Maha Shivaratri 2026 Wishes and Quotes: మహాశివరాత్రి (Maha Shivaratri 2026) నాడు శివుడిని ఆరాధించడం వలన శుభ ఫలితాలు కలుగుతాయి. పరమేశ్వరుడి అనుగ్రహంతో అనుకున్న పనులు పూర్తవుతాయి, కష్టాలు కూడా తొలగిపోతాయి. మహాశివరాత్రి విషెస్‌ను మీరు మీ కుటుంబ సభ్యులకు, స్నేహితులకు తెలపాలనుకుంటున్నారా? అయితే ఈ కొటేషన్స్, శ్లోకాలతో శివరాత్రి విషెస్‌ను తెలపండి.
మహాశివరాత్రి 2026 విషెస్ & కోట్స్, ఈ శ్లోకాలతో మహాశివరాత్రి శుభాకాంక్షలను తెలపండి

{{^htLoading}} {{/htLoading}}
ఆ పరమేశ్వరుడు దీవెనలు మీ జీవితంలో అన్ని అంధకారాలను తొలగించి, వెలుగులు నింపాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను.. మహాశివరాత్రి శుభాకాంక్షలు..
ఏమీ అర్థం కాని వారికి పూర్ణ లింగేశ్వరం, ఎంతో అంతో తెలిసిన వారికి అర్ధనారీశ్వరం, శరణాగతి అన్నవారికి మాత్రం ఆయనే సర్వేశ్వరం.. మీకు, మీ కుటుంబ సభ్యులకు శివరాత్రి శుభాకాంక్షలు..
పరమేశ్వరుడి అనుగ్రహం మీపై ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటున్నాను.. మీకు, మీ కుటుంబ సభ్యులకు శివరాత్రి శుభాకాంక్షలు
ప్రభుం ప్రాణనాథం విభుం విశ్వనాథం, జగన్నాథ నాథం సదానందభాజం, భవద్భవ్య భూతేశ్వరం భూతనాథం, శివం శంకరం శంభు మీశానమీడే.. శివరాత్రి 2026 శుభాకాంక్షలు.
బ్రహ్మ మురారి సురార్చిత లింగం
నిర్మల భాసిత శోభిత లింగం
జన్మజ దుఃఖ వినాశక లింగం
తత్ ప్రణమామి సదాశివ లింగం
మీకు, మీ కుటుంబ సభ్యులకు మహాశివరాత్రి శుభాకాంక్షలు
శివుడు మహాతపస్వి. లోకక్షేమం కోసం చేసే తపస్సే అది. ఏ పని చేసినా దీక్షతో ఓ తపస్సులా ఆచరించాలని, దేనికి చలించరాదని శివతత్వం బోధిస్తోంది. శివుని అనుగ్రహంతో ఎల్లవేళలా సంతోషంగా ఉండాలని కోరుకుంటూ శివరాత్రి శుభాకాంక్షలు..
{{^htLoading}} {{/htLoading}}
ఓం నమ: శివాయ.. హర హర బోలే నాథ.. ఈ మహాశివరాత్రి నుంచి మీ కష్టాలు తొలగిపోవాలని ఆ శివయ్యను ప్రార్థిస్తున్నాను.. మహాశివరాత్రి శుభాకాంక్షలు.
ఓం నమ: శివాయ.. ముక్కంటి మీకు ఆయురారోగ్యాలు, ఐశ్వర్యాలను ప్రసాదించాలని కోరుకుంటున్నాను. మహాశివరాత్రి శుభాకాంక్షలు.
అందరికీ ఆ మహాశివుని ఆశీస్సులు మెండుగా కలగాలని ఆశిస్తూ మహాశివరాత్రి శుభాకాంక్షలు
దోష దూషణాశా వినాశన, నాగభూషణ, సృష్టికర్త హరణ, తమో రజో సత్త్వ గుణ విమోచన.. హర హర మహాదేవ శంభో శంకర! శివరాత్రి శుభాకాంక్షలు.
పరమేశ్వరుడు అనుగ్రహంతో ఏ విధమైన లోటు లేకుండా, ఆయురారోగ్యాలు, ఆనందాలు ఎల్లప్పుడూ మీతో ఉండాలని ఆ పరమేశ్వరుడిని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను. శివరాత్రి శుభాకాంక్షలు.
నాగేంద్ర హారాయ త్రిలోచనాయ భస్మాంగ రాగాయ మహేశ్వరాయ
నిత్యాయ శుద్ధాయ ధిగంబరాయ తస్మై న కారాయ నమః శివాయ నమః శివాయ..
మీకు, మీ కుటుంబ సభ్యులకు మహాశివరాత్రి శుభాకాంక్షలు
నీలకంఠం విరూపాక్షం నిర్మలం
నిలయప్రదత్తం నమామి శిరస దేవం
కిమ్నో మృత్యు కరిష్యతీ.. మీకు, మీ కుటుంబ సభ్యులకు మహాశివరాత్రి 2026 శుభాకాంక్షలు
త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రం చ త్రియాయుధం
త్రిజన్మ పాపసంహారమ్ ఏకబిల్వం శివార్పణం..
పరమేశ్వరుడు అనుగ్రహంతో ఏ విధమైన లోటు లేకుండా, ఆయురారోగ్యాలు, ఆనందాలు మీతో ఉండాలని ఆ పరమేశ్వరుడిని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను.. మహాశివరాత్రి శుభాకాంక్షలు..
{{^htLoading}} {{/htLoading}}
శివ శివేతి శివేతి వా.. భవ భవేతి భవేతి వా.. హర హరేతి హరేతి వా.. భజ మనః శివ మేవ నిరంతరమ్.. మీకు, మీ కుటుంబ సభ్యులకు మహాశివరాత్రి శుభాకాంక్షలు..
Advertisement
{{/htLoading}}{{#usCountry}} {{/usCountry}}