కుజ ఆదిత్య రాజయోగంతో 2026 ప్రారంభమవుతుంది.. జనవరి 1 నుంచి నాలుగు రాశుల వారికి కాసుల వర్షం!
కొత్త సంవత్సరం కొన్ని రాశుల వారికి జీవితం మారిపోతుంది. గ్రహాల సంచారంలో మార్పు కూడా చూడొచ్చు. కొత్త సంచారం ప్రారంభంలోనే కొన్ని ప్రధాన గ్రహాల సంచారంలో మార్పు రాబోతోంది. దీనితో ద్వాదశ రాశుల వారి జీవితంలో అనేక మార్పులు వస్తాయి. సూర్యుడు, కుజుడు ధనస్సు రాశిలో డిసెంబర్ 16న సంయోగం చెందుతారు.
గ్రహాలు కాలానుగుణంగా వాటి రాశులను మారుస్తూ ఉంటాయి. గ్రహాల సంచారంలో మార్పు వచ్చినప్పుడు అదే అన్ని రాశుల వారి జీవితంలో అనేక మార్పులను తీసుకొస్తుంది. ఒక్కోసారి శుభ ఫలితాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది, ఒక్కోసారి ఆ శుభ ఫలితాలను ఎదుర్కోవలసి ఉంటుంది.

2025 త్వరలోనే పూర్తికాబోతోంది, 2026 రాబోతోంది. కొత్త సంవత్సరం కొన్ని రాశుల వారికి జీవితం మారిపోతుంది. గ్రహాల సంచారంలో మార్పు కూడా చూడొచ్చు. కొత్త సంచారం ప్రారంభంలోనే కొన్ని ప్రధాన గ్రహాల సంచారంలో మార్పు రాబోతోంది. దీనితో ద్వాదశ రాశుల వారి జీవితంలో అనేక మార్పులు వస్తాయి.
శక్తివంతమైన రాజయోగాలు
2026లో చాలా శక్తివంతమైన రాజయోగాలు ఉన్నాయి. అందులో ఒకటి కుజ ఆదిత్య రాజయోగం. సూర్యుడు, కుజుడు ధనస్సు రాశిలో డిసెంబర్ 16న సంయోగం చెందుతారు. దీనితో కుజ ఆదిత్య రాజయోగం ఏర్పడుతుంది. ఈ ఆదిత్య రాజయోగం జనవరి 14 వరకు ఉంటుంది. జనవరి 14న సూర్యుడు మకరరాశిలోకి ప్రవేశిస్తాడు. ఆ తర్వాత మళ్లీ కొన్నాళ్లకు ఈ రెండు గ్రహాల సంయోగం ఉంటుంది. అయితే ఈ రాజయోగం ఏ రాశులకు బాగా కలిసి రాబోతోంది, ఎవరు అదృష్టవంతులో ఇప్పుడు తెలుసుకుందాం.
కుజ, ఆదిత్య రాజయోగంతో ఈ రాశుల వారికి పట్టిందల్లా బంగారం
1.మేష రాశి
మేష రాశి వారికి రాజయోగం బాగా కలిసి వస్తుంది. ఈ సమయంలో ఈ రాశివారు ఆనందంగా ఉంటారు. కెరీర్‌లో గొప్ప అవకాశాలు వస్తాయి. కష్టానికి తగ్గ ఫలితం ఉంటుంది. ఆర్థికపరంగా కూడా బాగుంటుంది. ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది.
2.సింహ రాశి
సింహ రాశి వారికి రాజయోగం బాగా కలిసి వస్తుంది. ఈ సమయంలో ఈ రాశివారు ఆనందంగా ఉంటారు. పెండింగ్‌లో ఉన్న పనులు పూర్తవుతాయి. ఆనందం, శాంతి ఉంటాయి. సక్సెస్‌ను అందుకుంటారు.
3.ధనస్సు రాశి
ధనస్సు రాశి వారికి ఈ రాజయోగం అనేక విధాలుగా లాభాలను తీసుకొస్తుంది. ఈ సమయంలో ఈ రాశివారు సంతోషంగా ఉంటారు. ప్రమోషన్లు వస్తాయి. ఆర్థికపరంగా బాగుంటుంది. కొత్త ఇన్వెస్ట్మెంట్లతో ఎక్కువ లాభాలు వస్తాయి. గౌరవం పెరుగుతుంది.
4.మకర రాశి
మకర రాశి వారికి ఈ రాజయోగం బాగా కలిసి వస్తుంది. ఆర్థికపరంగా కూడా ఊహించని లాభాలను పొందుతారు. సక్సెస్‌ను అందుకుంటారు. మీ ధైర్యంతో ముందుకు సాగుతారు. ప్రేమ జీవితంలో ఆనందం ఉంటుంది.
గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.
ABOUT THE AUTHORPeddinti Sravyaపెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More

E-Paper


