వారాహి నవరాత్రుల్లో ఇలా కంద దీపం వెలిగించి, ఈ మంత్రాన్ని జపిస్తే చాలు.. అమ్మవారి అనుగ్రహంతో సమస్యలన్నీ మాయం

ఆషాఢ మాసంలో ప్రారంభమయ్యే వారాహి నవరాత్రుల్లో కంద దీపం వెలిగించే విధానం, దాని ఆధ్యాత్మిక ప్రాముఖ్యత, శ్రీ వారాహి దేవి మూల మంత్రం, భక్తులు పాటించాల్సిన పూజా విధానం, విశ్వాసాల ప్రకారం కలిగే ఫలితాల గురించి పూర్తి వివరాలు తెలుసుకోండి.

Published on: Jul 16, 2026, 11:01:03 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

నిన్నటి నుంచి ఆషాఢ మాసం మొదలైన విషయం తెలిసిందే. ఆషాఢం అనగానే చాలా మంది శూన్యమాసం అని, మంచిది కాదని భావిస్తారు. కానీ ఆషాఢ మాసానికి కూడా ఎంతో విశిష్టత ఉంది. ఆషాఢ మాసంలో కొన్ని పరిహారాలను పాటించడం, కొన్ని పద్ధతులను అనుసరించడం వల్ల సంతోషంగా ఉండొచ్చు.

వారాహి నవరాత్రుల్లో ఇలా కంద దీపం వెలిగించి, ఈ మంత్రాన్ని జపిస్తే చాలు.. అమ్మవారి అనుగ్రహంతో సమస్యలన్నీ మాయం (pinterest)
వారాహి నవరాత్రుల్లో ఇలా కంద దీపం వెలిగించి, ఈ మంత్రాన్ని జపిస్తే చాలు.. అమ్మవారి అనుగ్రహంతో సమస్యలన్నీ మాయం (pinterest)

అలాగే, ఆషాఢ పాడ్యమి నుంచి వారాహి నవరాత్రులు మొదలవుతాయి. నిన్నటి నుంచి ఆషాడ మాసం కనుక ఈ తొమ్మిది రోజులను సరిగ్గా సద్వినియోగం చేసుకోవడం మంచిది. ఈ వారాహి నవరాత్రుల సమయంలో కొన్ని పద్ధతులు, పరిహారాలు పాటించడం వల్ల అనేక విధాలుగా ప్రయోజనాలు కలుగుతాయి. అలాగే, ఈ నవరాత్రుల్లో కుదిరితే కంద దీపాన్ని వెలిగించండి. ఈ దీపానికి ఎంతో విశిష్టత ఉంది. ఈరోజు దాని గురించి తెలుసుకుందాం.

కంద దీపం

వారాహి అమ్మవారికి ఈ తొమ్మిది రోజుల్లో ఏదో ఒక రోజు ఇలా కంద దీపాన్ని పెట్టండి. చాలా మంది వారాహి నవరాత్రులను ఎంతో నియమనిష్ఠలతో, భక్తితో జరుపుతారు. అయితే, తొమ్మిది రోజులు చేయలేని వారు తొమ్మిది రోజుల్లో ఏదో ఒక రోజు అయినా సరే కంద దీపాన్ని వెలిగించడం మంచిది. ఈ కంద దీపం వెలిగించడం వల్ల వారాహి నవరాత్రులు తొమ్మిది రోజులు పూజ చేసినంత ఫలితం దక్కుతుందని భక్తుల విశ్వాసం.

కంద దీపాన్ని ఎలా వెలిగించాలి?

ఒక కందగడ్డ తీసుకుని పైన చిన్నగా కోయాలి. కంద చుట్టూ పసుపు రాసి, ఆ తర్వాత కుంకుమ బొట్లు పెట్టాలి. అనంతరం ఆవు నెయ్యి పోసి, వత్తులు వేసి దీపాన్ని సిద్ధం చేయాలి. దీపాన్ని వెలిగించేటప్పుడు ఏక హారతి లేదా అగర్బత్తితో వెలిగించండి.

ఇలా కంద దీపాన్ని వెలిగించి అమ్మవారిని ఆరాధించడం వల్ల అనేక విధాలుగా ప్రయోజనాలు కలుగుతాయి. అమ్మవారి అనుగ్రహంతో కష్టాలన్నీ తొలగిపోతాయని విశ్వాసం. చివరిగా అమ్మవారికి నైవేద్యం సమర్పించండి. కుదిరితే బెల్లంతో పానకం చేసి నివేదన చేయండి. ఇది అమ్మవారికి ఎంతో ఇష్టం.

శ్రీ వారాహి దేవి మూల మంత్రం

ఓం ఐం హ్రీం శ్రీం ఐం గ్లౌం ఐం

నమో భగవతి

వార్తాళి వార్తాళి

వారాహి వారాహి

వరాహముఖి వరాహముఖి

అంధే అంధిని నమః

రుంధే రుంధిని నమః

జంభే జంభిని నమః

మోహే మోహిని నమః

స్తంభే స్తంభిని నమః

సర్వదుష్టప్రదుష్టానాం

సర్వేషాం సర్వవాక్-చిత్త-చక్షు-

ముఖ-గతి-జిహ్వా

స్తంభనం కురు కురు

శీఘ్రం వశ్యం కురు కురు

ఐం గ్లౌం ఐం

ఠః ఠః ఠః ఠః హుం ఆస్ట్రాయ ఫట్ స్వాహా...

వారాహి నవరాత్రుల్లో పఠించాల్సిన మూల మంత్రం కూడా జపించండి. వారాహి అమ్మవారి అనుగ్రహం కలగాలంటే అమ్మవారి మూలమంత్రాన్ని భక్తిశ్రద్ధలతో జపించాలి. ఈ మంత్రాన్ని జపించడం వల్ల అమ్మవారి ప్రత్యేక అనుగ్రహాన్ని పొందవచ్చు. ఈ వారాహి నవరాత్రులను సద్వినియోగం చేసుకుని మూలమంత్రాన్ని జపిస్తే మీ కష్టాలన్నీ కూడా తొలగిపోతాయని భక్తుల విశ్వాసం.

  • Peddinti Sravya
    ABOUT THE AUTHOR
    Peddinti Sravya

    పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More