Zodiac signs: ఈ రాశుల అమ్మాయిలు వెరీ కూల్.. అంత ఈజీగా కోపం రాదు!

ప్రతి ఒక్కరికి బలాలు, బలహీనతలు ఉంటాయి. అవి ఒకరితో పోల్చుకుంటే మరొకరికి వేరుగా ఉంటాయి. అయితే ఈ రాశుల అమ్మాయిలు మాత్రమే ఎంతో కూల్‌గా ఉంటారు. ఈ రాశుల అమ్మాయికి అంత ఈజీగా కోపం రాదు. ఓర్పుతో, శాంతితో ఉంటారు. ప్రతి ఒక్కరికి కూడా ఏదో ఒక సమయంలో కోపం వస్తుంది. కొంత మందికి చాలా ఫాస్ట్‌గా కోపం వచ్చేస్తుంది. 

Published on: Dec 10, 2025, 13:30:00 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

పుట్టిన తేదీ ఆధారంగా చాలా విషయాలను చెప్పవచ్చు. అలాగే రాశుల ఆధారంగా కూడా అనేక విషయాలు చెప్పవచ్చు. రాశుల ఆధారంగా ఒక మనిషి వ్యక్తిత్వం, తీరు ఎలా ఉంటుందని చెప్పడంతో పాటుగా భవిష్యత్తు గురించి కూడా ఎన్నో విషయాలు చెప్పచ్చు. కొన్ని రాశుల వారు కొన్ని ప్రత్యేకమైన గుణాలను కలిగి ఉంటారు. ప్రతి ఒక్కరికి బలాలు, బలహీనతలు ఉంటాయి. అవి ఒకరితో పోల్చుకుంటే మరొకరికి వేరుగా ఉంటాయి. అయితే ఈ రాశుల అమ్మాయిలు మాత్రమే ఎంతో కూల్‌గా ఉంటారు. ఈ రాశుల అమ్మాయికి అంత ఈజీగా కోపం రాదు.

ఈ రాశుల అమ్మాయిలు వెరీ కూల్.. కోపం రావడం చాలా కష్టం (pinterest)
ఈ రాశుల అమ్మాయిలు వెరీ కూల్.. కోపం రావడం చాలా కష్టం (pinterest)

ఓర్పుతో, శాంతితో ఉంటారు. అయితే ప్రతి ఒక్కరికి కూడా ఏదో ఒక సమయంలో కోపం వస్తుంది. కొంత మందికి చాలా ఫాస్ట్‌గా కోపం వచ్చేస్తుంది. ప్రతి చిన్న విషయానికి ఎక్కువ కోప్పడుతూ ఉంటారు. కోపం రావడం సహజమే. అయితే ఈ రాశుల అమ్మాయిలు మాత్రం చాలా కూల్‌గా ఉంటారు. అంత ఈజీగా ఈ రాశి అమ్మాయిలకు కోపం రాదు. ఓర్పుతో ఉంటారు, ఎల్లప్పుడూ శాంతంగా ఉంటారు. మరి ఆ రాశులు ఎవరు? వీరిలో మీరు ఒకరేమో చూసుకోండి.

ఈ రాశుల అమ్మాయిలు వెరీ కూల్.. కోపం రావడం చాలా కష్టం

1.మిథున రాశి

మిథున రాశికి అధిపతి బుధుడు. ఈ రాశి వారు చాలా తెలివైన వారు. కమ్యూనికేషన్ నైపుణ్యాలు ఎక్కువగా ఉంటాయి. మిథున రాశి అమ్మాయిలు ఎప్పుడూ కూడా కూల్‌గా ఉంటారు. ప్రశాంతంగా ఆలోచిస్తారు. ఆనందంగా ఉంటారు. ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు ఎక్కువసార్లు ఆలోచిస్తూ ఉంటారు. ఓర్పు కూడా మిథున రాశి అమ్మాయిలకు ఎక్కువ. కోపాన్ని కంట్రోల్ చేసుకుంటారు. అంత ఈజీగా కోపాన్ని చూపించరు.

2.సింహ రాశి

సింహ రాశికి అధిపతి సూర్యుడు. ఈ రాశి అమ్మాయిలు కూడా అంత ఈజీగా కోప్పడరు. ఓర్పుతో ఉంటారు. గొడవలు పడడం, వాదించడం సింహ రాశి అమ్మాయిలకు నచ్చదు. ప్రశాంతంగా ఉంటారు. ఓపికగా సమాధానాలు చెబుతారు.

3.కర్కాటక రాశి

కర్కాటక రాశి అమ్మాయిలు చాలా సెన్సిటివ్. ఈ రాశి అమ్మాయిలు ఎప్పుడూ కూడా కూల్‌గా ఉంటారు. అంత ఈజీగా కోపం రాదు. అలాగే ఇతరులు చెప్పిన మాటలను నమ్మి మోసపోవడం వంటివి ఉండవు. ఎప్పుడూ ఓర్పుతో, తెలివితేటలతో ఉంటారు.

4.కన్యా రాశి

కన్యా రాశి అమ్మాయిలు కూడా వెరీ కూల్. కన్యా రాశి అమ్మాయిలు అందరినీ ఇష్టపడతారు. సమయాన్ని జాగ్రత్తగా ఉపయోగించుకుంటారు. ఎప్పుడూ ఎవరినీ తప్పుగా అర్థం చేసుకోవడం, విభేదాలు పెట్టుకోవడం వంటివి చేయరు. ఈ రాశి అమ్మాయిలకు కూడా పెద్దగా కోపం రాదు.

5.కుంభ రాశి

కుంభ రాశికి అధిపతి శని. ఈ రాశి అమ్మాయిలు కూడా అంత ఈజీగా కోప్పడరు. తెలివిగా ఉంటారు. ప్రశాంతత వీరికి ఎల్లప్పుడూ ఉంటుంది. ఇతరులు చెప్పినప్పుడు కూడా జాగ్రత్తగా, ఓపికతో వింటారు. ఇతరులకు హెల్ప్ చేయడం అంటే కూడా ఈ రాశి అమ్మాయిలకు ఎంతో ఇష్టం.

  • Peddinti Sravya
    ABOUT THE AUTHOR
    Peddinti Sravya

    పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More