Vastu Shastra: వాస్తు ప్రకారం ఇంట్లో ఈ 5 ఖాళీగా లేకుండా చూసుకోండి, లేకపోతే చాలా సమస్యలు రావచ్చు!
వాస్తు ప్రకారం పాటించడం వలన సానుకూల శక్తి ప్రవహిస్తుంది, ప్రతికూల శక్తి తొలగిపోతుంది. వాస్తు ప్రకారం పాటించడం వలన ఇంట్లో ఉన్న సమస్యలు కూడా తొలగిపోతాయి. అందుకే చాలా మంది వాస్తు ప్రకారం పాటిస్తూ ఉంటారు. అయితే, మనం చేసే చిన్న చిన్న పొరపాట్ల వలన ఎంతో పెద్ద నష్టం కలుగుతుంది.
చాలామంది వాస్తు ప్రకారం పాటిస్తూ ఉంటారు. వాస్తు ప్రకారం పాటించడం వలన సానుకూల శక్తి ప్రవహిస్తుంది, ప్రతికూల శక్తి తొలగిపోతుంది. వాస్తు ప్రకారం పాటించడం వలన ఇంట్లో ఉన్న సమస్యలు కూడా తొలగిపోతాయి. అందుకే చాలా మంది వాస్తు ప్రకారం పాటిస్తూ ఉంటారు. అయితే, మనం చేసే చిన్న చిన్న పొరపాట్ల వలన ఎంతో పెద్ద నష్టం కలుగుతుంది. వాస్తు ప్రకారం ఇంట్లో ఈ తప్పులు జరగకుండా చూసుకోవాలి. ముఖ్యంగా ఇంట్లో కొన్ని వస్తువులు ఖాళీగా అయిపోకుండా చూసుకోవాలి. లేదంటే పేదరికంతో బాధపడాల్సి ఉంటుంది, ప్రతికూల శక్తి కూడా కలుగుతుంది.

వాస్తు శాస్త్రం
ఆర్థిక ఇబ్బందులు లేకుండా ఆనందంగా ఉండడానికి, సానుకూల శక్తి ప్రవహించడానికి ఖచ్చితంగా వాస్తు నియమాలను పాటించండి. లేకపోతే లేనిపోని సమస్యలు, టెన్షన్, రిలేషన్‌షిప్‌లో ఇబ్బందులతో బాధపడాల్సి ఉంటుంది.
వాస్తు ప్రకారం ఇంట్లో ఇవి ఖాళీగా లేకుండా చూసుకోండి, లేకపోతే చాలా సమస్యలు వచ్చే అవకాశం ఉంది
1.పర్సు లేదా బీరువా:
వాస్తు శాస్త్రం ప్రకారం చూసినట్లయితే ఎప్పుడూ కూడా పర్సు లేదా బీరువాను ఖాళీగా ఉంచడం మంచిది కాదు. అలా చేసినట్లయితే సమస్యలు వస్తాయి. అలాగే పర్సులో ఎప్పుడూ కొంత డబ్బు ఉండాలి. బీరువాలో కూడా విలువైన వస్తువులు, డబ్బులు వంటివి పెట్టాలి. లేకపోతే ఆర్థిక సమస్యలు వస్తాయి. అలాంటి సమస్యలు రాకుండా ఉండాలంటే వాటిని ఎప్పుడూ ఖాళీగా ఉంచకండి.
2.బియ్యం డబ్బా:
బియ్యం డబ్బాను కూడా ఖాళీ చేయకండి. ఎప్పుడూ కూడా వంటింట్లో పెట్టే బియ్యం డబ్బా ఖాళీగా ఉండకూడదు, నిండుగా బియ్యంతో ఉండాలి. వంటగదిలో అన్నపూర్ణాదేవి కొలువై ఉంటుంది కాబట్టి ఎప్పుడూ కూడా బియ్యం డబ్బాను ఖాళీగా పెట్టడం మంచిది కాదు. అలా చేస్తే అన్నపూర్ణకు కోపం వస్తుంది. బియ్యం పూర్తిగా ఖాళీ అవ్వడానికి ముందే అందులో బియ్యం పోసి ఉంచండి. ఎప్పుడూ అదే పద్ధతిని ఫాలో అవ్వడం మంచిది.
3.బాత్రూంలో నీటి బకెట్:
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉండే కుండ లేదా బకెట్లో నీరు ఉండాలి. అవి ఖాళీగా ఉండకూడదు. అలా ఉన్నట్లయితే ఆర్థిక సమస్యలు, మానసిక ఒత్తిడి వంటివి కలుగుతాయి. కనీసం కొంచెం నీళ్లు అయినా వదిలేయండి. అప్పుడు సానుకూల శక్తి ప్రవహిస్తుంది.
4.పూజ గది:
పూజ గదిలో ఉండే నీటి కుండ లేదా చెంబులో నీళ్లు ఉండాలి. అవి ఖాళీగా ఉండటం వలన ప్రతికూల శక్తితో బాధపడాల్సి ఉంటుంది. వాటిని ఎప్పుడూ కూడా నీటితో ఉంచాలి. అలాగే ఆ నీటిలో కొన్ని పువ్వులు లేదా మామిడి ఆకులు వేయండి. ఇలా చేయడం వలన సానుకూల శక్తి ప్రవహిస్తుంది, సమస్యలు ఉండవు.
ABOUT THE AUTHORPeddinti Sravyaపెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More

E-Paper


