ఈ తేదీల్లో పుట్టిన వారు మంచి తల్లిదండ్రులుగా గుర్తింపు పొందుతారు, పిల్లలను ప్రతి క్షణం ప్రోత్సహిస్తారు!

న్యూమరాలజీలో చూసినట్లయితే రాడిక్స్ సంఖ్య ఒకటి నుంచి తొమ్మిది వరకు ఉంటాయి. ఈ సంఖ్యలు అనేక విషయాలను చెబుతాయి. ప్రతి ఒక్క చిన్నారి కూడా తల్లిదండ్రుల సపోర్ట్ ఉంటేనే ముందుకు వెళ్లగలరు. అలాగే వారి సామర్థ్యం ఏంటన్నది తల్లిదండ్రులు మాత్రమే గుర్తించగలరు. పిల్లలు సక్సెస్ అవ్వాలంటే తల్లిదండ్రుల సపోర్ట్ ఉండాలి.

Published on: Jan 30, 2026, 15:00:57 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

న్యూమరాలజీ ఆధారంగా చాలా విషయాలను చెప్పవచ్చు. న్యూమరాలజీ ఆధారంగా ఒక మనిషి వ్యక్తిత్వం ఎలా ఉంటుందో చెప్పడంతో పాటు, భవిష్యత్తు గురించి కూడా అనేక విషయాలను చెప్పడానికి వీలవుతుంది. న్యూమరాలజీలో చూసినట్లయితే రాడిక్స్ సంఖ్య ఒకటి నుంచి తొమ్మిది వరకు ఉంటాయి. ఈ సంఖ్యలు అనేక విషయాలను చెబుతాయి.

ఈ తేదీల్లో పుట్టిన వారు మంచి తల్లిదండ్రులుగా గుర్తింపు పొందుతారు (pinterest)
ఈ తేదీల్లో పుట్టిన వారు మంచి తల్లిదండ్రులుగా గుర్తింపు పొందుతారు (pinterest)

ప్రతి ఒక్క చిన్నారి కూడా తల్లిదండ్రుల సపోర్ట్ ఉంటేనే ముందుకు వెళ్లగలరు. అలాగే వారి సామర్థ్యం ఏంటన్నది తల్లిదండ్రులు మాత్రమే గుర్తించగలరు. వారి కలలు నెరవేరడానికి తల్లిదండ్రుల సపోర్ట్ చాలా ముఖ్యం. ఈ తేదీల్లో పుట్టిన వారు మాత్రం మంచి తల్లిదండ్రులుగా పేరు తెచ్చుకుంటారు. వారి పిల్లలకు సపోర్ట్ ఇస్తారు. సక్సెస్‌ఫుల్‌గా రాణించడానికి కూడా ఎంతగానో కష్టపడతారు.

ఈ తేదీల్లో పుట్టిన వారు మంచి తల్లిదండ్రులుగా గుర్తింపు పొందుతారు.. ప్రతి విషయంలో కూడా సపోర్ట్ ఇస్తారు

పిల్లలు సక్సెస్ అవ్వాలంటే కచ్చితంగా తల్లిదండ్రుల సపోర్ట్ ఉండాలి. అప్పుడే వారు జీవితంలో పైకి రాగలరు, వారి కలలను నెరవేర్చుకుంటారు. కొంతమంది తల్లిదండ్రులు సులువుగా పిల్లల ఇష్టాలను గమనిస్తారు. అలాగే వారికి సపోర్ట్ కూడా ఇస్తారు.

న్యూమరాలజీ ప్రకారం ఈ తేదీల్లో పుట్టిన వారు మాత్రం మంచి తల్లిదండ్రులుగా పేరు తెచ్చుకుంటారు. పైగా ఈ తేదీల్లో పుట్టిన వారు పిల్లల శక్తి స్థాయిలను బాగా గుర్తిస్తారు, బాగా కమ్యూనికేట్ చేస్తారు, పిల్లల మూడ్‌ను కూడా మార్చగలుగుతారు. పిల్లల కెరీర్‌లో బాగా రాణించడానికి కూడా హెల్ప్ చేస్తారు.

రాడిక్స్ సంఖ్య 2

ఏదైనా నెలలో 2, 11, 20, 29 తేదీల్లో పుట్టినట్లయితే వారి రాడిక్స్ సంఖ్య 2 అవుతుంది. ఈ సంఖ్యకు అధిపతి చంద్రుడు. ఈ తేదీల్లో పుట్టిన వారు మంచి తల్లిదండ్రులుగా గుర్తింపు తెచ్చుకుంటారు. పిల్లలు జీవితంలో ఆనందంగా ఉండేలా చూస్తారు. పిల్లల కెరీర్ విషయంలో కూడా సరైన నిర్ణయాలు తీసుకుని, వారిని సంతోషంగా ఉండేలా చేస్తారు.

రాడిక్స్ సంఖ్య 5

ఏదైనా నెలలో 5, 14, 23 తేదీల్లో పుట్టినట్లయితే వారి రాడిక్స్ సంఖ్య 5 అవుతుంది. ఈ సంఖ్యకు అధిపతి బుధుడు. ఈ తేదీల్లో పుట్టిన వారు బాగా తెలివైన వారు. అలాగే పిల్లలకు మంచి స్నేహితులుగా ఉంటారు. రాడిక్స్ సంఖ్య 5కు చెందినవారు పిల్లలతో ఫ్రెండ్లీగా ఉంటారు. పిల్లల విషయంలో అన్ని సదుపాయాలు ఉండేటట్టు చూస్తారు. పిల్లలు కూడా తల్లిదండ్రులతో అన్నిటినీ పంచుకుంటారు. ఏ విషయాన్ని కూడా దాచిపెట్టరు.

రాడిక్స్ సంఖ్య 6

ఏదైనా నెలలో 6, 15, 24 తేదీల్లో పుట్టినట్లయితే వారి రాడిక్స్ సంఖ్య 6 అవుతుంది. ఈ సంఖ్యకు అధిపతి శుక్రుడు. ఈ తేదీల్లో పుట్టిన వారు విలాసవంతమైన జీవితాన్ని గడుపుతారు. అలాగే పిల్లలతో మంచి కమ్యూనికేషన్ ఉంటుంది. పిల్లలను బాగా ప్రోత్సహిస్తారు. పిల్లలు చెప్పేదాన్ని శ్రద్ధగా వింటారు. వారిని బాగా మోటివేట్ కూడా చేస్తారు.

  • Peddinti Sravya
    ABOUT THE AUTHOR
    Peddinti Sravya

    పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More