Lucky zodiac signs: 2026లో ఈ రాశుల వారికి విపరీతమైన అదృష్టం, దశ తిరిగిపోవచ్చు!

2026 మొదటి అర్థభాగంలో చూస్తే గురుడు, శుక్రుడు, బుధ గ్రహాల అతిరోగమనం ఉంటుంది. రెండో అర్థభాగంలో చూసినట్లయితే కుజుడు, సూర్యుడు అనుకూలమైన సంచారాలు చేయడంతో కెరీర్‌లో బాగా కలిసి వస్తుంది. ఆరోగ్యం, విద్య ఇలా అన్నింటిలో కూడా మెరుగైన ఫలితాలను పొందుతారు.

Published on: Nov 08, 2025 8:00 AM IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

మరికొన్ని రోజుల్లో కొత్త సంవత్సరం రాబోతోంది. 2025 పూర్తి కాబోతోంది. 2026లో కొన్ని రాశుల వారికి విపరీతమైన అదృష్టం కలుగుతుంది. 2026 మొదటి అర్థభాగంలో చూస్తే గురుడు, శుక్రుడు, బుధ గ్రహాల అతిరోగమనం ఉంటుంది. రెండో అర్థభాగంలో చూసినట్లయితే కుజుడు, సూర్యుడు అనుకూలమైన సంచారాలు చేయడంతో కెరీర్‌లో బాగా కలిసి వస్తుంది. ఆరోగ్యం, విద్య ఇలా అన్నింటిలో కూడా మెరుగైన ఫలితాలను పొందుతారు.

2026లో ఈ రాశుల వారికి విపరీతమైన అదృష్టం (pinterest)
2026లో ఈ రాశుల వారికి విపరీతమైన అదృష్టం (pinterest)

2026 ఏడాది అంతా శని సంచారం ఉంటుంది. ఎప్పటిలాగే ఈ సంవత్సరం కూడా శుభ ఫలితాలు ఉంటాయి. అయితే 2026లో కొన్ని రాశుల వారికి విపరీతమైన అదృష్టం కలుగుతుంది. అనేక విధాలుగా వారికి లాభాలు కలుగుతాయి. మరి అదృష్ట రాశులు ఎవరన్నది ఇప్పుడు తెలుసుకుందాం.

విపరీతమైన అదృష్టం

గ్రహాల సంచారంలో మార్పు వచ్చినప్పుడు ద్వాదశ రాశుల వారి జీవితంలో అనేక మార్పులు చోటుచేసుకుంటాయి. కొన్ని రాశుల వారు మాత్రం అనేక లాభాలను పొందుతారు. 2025లో కూడా కొన్ని రాశుల వారికి విపరీతమైన అదృష్టం కలుగుతుంది. మరి వారిలో మీరు ఒకరేమో చూసుకోండి.

2026లో ఈ రాశుల వారికి విపరీతమైన అదృష్టం:

1.మిథున రాశి:

మిథున రాశి వారికి 2026 బాగా కలిసి వస్తుంది. ఈ రాశి వారికి గురువు అనుగ్రహంతో ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి. కొత్త ఉద్యోగాలు లభించే అవకాశం ఉంది. సమాజంలో గౌరవమర్యాదలు పెరుగుతాయి. విష్ణు సహస్రనామాన్ని ప్రతిరోజూ చదువుకుంటే మంచి ఫలితాలను చూస్తారు. పచ్చ రంగు వస్తువులను దానం చేస్తే కూడా శుభ ఫలితాలు కలుగుతాయి.

2.వృషభ రాశి:

వృషభ రాశి వారికి కొత్త సంవత్సరం బాగా కలిసి వస్తుంది. ఉద్యోగంలో మంచి మార్పులను చూస్తారు. ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. కుటుంబ సభ్యుల సపోర్ట్ ఉంటుంది. ఆరోగ్యం బాగుంటుంది. శుక్రవారం స్నానం చేసిన తర్వాత తులసి మొక్కకు నీళ్లు పోసి ప్రదక్షిణలు చేస్తే బాగా కలిసి వస్తుంది. వెండి ఆభరణాలు ధరిస్తే శుభప్రదం.

3.వృశ్చిక రాశి:

వృశ్చిక రాశి వారికి కొత్త ఏడాది బాగుంటుంది. ఆకస్మిక ధన లాభాన్ని చూస్తారు. పెండింగ్లో ఉన్న పనులను విజయవంతంగా పూర్తి చేస్తారు. అదృష్టం మీ వెంటే ఉంటుంది. వ్యాపారులకు ఎక్కువ లాభాలు కలుగుతాయి. సూర్యుడికి నీటిని ఆర్ఘ్యం సమర్పిస్తే మంచిది. మంగళవారం నాడు హనుమాన్ చాలీసా పారాయణం చేస్తే కూడా శుభ ఫలితాలను చూస్తారు. ఎర్ర కందిపప్పు, బెల్లం దానం చేస్తే బాగా కలిసి వస్తుంది.

4.తులా రాశి:

తులా రాశి వారికి 2026 అద్భుతంగా ఉంటుంది. పనిలో విజయాన్ని సాధిస్తారు. ఆర్థికపరంగా బాగుంటుంది. అనుకున్న పనులు సక్రమంగా పూర్తవుతాయి. ఇబ్బందుల నుంచి బయటపడతారు. శుక్రవారం నాడు బియ్యం, పెరుగు, పంచదార వంటి తెల్లని వస్తువులను దానం చేస్తే ఎక్కువ శుభ ఫలితాలను చూస్తారు. లక్ష్మీదేవిని ఆరాధిస్తే కూడా శుభప్రదం.

5.కుంభ రాశి:

కుంభ రాశి వారు 2026లో మంచి ఫలితాలను చూస్తారు. ఊహించని లాభాలను పొందుతారు. శనివారం నాడు పేదలకు నువ్వులు లేదా అలాంటి వస్తువులను దానం చేయడం మంచిది. రావి చెట్టుకు నీళ్లు పోసి ప్రదక్షిణలు చేస్తే కూడా కుంభ రాశి వారికి ఈ ఏడాది కలిసి వస్తుంది.

  • Peddinti Sravya
    ABOUT THE AUTHOR
    Peddinti Sravya

    పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More