కార్తీక పౌర్ణమి రోజు దీపాలు ఎందుకు వెలిగిస్తారు? త్రిపురాసురుడి వధ వెనుక ఆసక్తికరమైన కథ!
హిందూ సంప్రదాయంలో కార్తీక పౌర్ణమికి ఎంతో విశిష్టమైన ప్రాధాన్యత ఉంది. 2026లో కార్తీక పౌర్ణమి నవంబర్ 24, మంగళవారం రోజున వస్తోంది. ఈ రోజును దేవ దీపావళిగా కూడా జరుపుకుంటారు. పరమశివుడు త్రిపురాసురుడిని సంహరించిన సందర్భంగా దేవతలు కాశీలో దీపాలు వెలిగించి సంబరాలు చేసుకున్నారని పురాణ కథనం.
హిందూ సంప్రదాయంలో కార్తీక పౌర్ణమికి ఉన్న విశిష్టత అంతా ఇంతా కాదు. ఈ సంవత్సరం కార్తీక పౌర్ణమి నవంబర్ 24, మంగళవారం నాడు వచ్చింది. ఆ రోజు విష్ణుమూర్తి, పరమశివుడిని భక్తితో ఆరాధించడం వలన శుభ ఫలితాలు కలుగుతాయి.

చాలా మంది నదిలో పుణ్యస్నానాలు ఆచరిస్తారు. దానధర్మాలు చేయడం, దీపాలు వెలిగించడం వంటివి పాటిస్తే అద్భుతమైన ఫలితాలను చూడొచ్చు. కార్తీక పౌర్ణమిని దేవ దీపావళి అని కూడా అంటారు. ఆ రోజు దీపాలను వెలిగిస్తే దైవానుగ్రహం కలుగుతుందని నమ్మకం.
కార్తీక పౌర్ణమి నాడు దీపాలను ఎందుకు వెలిగించాలి?
కార్తీక పౌర్ణమి నాడు శివుడు త్రిపురాసురుడు అనే రాక్షసుడిని సంహరించాడు. ఆ రాక్షసుడి ఆగడాలతో దేవతలంతా తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. అతని బారి నుంచి రక్షించాలని దేవతలు శివుని ప్రార్థిస్తారు.
దేవతల ప్రార్థనలతో శివుడు ప్రసన్నుడై, ఒకే ఒక్క బాణంతో త్రిపురాసురుడి మూడు నగరాలను నాశనం చేస్తాడు. శివుడి విజయాన్ని చూసి దేవతలు కాశీలో దీపాలు వెలిగించి సంబరాలు చేసుకుంటారు. ఈ సంప్రదాయాన్ని దేవ దీపావళి అని అంటారు. కార్తీక పౌర్ణమి నాడు దీపాలను వెలిగించడానికి విశేష ప్రాధాన్యత ఉంది.
విష్ణువు మత్స్యావతారంతో సంబంధం
కార్తీక పౌర్ణమికి విష్ణువు మత్స్యావతారంతో కూడా సంబంధం ఉంది. కొన్ని పురాణ కథనాల ప్రకారం చూసినట్లయితే, ప్రపంచం ప్రళయాన్ని ఎదుర్కొన్నప్పుడు విష్ణువు చేప రూపాన్ని ధరించి మత్స్యావతారంలో అవతరించాడు. రాజు మనువు ప్రయాణిస్తున్న పడవను రక్షించి, ఈ సృష్టికి సంబంధించిన అమూల్యమైన జ్ఞానాన్ని కాపాడేందుకు సాయం చేస్తాడు. మత్స్యావతారాన్ని నూతన సృష్టికి ప్రతీకగా భావిస్తారు.
కార్తీక పౌర్ణమి నాడు 365 వత్తులతో దీపారాధన
కార్తీక పౌర్ణమి నాడు ఉపవాసం ఉండి చాలా మంది 365 వత్తులను వెలిగిస్తారు. అలా చేయడం వలన ఏడాది అంతా దీపారాధన చేసినంత పుణ్యం కలుగుతుంది. ఏ రోజైనా దీపారాధన చేయకపోతే, కార్తీక పౌర్ణమి నాడు 365 వత్తులు వెలిగిస్తే ఏడాది పొడవునా దీపం పెట్టిన ఫలితం దక్కుతుంది.
గంగా స్నానం
కార్తీక పౌర్ణమి నాడు నదిలో స్నానం చేయడం వలన అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి. పుణ్యస్నానాలు చేసి చాలా మంది దానధర్మాలు చేస్తారు. దాని వలన శుభ ఫలితాలు కలుగుతాయని నమ్ముతారు.
నిరాకరణ: ఈ వ్యాసంలో ఇచ్చిన సమాచారం పూర్తిగా నిజం మరియు ఖచ్చితమైనదని మేము చెప్పము. వివరణాత్మక మరియు మరింత సమాచారం కోసం, దయచేసి సంబంధిత రంగంలోని నిపుణుడిని సంప్రదించండి.
ABOUT THE AUTHORPeddinti Sravyaపెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More

E-Paper


