మీ పేరు 'H' అక్షరంతో మొదలవుతుందా? అయితే ప్రేమ, కెరీర్ మొదలు వ్యక్తిత్వం గురించి కూడా తెలుసుకోండి!

ప్రతి ఒక్కరూ మరొకరితో పోల్చుకుంటే చాలా భిన్నంగా ఉంటారు. కానీ ప్రతి ఒక్కరిలో కూడా ఏదో ఒక ప్రత్యేకత ఉంటుంది. ఏ ఇద్దరి మనస్తత్వం, ప్రవర్తన ఒకేలా ఉండవు. మీ పేరు కూడా 'H' అక్షరంతో మొదలవుతుందా? 'H' అక్షరంతో పేరు మొదలవుతున్నట్లయితే వారి స్వభావం, ప్రవర్తన ఎలా ఉంటుంది? మరి ఇక ఆ వివరాలను తెలుసుకుందాం.

Published on: Feb 2, 2026, 10:00:26 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ఎలా అయితే రాశుల ఆధారంగా, నక్షత్రాల ఆధారంగా ఒక మనిషి వ్యక్తిత్వం, ఆలోచన తీరు చెప్పొచ్చో, అలాగే మనిషి పేరులో మొదటి అక్షరం కూడా అనేక విషయాలను చెబుతుంది. పేరులో మొదటి అక్షరం బట్టి వారు ఎలాంటి వారు, వారి ఆలోచనలు ఎలా ఉంటాయి, వారి ప్రవర్తన ఎలా ఉంటుంది ఇలా చాలా విషయాలు చెప్పొచ్చు.

మీ పేరు 'H' అక్షరంతో మొదలవుతుందా? అయితే మీ గురించి ఇక్కడ తెలుసుకోండి (pinterest)
మీ పేరు 'H' అక్షరంతో మొదలవుతుందా? అయితే మీ గురించి ఇక్కడ తెలుసుకోండి (pinterest)

ప్రతి ఒక్కరూ మరొకరితో పోల్చుకుంటే చాలా భిన్నంగా ఉంటారు. కానీ ప్రతి ఒక్కరిలో కూడా ఏదో ఒక ప్రత్యేకత ఉంటుంది. ఏ ఇద్దరి మనస్తత్వం, ప్రవర్తన ఒకేలా ఉండవు. మీ పేరు కూడా 'H' అక్షరంతో మొదలవుతుందా? 'H' అక్షరంతో పేరు మొదలవుతున్నట్లయితే వారి స్వభావం, ప్రవర్తన ఎలా ఉంటుంది? మరి ఇక ఆ వివరాలను తెలుసుకుందాం.

మీ పేరు 'H' అక్షరంతో మొదలవుతుందా? అయితే మీ గురించి ఇక్కడ తెలుసుకోండి

'H' అక్షరంతో పేరు మొదలవుతున్నట్లయితే వారు ఎప్పుడూ ప్రశాంతంగా జీవించడానికి ఇష్టపడతారు. పైగా ప్రకృతి ప్రేమికులు కూడా ఈ వ్యక్తులు. వీరు ఎప్పుడూ పరిశుభ్రంగా ఉంటారు. ప్రతిదీ కూడా శుభ్రంగా ఉండాలని భావిస్తారు. పైగా ఏదైనా నేర్చుకోవాలి అనుకుంటే కచ్చితంగా త్వరగా నేర్చుకుంటారు. ఎప్పుడూ బిజీగా ఉంటారు. వీరిని చూసి ఎదుటివాళ్లు ఎక్కువ కష్టపడుతున్నారని భావిస్తారు.

త్వరగా కోపం వచ్చేస్తుంది, అంతే త్వరగా తగ్గిపోతుంది

హెచ్ అక్షరంతో పేరు మొదలవుతున్నట్లయితే వారు చాలా త్వరగా కోపానికి గురవుతారు. అయితే ఎదుటి వారు చెప్పిన విషయాన్ని అంత గమ్మున నమ్మరు. బాగా ఆలోచించిన తర్వాత మాత్రమే నిర్ణయాలు తీసుకుంటారు. ఎవరినైనా సరే తొందరగా ఇష్టపడతారు. అలాగే గుర్తింపు పొందాలని కూడా ఎప్పుడూ శ్రమిస్తారు.

ఎంత కష్టమైన పనైనా సరే చేస్తారు. వారికి ఉపయోగం ఉందంటే కచ్చితంగా పని ఎంత కష్టమైనదైనా సరే చేయడానికి రెడీగా ఉంటారు. ఉన్నత స్థాయికి చేరుకుని మంచి పేరు తెచ్చుకోవాలని తపన వీరికి ఎక్కువగా ఉంటుంది. సమయానికి తగ్గట్టుగా వారిని వారు మార్చుకోగలరు. అంతేకాకుండా ఏదైనా గట్టిగా ఫిక్స్ అయితే, అందులో వారు దూసుకుపోతారు.

ఆత్మాభిమానం, స్వేచ్ఛ:

వారికంటూ వారు ప్రత్యేకమైన గుర్తింపును కోరుకుంటారు. ఎవరి మీద ఆధారపడటం వారికి నచ్చదు. స్వేచ్ఛగా ఉండటానికి వీరు ఎక్కువగా ఇష్టపడతారు.

ప్రేమ, కెరీర్:

హెచ్ అక్షరంతో పేరు మొదలవుతున్నట్లయితే వీరు ప్రేమలో చాలా నిజాయితీగా ఉంటారు. వారి భావాలను వ్యక్తపరచడానికి కొంచెం సమయం తీసుకుంటారు. నాయకత్వ లక్షణాలు వీరిలో ఎక్కువగా ఉంటాయి. ఇవి వారిని ఉన్నత స్థాయికి చేరుకునేలా చేస్తుంది.

అందరికీ సహాయం చేయాలనుకుంటారు

హెచ్ అక్షరంతో పేరు మొదలవుతున్నట్లయితే వీళ్ళు అందరికీ సహాయం చేయాలని అనుకుంటారు. అలాగే ఎప్పుడూ చురుకుగా, ధైర్యంగా ఉంటారు. మానసికంగా మృదువుగా ఉంటారు. ఎక్కువ కష్టపడతారు. వ్యాపారంలో కూడా ఎంతో శ్రద్ధగా ఉంటారు.

  • Peddinti Sravya
    ABOUT THE AUTHOR
    Peddinti Sravya

    పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More