A, K, L, M, N, P, R, S... మీ పేరు ఏ అక్షరంతో మొదలవుతుంది? మొదటి అక్షరం చెప్పే ఆశ్చర్యకరమైన వ్యక్తిత్వ విశేషాలు!
జ్యోతిష్య శాస్త్రం, అక్షర శాస్త్రం ప్రకారం వ్యక్తి పేరులోని మొదటి అక్షరం వారి స్వభావం, ఆలోచనా విధానం, వ్యక్తిత్వ లక్షణాలను సూచిస్తుందని విశ్వసిస్తారు. A, K, L, M, N, P, R, S అక్షరాలతో ప్రారంభమయ్యే పేర్లకు సంబంధించిన వ్యక్తిత్వ లక్షణాలను నిపుణులు వివరిస్తున్నారు.
జ్యోతిష్య శాస్త్రం, అక్షర శాస్త్రం ప్రకారం వ్యక్తి పేరులోని మొదటి అక్షరం వారి ఆలోచన విధానం, భవిష్యత్తు, స్వభావం గురించి ఎన్నో విషయాలను చెబుతుందని భావిస్తారు. మీ పేరు ఏ అక్షరంతో మొదలవుతుందో చూసి మీ వ్యక్తిత్వంలోని అసలు రంగులు ఏంటో తెలుసుకోండి. పేరును బట్టి వ్యక్తిత్వం ఏ విధంగా ఉంటుందో ఈరోజు ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.

మీ పేరులో మొదటి అక్షరం మీ గురించి ఏం చెప్తోంది?
చాలా మందికి వారి పేరు వెనుక ఉన్న అర్థం, దాని ప్రాముఖ్యత తెలుసుకోవాలని ఆసక్తి ఉంటుంది. జ్యోతిష్య నిపుణుల విశ్లేషణ ప్రకారం వివిధ అక్షరాల ప్రభావం ఏ విధంగా ఉంటుందో ఇక్కడ తెలుసుకోవచ్చు.
A అక్షరం:
మీ పేరు A అక్షరంతో మొదలవుతున్నట్లయితే మీరు చాలా మొండిగా ఉంటారు. పట్టుదలతో ఉంటారు. కష్టపడి పని చేయడం మీకు ఎంతో ఇష్టం. నాయకత్వ లక్షణాలు కూడా మీలో ఎక్కువగా ఉంటాయి.
K అక్షరం:
K అక్షరంతో పేరు మొదలవుతున్నట్లయితే మీకు నిగ్రహం ఎక్కువ. చాలా త్వరగా ఇతరులతో సులభంగా కలిసిపోతారు. ఒకవేళ స్నేహం చేస్తే ప్రాణాలు ఇస్తారు. ప్రేమ విషయంలో ఎప్పుడూ ఈ పేరుతో ఉన్నవారు నిజాయితీగా ఉంటారు.
L అక్షరం:
L అక్షరంతో పేరు మొదలవుతున్నట్లయితే జీవితంలో ప్రయాణాలకు, కొత్త విషయాలను తెలుసుకోవడానికి ప్రాముఖ్యత ఇస్తారు. ఊహల లోకంలో విహరించడం ఈ అక్షరం వారి ప్రత్యేకత. మానసికంగా ఈ అక్షరం వారు సున్నితంగా ఉంటారు.
M అక్షరం:
మీ పేరు M అక్షరంతో మొదలవుతున్నట్లయితే మీరు ఆచరణాత్మక ఆలోచనలు చేస్తారు. కష్టపడి సంపాదిస్తారు. కుటుంబ బాధ్యతలు నెరవేర్చడం మీ ప్రధాన లక్ష్యం. కోపం కొంచెం ఎక్కువ అయినప్పటికీ మనసు మాత్రం చాలా సున్నితమైనది.
N అక్షరం:
N అక్షరంతో పేరు మొదలవుతున్నట్లయితే మీరు స్వతంత్ర భావాలను కలిగి ఉంటారు. ఇతరుల జోక్యం మీకు ఏమాత్రం నచ్చదు. అలాగే తమ మార్గంలో తాము వెళ్లడానికి ఎప్పుడూ ఇష్టపడతారు. విమర్శలను స్వీకరించడం కంటే తమ నిర్ణయమే మంచిదని భావిస్తారు.
P అక్షరం:
మీ పేరు P అక్షరంతో మొదలవుతున్నట్లయితే కళాత్మక దృష్టిని మీరు కలిగి ఉంటారు. ఏదైనా విషయాన్ని లోతుగా విశ్లేషించగలరు. ఆకర్షణీయమైన మాటలతో ఇతరులను సులువుగా ఆకట్టుకుంటారు.
R అక్షరం:
మీ పేరు R అక్షరంతో మొదలవుతున్నట్లయితే ఇతరులను వేగంగా అర్థం చేసుకుంటారు. అందరితో ఇట్టే కలిసిపోతారు. లోపల మాత్రం మీకంటూ ఒక చిన్న ప్రపంచాన్ని ఏర్పరచుకుంటారు. మీరు చాలా తెలివైన వారు, లోతైన ఆలోచనాపరులు.
S అక్షరం:
మీ పేరు S అక్షరంతో మొదలవుతున్నట్లయితే భావోద్వేగపూరితమైన వారు. పదిమందికి సహాయం చేయాలనే తపన మీకు ఉంటుంది. ప్రతి విషయాన్ని సీరియస్‌గా తీసుకోవడం వల్ల కొన్నిసార్లు ఒత్తిడికి గురయ్యే అవకాశాలు ఉన్నాయి.
ABOUT THE AUTHORPeddinti Sravyaపెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More

E-Paper


