంటాయి. కొందరు నలుగురితో కలిసిమెలిసి ఉండటాన్ని ఇష్టపడితే, మరికొందరు ఏకాంతంలోనే ప్రశాంతతను వెతుకుతారు. కన్యా, వృశ్చిక, మకర, కుంభ రాశుల వారు ఒంటరిగా సమయాన్ని గడపడానికి ఎక్కువగా ఆసక్తి చూపుతారని జ్యోతిష్య విశ్వాసం.
మనకి మొత్తం 12 రాశులు ఉన్నాయి. రాశుల ఆధారంగా చాలా విషయాలను చెప్పచ్చు. ఒక మనిషి వ్యక్తిత్వం, తీరు ఎలా ఉన్నాయో చెప్పడంతో పాటుగా, భవిష్యత్తు గురించి కూడా రాశుల ఆధారంగా చాలా విషయాలను చెప్పవచ్చు. ప్రతి ఒక్కరూ కూడా మరొకరితో పోల్చుకుంటే కాస్త భిన్నంగానే ఉంటారు. ఒకరి ఆలోచన విధానం ఒకలా ఉంటే, మరొకరి ఆలోచన విధానం ఇంకోలా ఉంటుంది.

కొంతమందికి కొన్ని విషయాలు తప్పు అయితే, అవే కొంత మందికి ఒప్పు కావచ్చు. నలుగురితో కొంతమంది కలిసిపోయి సరదాగా సమయాన్ని గడిపితే, ఇంకొంతమందికి ఏకాంతంగా ఉండడం ఇష్టం. జ్యోతిష్యం ప్రకారం ఈ రాశుల వారు ఒంటరిగా ఉండడానికి ఇష్టపడతారు. వీరిలో మీరు ఒకరేమో చూసుకోండి.
ఈ రాశుల వారు చాలా భిన్నంగా ఉంటారు. ఒంటరిగా ఉండడానికి ఇష్టపడతారు. కొంతమందికి ఒంటరిగా ఉండడం ఏమాత్రం నచ్చదు. అందరితో కలిసి సరదాగా సమయాన్ని గడపాలని అనుకుంటారు. మరి కొంతమంది మాత్రం ఒంటరిగా ఉండాలని, ఒంటరిగా సమయాన్ని గడపాలని భావిస్తారు. ఏకాంతంగా ఉండడానికి ఇష్టపడతారు.
కన్యా రాశి
కన్యా రాశి వారు ఒంటరిగా ఉండడానికి ఇష్టపడతారు. ఈ రాశి వారు పరిపూర్ణతను కోరుకుంటారు. ఈ రాశి వారు ఏ పని చేసినా కూడా పర్‌ఫెక్ట్‌గా చేస్తారు. చిన్న విషయాలను కూడా గమనిస్తారు. తప్పు చేయడం, తప్పు రావడం వీరికి ఏమాత్రం నచ్చదు. ప్రశాంతమైన వాతావరణంలో సమయాన్ని గడపాలని కన్యా రాశి వారు కోరుకుంటారు. ఒంటరిగా ఉన్నప్పుడు వారి ఆలోచనలను సరిచేసుకుంటారు. కొత్త విషయాలను నేర్చుకుంటారు. అంతేకాదు, పుస్తకాలు చదవడం, నైపుణ్యాలను మెరుగుపరచుకోవడం కోసం కూడా ఒంటరిగా ఉంటారు.
వృశ్చిక రాశి
వృశ్చిక రాశి వారి భావోద్వేగాలు బాగా ఎక్కువగా ఉంటాయి. లోతైన ఆలోచనను కలిగి ఉంటారు. వృశ్చిక రాశి వారు ఏ విషయాన్నైనా కూడా లోతుగా విశ్లేషించగలరు. ఎక్కువసేపు జనాల మధ్య ఉండడం కంటే ఏకాంతంగా ఉండడానికి ఇష్టపడతారు. ఒంటరిగా ఉన్నప్పుడు మంచి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఎక్కువ ఉంటుందని భావిస్తారు. ఎప్పుడూ కూడా ఒంటరిగా ఉండాలని అనుకుంటారు. లక్ష్యాలపై దృష్టి పెట్టడానికి కూడా ఏకాంతాన్ని ఈ రాశి వారు ఇష్టపడతారు.
మకర రాశి
ఈ రాశి వారు క్రమశిక్షణకు మారుపేరు. బాధ్యత, లక్ష్య సాధనకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. ఈ రాశి వారు కూడా ఒంటరిగా సమయాన్ని గడపడానికి ఇష్ట పడతారు. చాలామందికి వీరు కాస్త దూరంగా ఉన్నట్లు అనిపించొచ్చు. కానీ వీరు జీవితానికి, సమయానికి ఎంతో విలువ ఇస్తారు. అనవసరమైన సమావేశాలు, అనవసరపు మాటలు వీరికి నచ్చవు. దాని కంటే కూడా పనిని పూర్తి చేసుకోవడం మంచిదని భావిస్తారు. భవిష్యత్తు కోసం మకర రాశి వారు అహర్నిశలు శ్రమిస్తారు.
కుంభ రాశి
కుంభ రాశి వారు వినూత్నంగా ఆలోచిస్తారు. ఈ రాశి వారికి క్రియేటివిటీ కూడా ఎక్కువ. కొత్త ఆలోచనలు, సమాజానికి ఉపయోగపడే అంశాలపై దృష్టి పెడతారు. ఈ రాశి వారు కూడా ఎప్పుడూ ఒంటరిగా ఉండటానికి ఇష్టపడతారు. అవసరమైనప్పుడు మాత్రమే సమాజంతో కలుస్తారు. లేకపోతే వారి పని వారు చూసుకుని ఒంటరిగా ఉంటారు. అన్నిటికంటే కూడా వ్యక్తిగత సమయానికి ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తారు.
ABOUT THE AUTHORPeddinti Sravyaపెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More

E-Paper


