...
...
Next Story

Poli Padyami: కార్తీక మాసం తర్వాత వచ్చే పోలి పాడ్యమి.. తేదీ, సమయం, కథ వివరాలు!

కార్తీక మాసం ముగిసిన తర్వాత వచ్చే మార్గశిర శుక్ల పాడ్యమిని పోలి పాడ్యమిగా, పోలి స్వర్గం రోజుగా ఆచరిస్తారు. కార్తీక మాసమంతా దీపారాధన, వ్రతాలు చేసిన భక్తులు ఈ రోజున కూడా ప్రత్యేకంగా దీపాలు వెలిగించి నీటిలో విడిచిపెడతారు.

Published on: Nov 26, 2026, 13:00:37 IST
Advertisement

కార్తీక మాసం పూర్తయిన తర్వాత వచ్చే మార్గశిర శుద్ధ పాడ్యమిని పోలి పాడ్యమి అంటారు. పోలి పాడ్యమిని పోలి స్వర్గం అని కూడా అంటారు. కార్తీక మాసంలో పోలి పాడ్యమి నాడు కార్తీక మాసం అంతా దీపారాధన, వ్రతాలు చేసిన వారు పోలి పాడ్యమి రోజు కూడా దీపాలు విడిచి పెడతారు. కార్తీక మాసంలో వెలిగించిన దీపాల ఆధ్యాత్మిక ప్రాముఖ్యతకు సంబంధించిన సంప్రదాయాలతో పోలి పాడ్యమి కూడా ముడిపడి ఉంది. ఈ సంవత్సరం పోలి పాడ్యమి ఎప్పుడు వచ్చింది? తేదీ, సమయంతో పాటు పోలి కథ కూడా చూసేద్దాం .

పోలి పాడ్యమి 2026 తేదీ, సమయం:

Poli Padyami: కార్తీక మాసం తర్వాత వచ్చే పోలి పాడ్యమి.. తేదీ, సమయం, కథ వివరాలు! (AI)
Poli Padyami: కార్తీక మాసం తర్వాత వచ్చే పోలి పాడ్యమి.. తేదీ, సమయం, కథ వివరాలు! (AI)

డిసెంబర్ 10, గురువారం నాడు పోలి పాడ్యమి వచ్చింది. పాడ్యమి తిథి డిసెంబర్ 9 ఉదయం 6:21కి ప్రారంభమవుతుంది. డిసెంబర్ 10 ఉదయం 8:46తో ముగుస్తుంది. స్థానిక పంచాంగం, సూర్యోదయ నియమాల ఆధారంగా ప్రాంతీయ పంచాంగాల్లో తేదీల్లో స్వల్ప మార్పు ఉండొచ్చు.

పోలిస్వర్గం కథ:

కార్తీక మాసంలో దీపారాధన, పూజలు, ఉపవాసాలు వంటివి చేస్తూ ఉంటారు. కార్తీక మాసం పూర్తయ్యాక.. మార్గశిర శుక్ల పాడ్యమిని పోలి పాడ్యమిగా ఆచరించడం జరుగుతుంది. పోలి స్వర్గం అనే పేరుతో కూడా ఇది ప్రసిద్ధి చెందింది. అయితే పోలి పాడ్యమి నాడు తెల్లవారుజామున స్నానం చేసి పూజలు చేస్తారు. అలాగే దీపారాధన కూడా చేస్తారు. అరటి దొప్పలో దీపాలు వెలిగించి నీళ్లలో విడిచిపెడతారు. పోలి స్వర్గం కథ చదువుతారు. ఆ రోజు పోలి స్వర్గం కథ విన్నా, చదివినా కూడా ఎంతో పుణ్యం వస్తుందని భావిస్తారు.

పోలి పాడ్యమి కథ:

పూర్వం ఒకానొక గ్రామంలో పోలి అనే ఒక మహిళ ఉండేది. పేదరికంతో జీవించేది. అయినా కూడా భగవంతుడిపై అపారమైన భక్తి కలిగి ఉండేది. కార్తీక మాసం చాలా పవిత్రమైనదని భావించి, ఆ నెలలో దీపాలను వెలిగించేది, భగవంతుడిని ఆరాధించేది, పూజలు చేసేది. ఆమె ఇంట్లో ఎన్నో కష్టాలు ఉన్నా కూడా కార్తీక మాసంలో దీపాన్ని వెలిగించాలనే సంకల్పాన్ని మాత్రం వదిలిపెట్టలేదు. తనకున్న కొద్దిపాటి నూనెతో, చిన్న వత్తులతో దీపాన్ని వెలిగించి ఆ భగవంతుడికి ప్రార్థించేది. ఆమె భక్తి, ఆచరణ పట్ల కొంతమంది నిర్లక్ష్యంగా చూసినా, పోలి మాత్రం తన భక్తిని కొనసాగించేది.

కార్తీక మాసంలో చేసే పూజలు, దీపారాధనకు ఎంతో విశిష్టత ఉంది. పోలికి స్వర్గప్రాప్తి కలిగింది. అందుకే కార్తీక మాసం పూర్తయ్యాక మార్గశిర శుక్ల పాడ్యమి నాడు పోలి కథ చదివి, అక్షింతలు వేసుకోవడం పవిత్రమైనదిగా భావిస్తారు.

 

ABOUT THE AUTHOR

పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారు

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks