Left-handed People: ఎడమ చేతి వాటం కలిగిన వ్యక్తుల స్వభావం ఎలా ఉంటుంది? మనస్తత్వం, ప్రత్యేకతలు తెలుసుకోండి!
ఎడమ చేతి వాటం కలిగిన వారు స్వతంత్రంగా జీవిస్తారు. ఎక్కువగా మెదడులో కుడి భాగాన్ని ఉపయోగిస్తారు. ఈ ప్రపంచమంతా కూడా కుడి చేతి వాటం ఉన్న వారి కోసం సృష్టించబడింది. అయితే ఎడమ చేతి వాటం ఉన్న వారి వ్యక్తిత్వం ఎలా ఉంటుంది? ఎడమ చేతి వాటం కలిగిన వారు ఏ విధంగా ఉంటారు అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం.
ఎక్కువ మంది కుడి చేతితోనే రాస్తారు, కానీ చాలా మంది ఎడమ చేత్తో రాస్తూ ఉంటారు, ఎడమ చేతి వాటం కలిగి ఉంటారు. ఈ ప్రపంచమంతా కూడా కుడి చేతి వాటం ఉన్న వారి కోసం సృష్టించబడింది. అయితే ఎడమ చేతి వాటం ఉన్న వారి వ్యక్తిత్వం ఎలా ఉంటుంది? ఎడమ చేతి వాటం కలిగిన వారు ఏ విధంగా ఉంటారు అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం.

ఎడమ చేతి వాటం కలిగిన వ్యక్తుల స్వభావం ఎలా ఉంటుంది?
స్వతంత్రంగా జీవిస్తారు
ఎడమ చేతి వాటం కలిగిన వారు స్వతంత్రంగా జీవిస్తారు. ఎక్కువగా మెదడులో కుడి భాగాన్ని ఉపయోగిస్తారు. సాధారణ మనుషులకంటే నాలుగు నుంచి ఐదు నెలలు ఆలస్యంగా మానసిక పరిపక్వత వీరులో ఉంటుంది. ఎడమ చేతి వాటం కలిగిన వారికి క్రీడల్లో ఆసక్తి ఎక్కువగా ఉంటుంది. ఎడమ చేతి వాటం కలిగిన వారు గణితం, ఆర్కిటెక్చర్‌లో బాగా రాణిస్తారు.
జ్ఞాపకశక్తి ఎక్కువ
కుడి చేతి వాళ్లతో పోల్చితే, ఎడమ చేతి వాటం కలిగిన వారిలో అలర్జీ, ఆస్తమా సమస్యలు ఎక్కువగా వస్తూ ఉంటాయి. ఎడమ చేతి వాటం కలిగిన వ్యక్తులు సొంత నిర్ణయాలు తీసుకునే శక్తి ఎక్కువగా కలిగి ఉంటారు. జ్ఞాపకశక్తి కూడా వీళ్లలో ఎక్కువగా ఉంటుంది. ఒకేసారి ఎక్కువ పనులు చేసే సామర్థ్యం కూడా ఎడమ చేతి వాటం కలిగిన వ్యక్తుల్లో ఉంటుంది. టైపింగ్‌లో కూడా ఎడమ చేతి వాటం కలిగిన వారికి ఎక్కువ లాభాలు ఉంటాయి. ఎడమ చేతి వాటం కలిగిన వారు ఛాంపియన్స్.
క్రియేటివిటీ ఎక్కువగా ఉంటుంది
ఎడమ చేత్తో రాయడం, ఎడమ చేత్తో ఎక్కువ పనులు చేయడం వల్ల క్రియేటివిటీ ఎక్కువగా ఉంటుంది. కళల మీద కూడా వీరికి ఎక్కువ ఆసక్తి ఉంటుంది. కుడివైపు మెదడు భాగం బలంగా ఉంటే ఎడమ చేతి వాటం అలవాటు అయిపోతుంది. అందుకనే ఈ ఎడమ చేతి వాటం కలిగిన వ్యక్తులు మల్టీటాస్కింగ్ చేస్తారు.
సృజనాత్మకత ఎక్కువ
ఎడమ చేతి వాటం కలిగిన వారికే సృజనాత్మకత ఎక్కువగా ఉంటుంది. మ్యూజిక్, డ్రాయింగ్, క్రియేటివిటీ రంగాల్లో ఎక్కువ ప్రతిభ చూపిస్తారు.
స్ట్రాంగ్ ఇమాజినేషన్
ఎడమ చేతి వాటం కలిగిన వారికి ఇమాజినేషన్ పవర్ ఎక్కువగా ఉంటుంది. కొత్త క్రియేషన్లు చేస్తారు, కొత్త ఆలోచనలు వస్తూ ఉంటాయి, ప్రత్యేకమైన సలహాలు కూడా ఇవ్వగలరు.
కొత్త కోణంలో సమస్యలను చూస్తారు
ఎడమ చేతి వాటం కలిగిన వ్యక్తులు ఇతరుల ఆలోచన విధానం కంటే వేరుగా ఉండడంతో కాంప్లికేట్ ప్రాబ్లమ్స్‌కు సింపుల్ సొల్యూషన్స్ ఇస్తారు.
కాగ్నిటివ్ ఫ్లెక్సిబిలిటీ
ఎడమ చేతి వాటం కలిగిన వ్యక్తులు సిచువేషన్‌కి తగ్గట్టుగా అడ్జస్ట్ అయిపోతారు. చుట్టూ ఏం జరుగుతుందో త్వరగా గ్రహిస్తారు. ఈజీగా నిర్ణయం తీసుకుంటారు.
స్వతంత్ర ఆలోచనలు
ఎడమ చేతి వాటం కలిగిన వ్యక్తులకు ఇండిపెండెంట్ థింకింగ్ ఎక్కువగా ఉంటుంది. ఇతరులు ఏమంటున్నారు అనేది పట్టించుకోరు. వారి ఆలోచనలతో ముందుకు వెళ్తారు.
ప్రత్యేకమైన పర్సనాలిటీ
ఎడమ చేతి వాటం వాళ్లు చాలా అరుదుగా ఉంటారు, అందుకే వారి వ్యక్తిత్వం ప్రత్యేకంగా, ఆకర్షణీయంగా ఉంటుంది. గ్రాఫిక్స్, మ్యాప్స్ చదవడం వంటి పనుల్లో నైపుణ్యం ఎక్కువగా ఉంటుంది.
ABOUT THE AUTHORPeddinti Sravyaపెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More

E-Paper


