2026 Annual Horoscope: మీ పుట్టిన తేదీ ఆధారంగా 2026 మీకు ఎలా ఉంటుంది? రాడిక్స్ సంఖ్య 1 నుండి 9 వరకు తెలుసుకోండి!

న్యూమరాలజీ ఆధారంగా చాలా విషయాలను చెప్పవచ్చు. 2025 ఇక త్వరలోనే ముగియబోతోంది, 2026 రాబోతోంది. 2026 రాడిక్స్ సంఖ్యల వారికి బాగుంటుంది. పుట్టిన తేదీ ఆధారంగా రాడిక్స్ సంఖ్యను కనుగొనవచ్చు. మరి మీ రాడిక్స్ సంఖ్య ఆధారంగా 2026 మీకు ఎలా ఉంటుందో తెలుసుకోండి.

Published on: Nov 3, 2025, 15:00:15 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

న్యూమరాలజీ ఆధారంగా చాలా విషయాలను చెప్పవచ్చు. ఒక మనిషి వ్యక్తిత్వం, తీరు ఎలా ఉంటుందో తెలుసుకోవడంతో పాటుగా భవిష్యత్తు గురించి కూడా అంచనా వేయవచ్చు. 2025 ఇక త్వరలోనే ముగియబోతోంది, 2026 రాబోతోంది. 2026 రాడిక్స్ సంఖ్యల వారికి బాగుంటుంది. పుట్టిన తేదీ ఆధారంగా రాడిక్స్ సంఖ్యను కనుగొనవచ్చు. మరి మీ రాడిక్స్ సంఖ్య ఆధారంగా 2026 మీకు ఎలా ఉంటుందో తెలుసుకోండి.

పుట్టిన తేదీ ఆధారంగా 2026 ఎలా ఉంటుందో తెలుసుకోండి (pinterest)
పుట్టిన తేదీ ఆధారంగా 2026 ఎలా ఉంటుందో తెలుసుకోండి (pinterest)

పుట్టిన తేదీ ఆధారంగా 2026 ఎలా ఉంటుందో తెలుసుకోండి

రాడిక్స్ నెంబర్ 1:

ఏదైనా నెలలో 1, 10, 19, 28 తేదీల్లో పుట్టినట్లయితే రాడిక్స్ నెంబర్ 1 అవుతుంది. ఈ తేదీల్లో పుట్టిన వారికి 2026లో కొత్త అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి. కాన్ఫిడెన్స్ పెరుగుతుంది, కష్టాలు తొలగిపోతాయి. ప్రమోషన్లు వచ్చే అవకాశం ఉంది. అనవసరమైన ఖర్చులు చేయకుండా చూసుకోండి.

రాడిక్స్ నెంబర్ 2:

ఏదైనా నెలలో 2, 11, 20, 29 తేదీల్లో పుట్టినట్లయితే వారి రాడిక్స్ సంఖ్య 2 అవుతుంది. 2026లో అప్పుడప్పుడు మూడ్ స్వింగ్స్, కన్ఫ్యూజన్ వంటివి ఎదురవుతాయి. ప్రేమ జీవితం దృఢంగా మారుతుంది. క్రియేటివిటీ పెరుగుతుంది. వ్యాపారస్తులకు ఎక్కువ ఆదాయం వస్తుంది. ఒంటరిగా ఉంటున్న వారికి పెళ్లి కుదిరే అవకాశం ఉంది.

రాడిక్స్ నెంబర్ 3:

ఏదైనా నెలలో 3, 12, 21, 30 తేదీల్లో పుట్టినట్లయితే వారి రాడిక్స్ సంఖ్య 3 అవుతుంది. ఈ తేదీల్లో పుట్టిన వారు 2026లో కొత్త కెరీర్ అవకాశాలను పొందుతారు. లీడర్షిప్ స్కిల్స్ పెరుగుతాయి, ఆదాయం కూడా పెరగవచ్చు. పై చదువులకు బాగా కలిసి వస్తుంది. ప్రేమ జీవితం కూడా ఆనందంగా సాగుతుంది.

రాడిక్స్ నెంబర్ 4:

ఏదైనా నెలలో 4, 13, 22, 31 తేదీల్లో పుట్టినట్లయితే రాడిక్స్ నెంబర్ 4 అవుతుంది. కెరీర్‌లో ఊహించని మార్పులను చూస్తారు. ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. ప్రేమ జీవితంలో ఎత్తుపల్లాలు ఉంటాయి. జీవిత భాగస్వామిని బాధపెట్టే మాటలు అనడం లాంటివి చేయకుండా చూసుకోండి.

రాడిక్స్ నెంబర్ 5:

ఏదైనా నెలలో 5, 14, 23 తేదీల్లో పుట్టినట్లయితే రాడిక్స్ నెంబర్ 5 అవుతుంది. ఈ తేదీల్లో పుట్టిన వారికి కొత్త అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి. ఉద్యోగంలో మార్పు ఉండొచ్చు. వ్యాపారస్తులకు కూడా ఇది శుభసమయం. 2026లో మీ ప్రేమ జీవితం కూడా బాగుంటుంది. కమ్యూనికేషన్‌ను మెయింటైన్ చేయండి, ఆరోగ్యకరమైన డైట్‌ను తీసుకోండి.

రాడిక్స్ నెంబర్ 6:

ఏదైనా నెలలో 6, 15, 24 తేదీల్లో పుట్టినట్లయితే వారి రాడిక్స్ సంఖ్య 6 అవుతుంది. కొత్త సంవత్సరం ఈ తేదీల్లో పుట్టిన వారికి బాగా కలిసి వస్తుంది. ప్రేమ జీవితం ఆనందంగా సాగుతుంది. నాయకత్వ లక్షణాలు పెరుగుతాయి. సంతోషంగా ఉంటారు, బాధ్యతలు కూడా పెరుగుతాయి. కెరీర్‌లో ఊహించని మార్పులు వస్తాయి. మీడియా, బ్యూటీ రంగాల వారికి బాగా కలిసి వస్తుంది.

రాడిక్స్ నెంబర్ 7:

ఏదైనా నెలలో 7, 16, 25 తేదీల్లో పుట్టినట్లయితే వారి రాడిక్స్ సంఖ్య 7 అవుతుంది. విజయాలను అందుకుంటారు. రిలేషన్షిప్ బాగుంటుంది. ఉద్యోగస్తులకు కూడా ఇది శుభసమయం. ఊహించని విధంగా ఆదాయం పెరుగుతుంది. రిస్క్ తీసుకోవడం మంచిది కాదు. పాజిటివ్‌గా ఉండాలి.

రాడిక్స్ నెంబర్ 8:

ఏదైనా నెలలో 8, 17, 26 తేదీల్లో పుట్టినట్లయితే రాడిక్స్ నెంబర్ 8 అవుతుంది. కష్టానికి తగ్గ ఫలితాన్ని అందుకుంటారు. 2026లో కొంచెం సహనాన్ని అలవాటు చేసుకోండి. విజయాలను అందుకుంటారు. ఆదాయం పెరుగుతుంది. ప్రమోషన్లు వచ్చే అవకాశం ఉంది. ప్రేమ జీవితంలో మొండిగా ఉండకండి.

రాడిక్స్ నెంబర్ 9:

ఏదైనా నెలలో 9, 18, 27 తేదీల్లో పుట్టినట్లయితే రాడిక్స్ నెంబర్ 9 అవుతుంది. కొత్త అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి. ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఒంటరిగా ఉంటున్న వారు భాగస్వామిని పొందే అవకాశం ఉంది. ఒత్తిడి ఎక్కువ అవ్వకుండా చూసుకోండి.

  • Peddinti Sravya
    ABOUT THE AUTHOR
    Peddinti Sravya

    పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More