కేతువు సంచారం 2026: కేతువు నక్షత్ర మార్పుతో ఏ రాశుల వారికి శుభం కలుగుతుంది? కొత్త అవకాశాలు, వ్యాపారాలు ఇలా ఎన్నో!
ఒక్కోసారి గ్రహాల సంచారంలో మార్పు కారణంగా శుభ ఫలితాలు ఎదురైతే, ఇంకోసారి అశుభ ఫలితాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. మరో ఐదు రోజులు అంటే జనవరి 25న కేతువు నక్షత్ర సంచారంలో మార్పు జరగబోతోంది. కేతువు జనవరి 25న పూర్వఫాల్గుణి నక్షత్రం మొదటి పాదంలోకి ప్రవేశిస్తాడు. దీంతో కొన్ని రాశుల వారికి శుభ ఫలితాలు కలుగుతాయి.
గ్రహాలు ఎప్పటికప్పుడు వాటి రాశులను మారుస్తూ ఉంటాయి. గ్రహాల సంచారంలో మార్పు జరిగినప్పుడు అది అన్ని రాశుల వారి జీవితాల్లో చాలా మార్పులను తీసుకు వస్తుంది. ఒక్కోసారి గ్రహాల సంచారంలో మార్పు కారణంగా శుభ ఫలితాలు ఎదురైతే, ఇంకోసారి అశుభ ఫలితాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. మరో ఐదు రోజులు అంటే జనవరి 25న కేతువు నక్షత్ర సంచారంలో మార్పు జరగబోతోంది. కేతువు జనవరి 25న పూర్వఫాల్గుణి నక్షత్రం మొదటి పాదంలోకి ప్రవేశిస్తాడు. దీంతో కొన్ని రాశుల వారికి శుభ ఫలితాలు కలుగుతాయి.

కేతువు నక్షత్ర సంచారంలో మార్పు.. కొన్ని రాశుల వారి జీవితాల్లో వెలుగులు నింపుతుంది
కేతువు నక్షత్ర సంచారంలో మార్పు రావడంతో 12 రాశుల వారిపై ప్రభావం పడుతుంది. కానీ కొన్ని రాశుల వారు మాత్రం ఎక్కువ లాభాలను పొందుతారు. ఈ సమయంలో కెరీర్, రిలేషన్‌షిప్, మానసిక స్థితిపై కూడా ప్రభావం పడుతుంది.
కేతువు ఎలా వ్యక్తిగత జీవితంపై ప్రభావం చూపిస్తాడు?
- కేతువును కర్మ గ్రహం అని అంటారు. కేతువు కెరీర్‌లో సమస్యలు, కన్ఫ్యూజన్ తీసుకురావచ్చు. కుటుంబంలో దూరం కూడా పెరగవచ్చు. అపార్థాలు, అహంకారం వంటివి టెన్షన్ లేదా రిలేషన్‌షిప్‌లో పెరుగడానికి దారితీస్తాయి.
- జాతకంలో కేతువు సరైన దశలో లేకపోతే డిప్రెషన్, నిద్రలో సమస్యలు, కాన్ఫిడెన్స్ లేకపోవడం వంటివి కలుగుతాయి.
- ఆరోగ్యపరంగా కూడా సమస్యలు వస్తాయి. జీర్ణ సమస్యలు లేదా నరాల వ్యవస్థలో మార్పులు వంటివి కనిపించవచ్చు.
- మానసిక ఆరోగ్యం కూడా దెబ్బతింటుంది.
కేతువు నక్షత్ర సంచారం ఏ రాశుల వారికి మేలు చేస్తుంది?
సింహ రాశి
సింహ రాశి వారికి కేతువు సంచారంతో శుభ ఫలితాలు కలుగుతాయి. సంతోషంగా ఉంటారు. పిల్లల నుంచి సపోర్ట్ ఉంటుంది. పని ప్రదేశంలో కూడా అన్నీ సక్రమంగా సాగుతాయి. సీనియర్ల నుంచి సపోర్ట్ లభిస్తుంది.
వృషభ రాశి
వృషభ రాశి వారికి కూడా ఇది మంచి సమయం. కుటుంబ జీవితం ఆనందంగా ఉంటుంది. ఉద్యోగంలో, వ్యాపారంలో కూడా చక్కటి ఫలితాలను చూస్తారు. మొత్తం మీద ఈ రాశి వారికి కేతువు సంచారం బాగుంటుంది.
వృశ్చిక రాశి
వృశ్చిక రాశి వారికి ఆర్థికపరంగా కలిసి వస్తుంది. కొత్త అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి. వ్యాపారంలో కూడా ఎక్కువ లాభాలు ఉంటాయి. మొత్తం మీద ఈ రాశి వారికి కూడా కేతువు సంచారం బాగుంటుంది.
ఈ రాశి వారికి సమస్యలు రావచ్చు
మిథున రాశి
ఈ రాశి వారికి కేతువు సంచారం కాస్త ఛాలెంజ్‌గా ఉంటుంది. మిథున రాశి వారికి కేతువు నక్షత్ర సంచారంతో కొన్ని ఎత్తుపల్లాలు ఎదురవుతాయి. వ్యాపారంలో, ప్రేమ జీవితంలో కూడా కొన్ని మార్పులు వస్తాయి. అనవసరంగా అందరిని గుడ్డిగా నమ్మడం మంచిది కాదు.
ABOUT THE AUTHORPeddinti Sravyaపెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More

E-Paper


