రేపే కార్తీక పౌర్ణమి.. 365 దీపాలు వెలిగించే విధానం, జపించాల్సిన మంత్రాలతో పాటు పూజా విధానాన్ని తెలుసుకోండి!
కార్తీక పౌర్ణమి నాడు పూజలు, దీపారాధన, నది స్నానం ఇలా భక్తులు శివుని అనుగ్రహం పొందడానికి పాటిస్తూ ఉంటారు. కొంత మంది రకరకాల పరిహారాలు పాటిస్తూ ఉంటారు. కార్తీక పౌర్ణమి వచ్చేస్తోంది. ఆ రోజు చేసే పూజలకు, ఉపవాసాలకు ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది. ఆ రోజు ఉపవాసము ఉంటే కోటి పూజలతో సమానమైన పుణ్య ఫలితం కలుగుతుంది.
ప్రతి సంవత్సరం కార్తీకమాసంలో వచ్చే పౌర్ణమి నాడు కార్తీక పౌర్ణమి జరుపుకుంటాము. ఈ సంవత్సరం కార్తీక పౌర్ణమి నవంబర్ 5, బుధవారం, అంటే రేపు వచ్చింది. కార్తీక పౌర్ణమి నాడు పూజలు, ఉపవాసాలు, దీపారాధన, నది స్నానం ఇలా భక్తులు శివుని అనుగ్రహం పొందడానికి పాటిస్తూ ఉంటారు. కొంత మంది రకరకాల పరిహారాలు కూడా పాటిస్తూ ఉంటారు.

కార్తీక పౌర్ణమి వచ్చేస్తోంది. ఆ రోజు చేసే పూజలకు, ఉపవాసాలకు ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది. ఆ రోజు ఉపవాసము ఉంటే కోటి పూజలతో సమానమైన పుణ్య ఫలితం కలుగుతుంది. కార్తీక పౌర్ణమి నాడు నది స్నానం ఆచరించినా, వన భోజనాలు చేసినా, ఉసిరి దీపాన్ని వెలిగించినా ఎన్నో రెట్లు ఫలితం వస్తుంది.
కార్తీక పౌర్ణమి 2025:
కార్తీక పౌర్ణమి నాడు 365 వత్తులతో దీపాన్ని వెలిగించాలి. అలా చేయడం వలన శివుడుని సంవత్సరమంతా పూజించినంత పుణ్యఫలితం కలుగుతుంది. కాబట్టి పౌర్ణమి తిథి నాడు కచ్చితంగా 365 వత్తులతో దీపాన్ని వెలిగించండి.
పౌర్ణమి తిథి ఎప్పటి నుంచి మొదలవుతుంది?
కార్తీక పౌర్ణమి నవంబర్ 4వ తేదీ రాత్రి 10:40కి మొదలై, నవంబర్ 5 సాయంత్రం 7 గంటల వరకు ఉంటుంది. ఉదయ తిథి ప్రకారం చేసుకోవాలి. కనుక నవంబర్ 5న కార్తీక పౌర్ణమిని జరుపుకోవాలి. కార్తీక పౌర్ణమికి ఎంతో శక్తి ఉంది. ఒక రోజు చేసే పూజలకు ఎంతో ఎక్కువ రెట్లు పుణ్యఫలితాన్ని పొందవచ్చు. ముక్కోటి దేవతల అనుగ్రహాన్ని కూడా పొందడానికి వీలవుతుంది.
కార్తీక పౌర్ణమి రోజు ఏం చేయాలి?
- తెల్లవారుజామున నిద్రలేచి దీపారాధన చేయాలి. తప్పకుండా నది స్నానం చేయడం ముఖ్యం. అలా చేయడం వలన తెలిసి చేసిన, తెలియక చేసిన పాపాలన్నీ తొలగిపోతాయి. అఖండ పుణ్యప్రాప్తిని పొందవచ్చు.
- ఒకవేళ నది స్నానం చేయలేని వారు గంగాజలం లేదా పసుపును స్నానం చేసే నీళ్లలో కలుపుకుని, పుణ్య నదుల పేర్లను తలుచుకుంటూ స్నానం చేయండి.
- గడపలకు పసుపు రాసి బొట్లు పెట్టండి. బియ్యం పిండితో ఇంటి ముందు ముగ్గు వేయండి.
- ఇంటికి మామిడి తోరణాలు కట్టి అందంగా అలంకరించండి. గుమ్మం అందంగా ఉంటే ఐశ్వర్యం కలుగుతుంది.
- తెల్లవారుజామున 5 నుంచి 9 గంటల వరకు పూజ చేసుకోవచ్చు. రేపు కార్తీక పౌర్ణమి నాడు నారికేళ దీపాన్ని వెలిగిస్తే చాలా మంచిది. పూజ గదిలో ఉన్న శివపార్వతుల ఫోటోకు, లక్ష్మీనారాయణుడికి పూల దండలు వేయండి, అందంగా అలంకరించండి.
- ఆడవారు తప్పకుండా ఈరోజు కాళ్లకు పసుపు రాసుకోవాలి. కార్తీక పౌర్ణమి నాడు ఎరుపు రంగు లేదా ఆకుపచ్చ రంగు దుస్తులు ధరిస్తే మంచిది.
కార్తీక దీపాలు
మట్టి దీపాలు లేదా పిండి దీపాలను వెలిగిస్తే ఎంతో పుణ్యం కలుగుతుంది. పిండి దీపాలను వెలిగించాలనుకుంటే 5 లేదా 7 దీపాలను వెలిగించవచ్చు. కొబ్బరి దీపాన్ని కూడా ఈ దీపాలతో పాటుగా వెలిగించండి.
జపించాల్సిన మంత్రాలు:
ఈరోజు “ఓం నమశ్శివాయ” అనే మంత్రాన్ని 21 సార్లు జపిస్తే మంచిది. లేదా “ఓం నమో భగవతే వాసుదేవాయ” అనే మంత్రాన్ని కూడా జపించవచ్చు.
చెట్ల కింద దీపారాధన:
రావి చెట్టు కింద దీపారాధన చేస్తే ఎంతో పుణ్యం కలుగుతుంది. లేదా ఉసిరి చెట్టు కింద కూడా చేయవచ్చు. ఉసిరి చెట్టు కింద ఉసిరి దీపాలు వెలిగిస్తే శుభ ఫలితాలు ఎదురవుతాయి.
365 దీపాలు వెలిగించే విధానం:
365 వత్తులతో దీపాన్ని వెలిగించేటప్పుడు అగ్గిపుల్లతో లేదా కొవ్వొత్తితో వెలిగించకండి. అగర్బత్తితో వెలిగించడం మంచిది. ఈ వత్తులు వెలిగించిన తర్వాత అక్షింతలు వేసి.. “దామోదరం ఆవాహయామి” లేదా “త్రయంబకం ఆవాహయామి” అని చెప్పుకోవాలి.
ABOUT THE AUTHORPeddinti Sravyaపెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More

E-Paper


