నేటి నుంచి వారాహి నవరాత్రులు ప్రారంభం.. పూజా విధానం, నియమాలు, జపించాల్సిన మంత్రంతో పాటు పూర్తి వివరాలు ఇవిగో

వారాహి నవరాత్రులు 2026 జూలై 15 నుంచి జూలై 23 వరకు నిర్వహిస్తారు. వారాహి దేవి విశిష్టత, ప్రతి రోజు పూజించాల్సిన రూపాలు, పూజా విధానం, పాటించాల్సిన నియమాలు, శత్రు నివారణ, ఆర్థికాభివృద్ధి కోసం చేసే ఆరాధన, జపించాల్సిన బీజ మంత్రం పూర్తి వివరాలు తెలుసుకోండి.

Published on: Jul 15, 2026, 09:30:21 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ఈరోజు నుంచి ఆషాఢ మాసం మొదలైంది. ప్రతి ఆషాఢ మాసంలో పాడ్యమి నుంచి నవమి వరకు తొమ్మిది రోజుల పాటు వారాహి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఈ రోజు నుంచి తొమ్మిది రోజుల పాటు వారాహి అమ్మవారి నవరాత్రులు జరుగుతున్నాయి. ఈ సమయంలో వారాహి అమ్మవారిని ఆరాధించడం వల్ల అనేక శుభఫలితాలు కలుగుతాయని భక్తుల విశ్వాసం. ఈసారి వారాహి నవరాత్రులు ఎప్పుడు వచ్చాయి? తేదీలతో పాటు పూర్తి వివరాలు తెలుసుకుందాం.

నేటి నుంచి వారాహి నవరాత్రులు ప్రారంభం.. పూజా విధానం, నియమాలు, జపించాల్సిన మంత్రం (pinterest)
నేటి నుంచి వారాహి నవరాత్రులు ప్రారంభం.. పూజా విధానం, నియమాలు, జపించాల్సిన మంత్రం (pinterest)

అసలు వారాహి దేవి ఎవరు?

వారాహి దేవి సప్తమాతృకలలో ఒకరుగా చెప్పబడుతుంది. ఆమె శక్తి స్వరూపిణి, శత్రుసంహారిణి, భక్తులను కాపాడే దైవంగా ఆరాధించబడుతుంది. వారాహి దేవికి లలితా త్రిపురసుందరీ దేవి సేనాధిపతిగా కూడా ప్రత్యేక స్థానం ఉంది.

వారాహి నవరాత్రులు 2026

వారాహి నవరాత్రులు జూలై 15, బుధవారం (ఈరోజు) నుంచి ప్రారంభమై, జూలై 23, గురువారం వరకు మొత్తం తొమ్మిది రోజుల పాటు నిర్వహిస్తారు. ఈ తొమ్మిది రోజులు ప్రతిరోజూ అమ్మవారికి హోమం, అభిషేకం నిర్వహిస్తారు. తమ కోరికలు నెరవేరాలని, అమ్మవారి అనుగ్రహంతో సకల సంపదలు కలగాలని భక్తిశ్రద్ధలతో పూజిస్తారు.

సాధారణంగా సూర్యాస్తమయం తర్వాత వారాహి అమ్మవారిని ఆరాధించడం విశేషంగా భావిస్తారు. అయితే, వారాహిని ప్రధాన దేవతగా భావించి ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం మూడు కాలాల్లో కూడా ఈ నవరాత్రుల సమయంలో పూజించవచ్చు.

వారాహి నవరాత్రుల్లో ఏ రోజు ఏ రూపాన్ని పూజించాలి?

జూలై 15, బుధవారం – లలిత వారాహి దేవి

జూలై 16, గురువారం – అశ్వారూఢ వారాహి దేవి

జూలై 17, శుక్రవారం – గజారూఢ వారాహి దేవి

జూలై 18, శనివారం – శ్రీ స్వప్న వారాహి దేవి

జూలై 19, ఆదివారం – పంచమి వారాహి దేవి

జూలై 20, సోమవారం – సింహవాహన వారాహి దేవి

జూలై 21, మంగళవారం – కుక్కుటవాహన వారాహి దేవి

జూలై 22, బుధవారం – కనకదుర్గ వారాహి దేవి

జూలై 23, గురువారం – రాజరాజేశ్వరి లేదా మహిషాసురమర్దిని వారాహి దేవి

వారాహి అమ్మవారిని ఎందుకు పూజించాలి?

వారాహి అమ్మవారిని ఈ నవరాత్రుల్లో భక్తిశ్రద్ధలతో పూజించడం వల్ల శత్రు భయాలు తొలగిపోతాయని విశ్వాసం. శత్రువులపై విజయాన్ని సాధించే శక్తి లభిస్తుందని చెబుతారు.

అలాగే కోర్టు కేసులతో బాధపడుతున్న వారు అమ్మవారిని ఆరాధించడం వల్ల సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చని నమ్మకం.

కుటుంబ కలహాలు తొలగి ఇంట్లో శాంతి నెలకొంటుందని, ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న వారు కూడా ఈ నవరాత్రులను సద్వినియోగం చేసుకుంటే మంచి ఫలితాలు పొందవచ్చని భక్తులు విశ్వసిస్తారు.

అదే విధంగా దుష్టశక్తులు, చెడు ప్రభావాల నుంచి రక్షణ కలగాలంటే ఈ తొమ్మిది రోజుల పాటు వారాహి అమ్మవారిని భక్తిశ్రద్ధలతో ఆరాధించడం శుభప్రదంగా భావిస్తారు.

వారాహి నవరాత్రుల సమయంలో పాటించాల్సిన నియమాలు

వారాహి నవరాత్రుల సమయంలో మద్యం, మాంసాహారం వంటి వాటికి దూరంగా ఉండాలి.

కేవలం సాత్విక ఆహారం మాత్రమే తీసుకోవాలి.

భక్తిశ్రద్ధలతో అమ్మవారిని ఆరాధించాలి. నిర్మలమైన మనసుతో పూజలు చేయాలి.

నవరాత్రుల చివరి రోజు కుమారి పూజ, సుహాసిని పూజలు చేసుకుంటే మంచిది.

పెద్దవారిని దూషించడం, ఇంట్లో గొడవలు పడడం వంటి వాటికి దూరంగా ఉండాలి. మనసును ప్రశాంతంగా ఉంచి వారాహి అమ్మవారిని ఏకాగ్రతతో ఆరాధించాలి.

భక్తిశ్రద్ధలతో వారాహి అమ్మవారిని కొలిస్తే శాంతి, ఐశ్వర్యం కలుగుతాయి. అలాగే ఆధ్యాత్మిక చైతన్యాన్ని కూడా పొందవచ్చని విశ్వాసం.

జపించాల్సిన మంత్రం

ఓం ఐం హ్రీం శ్రీం వారాహ్యై నమః అనే ఈ బీజ మంత్రాన్ని జపిస్తే మంచిది.

  • Peddinti Sravya
    ABOUT THE AUTHOR
    Peddinti Sravya

    పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More