ఈ మధ్యకాలంలో ప్రతి ఒక్కరూ సోషల్ మీడియాతో ఎక్కువ సమయం గడుపుతున్నారు. టెక్నాలజీ కూడా బాగా అభివృద్ధి చెందడంతో, దూరంగా ఉన్న వ్యక్తులతో కూడా సోషల్ మీడియా ద్వారా దగ్గరవ్వచ్చు. డిజిటల్ యుగంలో ఒక వ్యక్తిని నేరుగా కలవకముందే వాట్సాప్ లేదా ఇన్‌స్టాగ్రామ్ ప్రొఫైల్ పిక్చర్ చూసి అంచనాకు వచ్చేస్తున్నారు.

మనం పెట్టే ఫోటో అంతరాత్మకు అర్థం పడుతుందని మనస్తత్వ శాస్త్ర నిపుణులు అంటున్నారు. మనల్ని ఎలా ప్రపంచానికి మనం చూపించాలనుకుంటున్నామో డీపీ నిర్ణయిస్తుంది. అయితే చాలా మంది రకరకాల ప్రొఫైల్ పిక్చర్స్‌ను పెడుతూ ఉంటారు. అయితే దానిని బట్టి ఆ వ్యక్తి వ్యక్తిత్వం ఏ విధంగా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం.
మీ వాట్సాప్ డీపీ మీ గురించి ఏం చెప్తోంది? ఫోటోలో దాగి ఉన్న అసలు స్వభావం
గ్రూప్ ఫోటోలు
కొంతమంది ప్రొఫైల్ పిక్చర్ కింద గ్రూప్ ఫోటోలను పెడుతుంటారు. స్నేహితులు లేదా కుటుంబ సభ్యులతో దిగిన ఫోటోలను పెడుతుంటారు. అలాంటి వారు ఒంటరిగా ఉండడానికి అసలు ఇష్టపడరు. ఇలాంటి వారు పదిమందితో కలిసి ఉండడానికి ఉత్సాహాన్ని చూపిస్తారు. గ్రూప్ ఫోటోలను ప్రొఫైల్ పిక్చర్ల కింద పెట్టేవారు బాగా ఎక్స్‌ట్రోవర్ట్స్ అని నిపుణులు విశ్లేషిస్తున్నారు. స్నేహబంధాలకు, బంధుత్వాలకు వీరు ఎక్కువ విలువ ఇస్తారు. అలాగే వారికంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంటుంది. కానీ సమూహంలో భాగంగా ఉండడానికి ఎక్కువ ఆసక్తి చూపిస్తుంటారు.
క్లోజ్ సెల్ఫీలు
కొంత మంది క్లోజ్ సెల్ఫీలను డీపీల కింద పెడుతుంటారు. మీరు కూడా అలాగే పెడుతున్నారా? అయితే మీకు మీపై అపారమైన నమ్మకం ఉంది. ఆత్మవిశ్వాసం, సెల్ఫ్ లవ్ అని కూడా అనొచ్చు. ప్రతి చిన్న విషయాలకు సెల్ఫీలు మార్చే అలవాటు ఉన్నట్లయితే, ఇతరుల నుంచి గుర్తింపు లేదా అంగీకారం కోసం చూస్తున్నారని అర్థం. అలాగే లైక్స్, కామెంట్స్ ద్వారా వచ్చే ఆనందం ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుందని ఈ వ్యక్తులు భావిస్తారు.
నేచర్ ఫోటోలు
కొంత మంది ప్రకృతితో ఉన్న ఫోటోలను పెడుతూ ఉంటారు. పచ్చని చెట్లు, అలలు, అందమైన పువ్వులు వంటివి. ఇలాంటివి పెడుతున్నట్లయితే ప్రశాంతంగా ఉండడానికి ఇష్టపడతారు. అలాగే అనవసరమైన గొడవలకు కూడా దూరంగా ఉంటారు. ఎక్కువగా ప్రకృతిని ఆస్వాదిస్తారు. అందరితో వ్యక్తిగత విషయాలను పంచుకోవడానికి ఇష్టపడరు. ఒక రకంగా వీరు ఇంట్రోవర్ట్స్ అని చెప్పొచ్చు.
పెంపుడు జంతువులు, కార్టూన్లు
{{/usCountry}}కొంత మంది ప్రకృతితో ఉన్న ఫోటోలను పెడుతూ ఉంటారు. పచ్చని చెట్లు, అలలు, అందమైన పువ్వులు వంటివి. ఇలాంటివి పెడుతున్నట్లయితే ప్రశాంతంగా ఉండడానికి ఇష్టపడతారు. అలాగే అనవసరమైన గొడవలకు కూడా దూరంగా ఉంటారు. ఎక్కువగా ప్రకృతిని ఆస్వాదిస్తారు. అందరితో వ్యక్తిగత విషయాలను పంచుకోవడానికి ఇష్టపడరు. ఒక రకంగా వీరు ఇంట్రోవర్ట్స్ అని చెప్పొచ్చు.
పెంపుడు జంతువులు, కార్టూన్లు
{{/usCountry}}కొంత మంది కుక్క పిల్లలు, చిన్న పిల్లలు, కార్టూన్స్ వంటివి పెడుతూ ఉంటారు. అలాంటి వారు సున్నిత మనస్కులు. పైగా మానవత్వం ఎక్కువ ఉంటుంది. వారికంటూ ఒక ఊహా ప్రపంచాన్ని సృష్టించుకుంటారు. అలాగే ఇతరులకు సాయం చేయడానికి కూడా వీరు ఎప్పుడూ ముందుంటారు.
ప్రొఫైల్ పిక్చర్ ఖాళీగా
కొంతమంది ప్రొఫైల్ పిక్చర్‌ను ఖాళీగా వదిలేస్తూ ఉంటారు. అలాంటి వారు రహస్య స్వభావులు. వ్యక్తిగత గోప్యతకు భంగం కలగకూడదని అనుకుంటారు. లేకపోతే ఏదైనా మానసిక సంఘర్షణలో ఉన్నారని, ఎవరితోనూ మాట్లాడడానికి ఇష్టపడట్లేదని అర్థం చేసుకోవాలి.