కార్తీక మాసంలో ఆకాశ దీపం ఎందుకు వెలిగిస్తారు? చాలా మందికి తెలియని పురాణ రహస్యం!

కార్తీక మాసంలో శివకేశవుల ఆరాధనతో పాటు దీపారాధనకు కూడా ఎంతో ప్రాధాన్యత ఉంది. ఈ మాసంలో ఇంటి ప్రాంగణంలో లేదా ఎత్తైన ప్రదేశాల్లో దీపాన్ని ఏర్పాటు చేసి వెలిగించడాన్ని ఆకాశ దీపం అంటారు. ఆకాశ దీపం వెలిగించడం వల్ల సర్వలోకాలకు వెలుగును ప్రసరింపజేసినట్లు భక్తులు భావిస్తారు.

Published on: Nov 10, 2026, 16:00:25 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

హిందూ సంప్రదాయంలో కార్తీక మాసానికి ఉన్న విశిష్టత గురించి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. కార్తీక మాసంలో శివకేశవులను పూజిస్తారు. కార్తీక మాసంలో దీపారాధనకు ఎంతో ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది. తులసి కోట దగ్గర, దేవుడి మందిరంలో, దేవాలయాల్లో దీపాలను వెలిగిస్తూ ఉంటారు. అలాగే ఆకాశ దీపాన్ని కూడా ఏర్పాటు చేస్తూ ఉంటారు. అసలు ఆకాశ దీపం అంటే ఏంటి? కార్తీక మాసంలో ఎందుకు ఆకాశ దీపాన్ని వెలిగించాలి? ఆకాశ దీపం వెలిగించడం వెనుక ఉన్న పురాణ విశేషాల గురించి ఈరోజు తెలుసుకుందాం.

కార్తీక మాసంలో ఆకాశ దీపం ఎందుకు వెలిగిస్తారు? చాలామందికి తెలియని పురాణ రహస్యం! (AI)
కార్తీక మాసంలో ఆకాశ దీపం ఎందుకు వెలిగిస్తారు? చాలామందికి తెలియని పురాణ రహస్యం! (AI)

ఆకాశ దీపం అంటే ఏంటి?

కార్తీక మాసంలో ఎత్తైన ప్రదేశంలో లేదా పొడవైన కర్రకు దీపాన్ని వేలాడదీస్తారు. ఆ దీపాన్ని వెలిగిస్తారు. సాధారణంగా ఈ దీపాన్ని సాయంత్రం పూట వెలిగించడం జరుగుతుంది. కొన్ని ప్రాంతాల్లో అయితే ఇంటి ప్రాంగణంలో, ఆలయ ధ్వజస్తంభం సమీపంలో, ఎత్తైన ప్రదేశాల్లో ఈ ఆకాశ దీపాలను ఏర్పాటు చేయడం జరుగుతుంది.

ఆకాశ దీపాన్ని వెలిగిస్తే సర్వలోకాలకు వెలుగును ప్రసరింపజేసినట్లు భక్తులు భావిస్తారు. దీపం వెలిగించడం వలన అంధకారం తొలగి వెలుగు వ్యాపిస్తుంది. దీపం జ్ఞానానికి, పవిత్రతకు ప్రతీక.

కార్తీక మాసంలో ఆకాశ దీపాన్ని ఎందుకు వెలిగించాలి?

కార్తీక మాసం శివుడికి, విష్ణుమూర్తికి ఎంతో ఇష్టమైన మాసం. దీపాన్ని వెలిగించడం వలన దైవానుగ్రహం పొందవచ్చు. ఆకాశ దీపాన్ని వెలిగిస్తే పితృదేవతలకు మార్గదర్శకత్వం లభిస్తుందని కొన్ని సంప్రదాయాల్లో ఉంది. పూర్వీకులను స్మరించుకుని దీపదానం చేయడం వలన పూర్వీకుల అనుగ్రహం లభిస్తుంది.

కార్తీక మాసంలో ఆకాశ దీపాన్ని వెలిగిస్తే పితృదేవతలకు మార్గదర్శకత్వం లభిస్తుందని నమ్మకం. కార్తీక మాసంలో ప్రతిరోజూ సాయంత్రం పూట ఆకాశ దీపాన్ని వెలిగిస్తే శాంతి కలుగుతుంది.

పురాణ విశేషాలు

కార్తీక మాసంలో ఆకాశ దీపం వెలిగించడం వెనుక పురాణ కారణాలు కూడా ఉన్నాయి. కొన్ని పురాణాల్లో, ధర్మశాస్త్రాల్లో ఆకాశ దీపం గురించి ప్రస్తావించబడింది. విష్ణుమూర్తిని దామోదరుడిగా ఆరాధిస్తూ ఆకాశ దీపాన్ని సమర్పించే ఆచారం వైష్ణవ సంప్రదాయంలో ఉంది.

మరికొన్ని సంప్రదాయాల ప్రకారం, శివకేశవుల దివ్య దర్శనం కోసం ప్రత్యేకంగా ఈ ఆకాశ దీపాన్ని వెలిగిస్తారు. ఆకాశ దీపం అంటే కేవలం ఒక దీపం కాదు. దీని వెనుక పైన చెప్పినట్లుగా వివిధ కారణాలు ఉన్నాయి. ఈ ఆచారానికి ప్రాంతాలను బట్టి భిన్నమైన కారణాలు ఉన్నాయి.

కార్తీక మాసంలో ఆకాశ దీపం ఎలా వెలిగించాలి?

ఇంటి ప్రాంగణంలో లేదా మేడపై ఎత్తైన ప్రదేశాన్ని ఎంచుకోవాలి.

పొడవైన వెదురు కర్రకు లేదా స్తంభానికి దీపాన్ని ఏర్పాటు చేయాలి.

మట్టి ప్రమిద లేదా లోహ దీపాన్ని ఎంచుకోవచ్చు.

నువ్వుల నూనె లేదా నెయ్యితో ఈ దీపాన్ని వెలిగించాలి.

సాయంత్రం సూర్యాస్తమయం అయిన తర్వాత ఈ దీపారాధన చేయాలి.

ఆకాశ దీపం సమర్పించేటప్పుడు ఈ శ్లోకాన్ని చదువుకోండి

దామోదరాయ నభసి తులాయాందోలయా సహ

ప్రదీపం తే ప్రయచ్ఛామి నమో నంతాయ వేదసే

  • Peddinti Sravya
    ABOUT THE AUTHOR
    Peddinti Sravya

    పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More