జ్యోతిష్యశాస్త్రంలో కేతువుకు ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. ఇది ఒక ఛాయా గ్రహం లేదా నీడ గ్రహంగా, అంతుచిక్కని శక్తిగా భావిస్తారు. కేతువు ఎప్పుడూ వెనుకకు, అంటే తిరోగమన దిశలోనే సంచరిస్తాడు. కేతువు కదలికలో మార్పు వచ్చిన ప్రతిసారీ ద్వాదశ రాశుల జీవితాలపై దాని ప్రభావం స్పష్టంగా కనిపిస్తుంది. ప్రస్తుతం కేతువు సూర్యుడికి అధిపతిగా ఉన్న సింహరాశిలో సంచరిస్తున్నాడు. అంతేకాకుండా, తన సొంత నక్షత్రమైన మఖ నక్షత్రంలో కేతువు కొలువుదీరి ఉండటం అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది.

మోక్షం, రహస్య జ్ఞానానికి కారకుడైన కేతువు తన స్వక్షేత్ర నక్షత్రంలో తిరోగమన దిశలో పయనించడం వల్ల కొన్ని రాశుల వారికి రాజయోగం పటబోతోంది. పంచాంగ గణనాల ప్రకారం డిసెంబర్ 5, 2026 వరకు కేతువు మఖ నక్షత్రంలోనే కొనసాగుతాడు. ప్రముఖ జ్యోతిష నిపుణుడు నరేంద్ర ఉపాధ్యాయ్ తెలిపిన వివరాల ప్రకారం…. ఈ నక్షత్ర సంచారం రాబోయే 90 రోజుల పాటు ఆరు రాశుల వారికి గోల్డెన్ డేస్‌ను తీసుకరాబోతోంది. ఆ అదృష్ట రాశుల జాబితా, వారికి కలిగే ప్రయోజనాలు ఇవే:
కర్కాటక రాశి:
మఖ నక్షత్రంలో కేతువు 90 రోజుల పాటు పయనించడం కర్కాటక రాశి వారికి ఎంతో మేలు చేస్తుంది. సమాజంలో మీ స్థానంతో పాటు గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి. ఏ పని తలపెట్టినా అందులో ఆశించిన విజయాన్ని సాధిస్తారు. మీలో సానుకూల శక్తి పెరిగి, నూతన ఉత్సాహంతో ముందుకుసాగుతారు.
మేష రాశి:
మేష రాశి వారికి ఈ కేతు గోచారం ఆర్థికంగా ఎంతో ప్రయోజనకరంగా ఉండబోతోంది. పెద్ద మొత్తంలో లాభాలను తెచ్చిపెట్టే కొత్త ఒప్పందాలు చేసుకునే అవకాశం లభిస్తుంది. ఆర్థిక స్థితి మెరుగుపడి సంపద పెరుగుతుంది. ఇక ఉద్యోగ రంగానికి వస్తే, కెరీర్‌లో పదోన్నతి (ప్రమోషన్) పొందేందుకు కొత్త అవకాశాలు తలుపు తడతాయి.
ధనుస్సు రాశి:
ధనుస్సు రాశి వారికి ఈ సమయం ఎంతో అనుకూలంగా ఉంటుంది. దీర్ఘకాలంగా నడుస్తున్న కోర్టు కేసులు, చట్టపరమైన సమస్యలు సానుకూలంగా పరిష్కారమవుతాయి. కుటుంబంలో లేదా ఉద్యోగంలో శుభవార్తలు వింటారు. ఆత్మవిశ్వాసం పెరిగి కష్టమైన పనులను కూడా సులువుగా పూర్తి చేస్తారు.
సింహ రాశి:
{{/usCountry}}ధనుస్సు రాశి వారికి ఈ సమయం ఎంతో అనుకూలంగా ఉంటుంది. దీర్ఘకాలంగా నడుస్తున్న కోర్టు కేసులు, చట్టపరమైన సమస్యలు సానుకూలంగా పరిష్కారమవుతాయి. కుటుంబంలో లేదా ఉద్యోగంలో శుభవార్తలు వింటారు. ఆత్మవిశ్వాసం పెరిగి కష్టమైన పనులను కూడా సులువుగా పూర్తి చేస్తారు.
సింహ రాశి:
{{/usCountry}}సూర్యుడి రాశి అయిన సింహరాశిలో కేతువు సంచరిస్తుండటం వల్ల ఈ రాశి వారికి అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. విద్యార్థులకు ఏకాగ్రత పెరిగి చదువుపై దృష్టి సారిస్తారు. ఇప్పటివరకు జీవితంలో అనుభవించిన మానసిక ఒత్తిడి, ఆందోళనలు తగ్గి ప్రశాంతత లభిస్తుంది. కాలం మీకు అన్ని విధాలా శుభప్రదంగా మారుతుంది.
మీన రాశి:
మీన రాశి వారికి కేతువు నక్షత్ర మార్పు సానుకూల పరిణామాలను తెస్తుంది. వ్యాపార రంగంలో ఉన్నవారికి అద్భుతమైన అవకాశాలు రావడమే కాకుండా వారి పనితీరుకు ప్రశంసలు దక్కుతాయి. ఇక వ్యక్తిగత జీవితానికి వస్తే, మీ ప్రేమ జీవితం ఎంతో మధురంగా, ఆనందంగా సాగుతుంది.
వృశ్చిక రాశి:
వృశ్చిక రాశి వారికి ఈ 90 రోజుల కాలం ఎంతో శ్రేష్ఠమైనదిగా నిలుస్తుంది. పూర్ణ విశ్వాసంతో తలపెట్టిన ప్రతి పనిని విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు. ఆటంకాలు తొలగిపోయి విజయాలు వరుసకడతాయి.