ఈ 3 రాశులకు నేటి నుంచి నుండి ధనవంతులు అయ్యే ఛాన్స్.. సూర్య, యమ కలయిక గొప్ప విజయాన్ని తెస్తుంది!
జనవరి 23న సూర్యుడు మరియు యముడు 0 డిగ్రీల వద్ద సంయోగం చెందుతారు. హిందూ మతంలో యముడిని సూర్యుడి కుమారుడిగా చెబుతారు. యముడిని ధర్మరాజు అని కూడా అంటారు. ఈ రెండిటి సంయోగం కొన్ని రాశుల వారికి బాగా కలిసి రాబోతోంది. ఈ రెండిటి కలయిక వలన కొన్ని రాశుల వారి అదృష్టం పెరుగుతుంది. సక్సెస్‌ను అందుకుంటారు.
గ్రహాలు ఎప్పటికప్పుడు వాటి సంచారంలో మార్పు చేస్తాయి. గ్రహాల సంచారంలో మార్పు వస్తే, అది అన్ని రాశుల వారిపై ప్రభావం చూపిస్తుంది. జనవరి 23 సూర్యుడు, యముడు సంయోగం జరుగుతుంది. ఇది చాలా శక్తివంతమైనది. దీంతో కొన్ని రాశుల వారికి శుభ ఫలితాలు కలుగుతాయి. అదృష్టం పెరుగుతుంది. ఆదాయం కూడా ఎక్కువవుతుంది. ఇలా ఒకటి కాదు, రెండు కాదు, అనేక లాభాలు కలుగుతాయి.

జనవరి 23న సూర్యుడు మరియు యముడు 0 డిగ్రీల వద్ద సంయోగం చెందుతారు. హిందూ మతంలో యముడిని సూర్యుడి కుమారుడిగా చెబుతారు. యముడిని ధర్మరాజు అని కూడా అంటారు. ఈ రెండిటి సంయోగం కొన్ని రాశుల వారికి బాగా కలిసి రాబోతోంది. ఈ రెండిటి కలయిక వలన కొన్ని రాశుల వారి అదృష్టం పెరుగుతుంది. సక్సెస్‌ను అందుకుంటారు. కొత్త అవకాశాలు స్వయంగా వెతుక్కుంటూ వస్తాయి.
సూర్య, యమల సంయోగంతో ఈ రాశుల వారికి అద్భుతాలు.. అనేక విధాలుగా లాభాలు
1.మేష రాశి
మేష రాశి వారికి ఇది శుభ సమయం. ఈ సమయంలో మేష రాశి వారు అనేక విధాలుగా ప్రయోజనాలను పొందుతారు. కష్టానికి తగ్గ ఫలితం ఉంటుంది. కొత్త అవకాశాలను పొందుతారు. ఉద్యోగంలో, వ్యాపారంలో కూడా అనేక ప్రయోజనాలు కలుగుతాయి. సానుకూల శక్తి ప్రవహిస్తుంది. కొత్త ప్రాజెక్టులను చేపడతారు. కెరీర్‌లో మంచి నిర్ణయాలు తీసుకుంటారు.
2.సింహ రాశి
సింహ రాశి వారికి ఇది శుభ సమయం. ఈ రెండిటి కలయిక ఈ రాశి వారికి ప్రమోషన్లను తీసుకొస్తుంది. కెరీర్‌లో మంచి మార్పులు ఉంటాయి. ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. అప్పులు తీరిపోతాయి. ఆరోగ్యం మెరుగుపడుతుంది. ప్రయాణాలకు సంబంధించి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. సక్సెస్‌ను అందుకుంటారు.
3.మకర రాశి
మకర రాశి వారికి ఇది శుభ సమయం. ఈ రెండిటి కలయిక ఈ రాశి వారికి కష్టానికి తగ్గ ఫలితాన్ని ఇస్తుంది. కొత్త అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి. ఉద్యోగంలో, వ్యాపారంలో బాగుంటుంది. ఆర్థికపరంగా లాభాలు ఉంటాయి. రిలేషన్‌షిప్ బాగుంటుంది. ఇన్వెస్ట్‌మెంట్ చేస్తే భవిష్యత్తులో బాగా కలిసి వస్తుంది. కుటుంబంలో ఆనందం ఉంటుంది. మానసిక ఒత్తిడి తొలగిపోతుంది.
గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.
ABOUT THE AUTHORPeddinti Sravyaపెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More

E-Paper


