Mars Transit Benefits: కుజుడి నక్షత్ర పరివర్తన.. మే నెలలో ఈ 4 రాశుల వారికి తిరుగులేదు.. ఇక అంతా లాభమే!

Mars Transit Benefits: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాల సేనాధిపతి కుజుడు మే 29న భరణి నక్షత్రంలోకి ప్రవేశించబోతున్నాడు. శుక్రుడు అధిపతిగా ఉన్న ఈ నక్షత్రంలోకి కుజుడి రాకతో మేషం, వృశ్చికంతో పాటు మరో రెండు రాశుల వారికి అదృష్టం పట్టనుంది. జూన్ 16 వరకు వీరికి కనకవర్షం.

Published on: Apr 28, 2026, 12:30:53 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Mars Transit Benefits: గ్రహాలు ఎప్పటికప్పుడు వాటి సంచారంలో మార్పు చేస్తూ ఉంటాయి. గ్రహాల సంచారంలో మార్పు వస్తే, అది 12 రాశుల వారి జీవితంలో అనేక మార్పులను తీసుకువస్తుంది. ఒక్కోసారి గ్రహాల సంచారంలో మార్పు కారణంగా శుభయోగాలు ఏర్పడితే, ఒక్కోసారి అశుభయోగాలను కూడా చూడాల్సి ఉంటుంది.

Mars Transit Benefits: కుజుడి నక్షత్ర పరివర్తన.. మే నెలలో ఈ 4 రాశుల వారికి తిరుగులేదు (pinterest)
Mars Transit Benefits: కుజుడి నక్షత్ర పరివర్తన.. మే నెలలో ఈ 4 రాశుల వారికి తిరుగులేదు (pinterest)

జ్యోతిష్య లెక్కల ప్రకారం, మే 29న కుజుడు భరణి నక్షత్రంలోకి అడుగుపెడతాడు. ఈ నక్షత్రానికి అధిపతి శుక్రుడు. శుక్రుడి నక్షత్రంలోకి కుజుడు అడుగుపెట్టడంతో కొన్ని రాశుల వారికి బాగా కలిసి రాబోతోంది. మే 29 నుంచి జూన్ 16 వరకు ఇదే నక్షత్రంలో కుజుడు సంచారం చేస్తాడు. ఈ సమయంలో కొన్ని రాశుల వారికి అద్భుతమైన లాభాలు కలగబోతున్నాయి. ఈ రాశుల వారి ఆదాయం పెరుగుతుంది, కాన్ఫిడెన్స్ కూడా పెరుగుతుంది. మరి ఆ అదృష్ట రాశులు ఎవరు? వీరిలో మీరు ఉన్నారేమో చూసుకోండి.

భరణి నక్షత్రంలోకి కుజుడు.. ఈ రాశుల వారికి విపరీతమైన లాభాలు

1.మేష రాశి:

మేష రాశి వారికి ఇది శుభ సమయం. ఈ సమయంలో ఈ రాశి వారు అనేక విధాలుగా ప్రయోజనాలను పొందుతారు. ఈ రాశి వారి కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. పని ప్రదేశంలో ఉన్న అడ్డంకులు అన్నీ కూడా తొలగిపోతాయి. కొత్త అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి. రియల్ ఎస్టేట్ వారికి బాగా కలిసి వస్తుంది. ఆస్తులను కొనుగోలు చేస్తారు. ఈ సమయంలో ఈ రాశి వారి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కూడా పెరుగుతుంది.

2.వృశ్చిక రాశి:

వృశ్చిక రాశి వారికి ఇది శుభ సమయం. ఈ సమయంలో ఈ రాశి వారు అనేక విధాలుగా ప్రయోజనాలను పొందుతారు. మీ కోరికలు నెరవేరుతాయి. వివిధ మార్గాల ద్వారా డబ్బు సంపాదిస్తారు. ఆదాయం పెరుగుతుంది. ఇన్వెస్ట్మెంట్ చేస్తే బాగా కలిసి వస్తుంది. ఆరోగ్య సమస్యలు తొలగిపోతాయి. అనుకున్న పనులను సక్రమంగా పూర్తి చేస్తారు.

3.తులా రాశి:

తులా రాశి వారికి ఈ నక్షత్ర సంచారం మంచి లాభాలను అందిస్తుంది. విలాసవంతమైన జీవితాన్ని గడుపుతారు. వివిధ మార్గాల ద్వారా డబ్బు సంపాదిస్తారు. కొత్త అవకాశాలను, కొత్త ఉద్యోగాలను పొందుతారు. ముఖ్యమైన ప్రాజెక్టులను సక్రమంగా పూర్తి చేస్తారు. ఆర్థికపరంగా లాభాలు ఉంటాయి. అయితే కాస్త కోపాన్ని అదుపులో ఉంచుకోవడం మంచిది.

4.ధనస్సు రాశి:

ధనస్సు రాశి వారికి ఇది శుభ సమయం. ఈ సమయంలో ఈ రాశి వారు ఊహించని లాభాలను పొందుతారు. సానుకూల మార్పులను చూస్తారు. ఈ సమయంలో ఈ రాశి వారి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. పాత సమస్యలు తొలగిపోతాయి. కుటుంబంలో సంతోషం పెరుగుతుంది. ఆర్థికపరంగా కూడా లాభాలు ఉంటాయి. ఇలా అనేక విధాలుగా ప్రయోజనాలను పొందుతారు.

  • Peddinti Sravya
    ABOUT THE AUTHOR
    Peddinti Sravya

    పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More