Name Astrology: పి అక్షరంతో పేరు మొదలయ్యే వారి లైఫ్ ఎలా ఉంటుంది?
పేరులో ఉన్న మొదటి అక్షరం ద్వారా కూడా చాలా విషయాలను చెప్పవచ్చు. పేరులో ఉన్న మొదటి అక్షరం ద్వారా ఆ వ్యక్తి ప్రవర్తన తీరు ఎలా ఉంటుందో చెప్పడంతో పాటు, భవిష్యత్తు గురించి కూడా అనేక విషయాలు చెప్పవచ్చు. ఈరోజు ‘P’ అక్షరం వారి వ్యక్తిత్వం గురించి తెలుసుకుందాం. పి అక్షరంతో పేరు మొదలయ్యే వారి లైఫ్ ఎలా ఉంటుంది?
రాశుల ఆధారంగా, జన్మ నక్షత్రాల ఆధారంగా ఎలా అయితే చాలా విషయాలను తెలుసుకోవచ్చో, అలాగే ఒక మనిషి పేరులో ఉన్న మొదటి అక్షరం ద్వారా కూడా చాలా విషయాలను చెప్పవచ్చు. పేరులో ఉన్న మొదటి అక్షరం ద్వారా ఆ వ్యక్తి ప్రవర్తన తీరు ఎలా ఉంటుందో చెప్పడంతో పాటు, భవిష్యత్తు గురించి కూడా అనేక విషయాలు చెప్పవచ్చు. ఈరోజు ‘P’ అక్షరం వారి వ్యక్తిత్వం గురించి తెలుసుకుందాం.

‘P’ అక్షరంతో మీ పేరు మొదలవుతుందా? అయితే మీ వ్యక్తిత్వం గురించి ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోండి
పేరు ‘P’ అక్షరంతో మొదలవుతున్నట్లయితే వారిలో చాలా ప్రత్యేకమైన లక్షణాలు ఉంటాయి. పైగా ఈ వ్యక్తులు ఎవరినీ కూడా బాధ పెట్టడానికి ఇష్టపడరు. ‘P’ అక్షరంతో పేరు మొదలవుతున్నట్లయితే వారి జీవితం చాలా బాగుంటుంది. అయితే ప్రేమ విషయంలో మాత్రం అంత అదృష్టవంతులు కారని చెప్పవచ్చు. వైవాహిక జీవితంలో మాత్రం వీరు బాధ్యతలను పూర్తిగా, చక్కగా నిర్వర్తిస్తారు. భాగస్వామి పట్ల అంకితభావంతో ఉంటారు.
తక్కువ మంది స్నేహితులు
‘P’ అక్షరంతో పేరు మొదలుపెట్టుకున్నట్లయితే వారికి అంత ఎక్కువ మంది స్నేహితులు ఉండరు. చాలా తక్కువ మంది మాత్రమే ఉంటారు. అంత ఈజీగా అందరితో కనెక్ట్ అవ్వరు. ఒకవేళ కనెక్ట్ అయితే మాత్రం వదిలిపెట్టరు.
కాస్త మొండిగా ఉంటారు
‘P’ అక్షరంతో పేరు మొదలవుతున్నట్లయితే వారు కాస్త మొండిగా ఉంటారు. కొంత మంది వీరిని అహంకారి అని అంటారు. కానీ నిజానికి వీరు ఇతరుల పట్ల ఎంతో దయతో ఉంటారు. ఇతరులను బాగా అర్థం చేసుకుంటారు. పైగా అందరికీ సాయం చేయడానికి ముందుంటారు.
కెరీర్‌లో ఇబ్బందులు
‘P’ అక్షరంతో పేరు మొదలవుతున్నట్లయితే వారు కెరీర్‌లో కాస్త ఒడిదుడుకులను చూస్తారు. కానీ వారి కష్టార్జితంతో అన్ని సమస్యలను కూడా సులువుగా పరిష్కరించుకుంటారు. సొంత వ్యాపారం కూడా వీరికి బాగా కలిసి వస్తుంది.
చదువులో ముందుంటారు, తెలివైన వారు
పేరు ‘P’ అక్షరంతో మొదలవుతున్నట్లయితే వారు చదువులో ముందుంటారు. అలాగే వారు తెలివైన వారు, అందంగా ఉంటారు. ‘P’ అక్షరంతో పేరు మొదలవుతున్నట్లయితే వారు మంచి భాగస్వామిగా ఉంటారు. కాబట్టి కళ్లు మూసుకుని వారిని పెళ్లి చేసుకోవచ్చు.
కుటుంబం అంటే ఎంతో ఇష్టం
‘P’ అక్షరంతో పేరు మొదలవుతున్నట్లయితే వారికి కుటుంబం అంటే ఎంతో ఇష్టం ఉంటుంది. పైగా వారి బాధ్యతలను కూడా చక్కగా పూర్తి చేస్తారు. కుటుంబంలో అందరికీ కూడా వీరు ఎంతో ఇష్టమైనవారు. అందరి నుంచి ఎంతో ప్రేమను పొందుతారు.
ప్రత్యేక గుర్తింపు ఉంటుంది
‘P’ అక్షరంతో పేరు మొదలవుతున్నట్లయితే వారికి ప్రత్యేకమైన గుర్తింపు ఉంటుంది. వారి ఊర్లో, వారు ఉండే ప్రదేశంలో కూడా మంచి గుర్తింపును తెచ్చుకుంటారు.
ఎప్పుడూ ప్రోత్సాహాన్ని కోల్పోరు
ఈ అక్షరంతో పేరు మొదలవుతున్నట్లయితే ఎప్పుడూ కూడా ఓటమిని చూసి కృంగిపోవడం, బాధపడడం ఉండదు. ఎప్పుడూ ధైర్యంగా ముందుకు వెళ్లి, అన్నిటిలో రాణిస్తారు. విజయాలను అందుకుంటారు.
ABOUT THE AUTHORPeddinti Sravyaపెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More

E-Paper


