మీ పేరు 'S' అక్షరంతో మొదలవుతుందా? అయితే మీ వ్యక్తిత్వం ఎలా ఉంటుందో తెలుసుకోండి!
పేరులో మొదటి అక్షరాన్ని బట్టి కూడా చాలా విషయాలను తెలుసుకోవచ్చు. ఒక్కొక్కరి ప్రవర్తన, తీరు ఒక్కొక్క విధంగా ఉంటుంది. పేరులో మొదటి అక్షరాన్ని బట్టి వ్యక్తిత్వం తీరు గురించి చాలా విషయాలను చెప్పడానికి వీలవుతుంది. మీ పేరు కూడా ఎస్ అక్షరంతో మొదలవుతుందా? అయితే మీ గురించి చాలా విషయాలను ఇక్కడ తెలుసుకోవచ్చు.
రాశుల ఆధారంగా చాలా విషయాలను తెలుసుకోవడం మనం చూస్తూ ఉంటాం. అలాగే పేరులో మొదటి అక్షరాన్ని బట్టి కూడా చాలా విషయాలను తెలుసుకోవచ్చు. ఒక్కొక్కరి ప్రవర్తన, తీరు ఒక్కొక్క విధంగా ఉంటుంది. పేరులో మొదటి అక్షరాన్ని బట్టి వ్యక్తిత్వం తీరు గురించి చాలా విషయాలను చెప్పడానికి వీలవుతుంది. మీ పేరు కూడా ఎస్ అక్షరంతో మొదలవుతుందా? అయితే మీ గురించి చాలా విషయాలను ఇక్కడ తెలుసుకోవచ్చు.

పేరు 'ఎస్' అక్షరంతో మొదలవుతున్నవారు ఎలా ఉంటారు?
పేరు ఎస్ అక్షరంతో మొదలవుతున్నట్లయితే, వారు అందరితో ఇట్టే కలిసిపోతారు. స్నేహపూర్వకంగా ఉంటారు. ఇతరులతో ఎక్కువగా ఆనందంగా గడపడానికి ఇష్టపడతారు. అలాగే ఇతరులను ఆకర్షించే సామర్థ్యం కూడా వీరికి ఉంటుంది. చుట్టూ ఉన్న వారిని సరదాగా ఉంచుతారు. వీరికి అందరితో కలిసిపోయి సరదాగా సమయాన్ని గడపడం ఎంతో ఇష్టం. ఇతరులు చెప్పేదాన్ని కూడా ఓపికగా వింటారు.
ప్రేమ, సంబంధాలు
పేరు ఎస్ అక్షరంతో మొదలవుతున్నట్లయితే వారు రొమాంటిక్‌గా ఉంటారు. అలాగే అన్ని సంబంధాలను భావోద్వేగ పరంగా కొనసాగిస్తూ ఉంటారు. జీవిత భాగస్వామితో కూడా ప్రేమగా ఉంటారు. సమస్యలను సులభంగా పరిష్కరిస్తారు.
పనితీరు, లక్షణాలు
పేరు ఎస్ అక్షరంతో మొదలవుతున్నట్లయితే వారు ఎంతో కష్టపడి పనిచేస్తారు. ఎలాంటి సమస్య వచ్చినా సరే సులభంగా పరిష్కరిస్తారు. లక్ష్యాన్ని సాధించడానికి ఏ సవాల్ ఎదురైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉంటారు. సృజనాత్మక ఉద్యోగాలు, కళారంగాల పట్ల వీరికి ఆసక్తి ఎక్కువగా ఉంటుంది.
ఈ రంగాల్లో వీరికి బాగా కలిసి వస్తుంది
పేరు ఎస్ అక్షరంతో మొదలవుతున్నవారు డిజైనర్, ఫ్యాషన్ డిజైనింగ్, గ్రాఫిక్ నవల రచయిత, ఆర్ట్ థెరపిస్ట్, ఎగ్జిబిషన్ డిజైనర్, మ్యూజియం మేకప్ ఆర్టిస్ట్, ఆర్ట్ డైరెక్టర్, మేనేజ్‌మెంట్ కన్సల్టెంట్, క్రియేటివ్ రైటర్, డేటా సైంటిస్ట్, ఫోరెన్సిక్ స్పెషలిస్ట్, సైబర్ సెక్యూరిటీ అనలిస్ట్, బయోమెడికల్ ఇంజనీర్, టెక్నికల్ రైటర్ వంటి ఉద్యోగాల్లో బాగా రాణిస్తారు.
ప్రతికూల ఆలోచనలు
అలాగే ఎస్ అక్షరంతో పేరు మొదలవుతున్నట్లయితే, వారు కొన్నిసార్లు ప్రతికూల ఆలోచనలు కూడా కలిగి ఉంటారు. అదే వారి బలహీనత అని చెప్పొచ్చు. కొన్నిసార్లు వారు మార్పును అంత ఈజీగా స్వీకరించలేరు. మార్పును ఏ మాత్రం కోరుకోరు. ఈ అక్షరంతో పేరు ఉన్నవారికి పట్టుదల ఎక్కువ. ఎప్పుడూ మొండిగా ఉంటారు. కొన్నిసార్లు కాస్త తొందరపడి నిర్ణయాలు తీసుకుంటారు.
జీవిత భాగస్వామికి సపోర్ట్
ఎస్ అక్షరంతో పేరు మొదలవుతున్నట్లయితే వారు వారి జీవిత భాగస్వామికి ఎల్లప్పుడూ తోడుగా ఉంటారు. ముఖ్యంగా దుఃఖ సమయంలో తోడుగా నిలుస్తారు. ఖరీదైన బహుమతులకంటే ప్రేమను ఇస్తారు. నమ్మకంగా ఉంటారు.
దయా గుణం
ఎస్ అక్షరంతో పేరు మొదలవుతున్నట్లయితే వారికి దయాగుణం ఎక్కువ. ఎవరికైనా కష్టం వస్తే సాయం చేయడానికి ముందుంటారు. ఎవరినీ మోసం చేయడం వారికి ఇష్టం ఉండదు. డబ్బు విలువ కూడా వీరికి బాగా తెలుసు. డబ్బే ప్రపంచం కాదని భావిస్తారు. అలాగే స్నేహానికి కూడా వీరు ఎక్కువ విలువ ఇస్తారు.
కోప స్వభావం
సహజంగా ఎస్ అక్షరంతో పేరు మొదలవుతున్నవారికి కోపం తక్కువగా ఉంటుంది. కానీ ఒకసారి కోపం వస్తే దాన్ని ఆపడం చాలా కష్టం. కోపం వచ్చినప్పుడు వీరు నిగ్రహాన్ని కోల్పోతారు. ఇది కూడా వీరిలో ఉన్న అతిపెద్ద బలహీనత.
ABOUT THE AUTHORPeddinti Sravyaపెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More

E-Paper


