జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల కదలికలకు, నక్షత్ర మార్పులకు ఎంతో ప్రాధాన్యత ఉంది. ఒక గ్రహం తన స్థానాన్ని లేదా నక్షత్రాన్ని మార్చినప్పుడు, దాని ప్రభావం ద్వాదశ రాశులపైన స్పష్టంగా కనిపిస్తుంది. నవగ్రహాలలో ధైర్యానికి, శౌర్యానికి, భూమికి మరియు సోదరభావానికి కారకుడైన అంగారకుడు (కుజుడు) ప్రస్తుతం వృషభ రాశిలో కొనసాగుతున్నారు. ఇప్పటివరకు కృత్తిక నక్షత్రంలో ఉన్న గ్రహాల కమాండర్ అంగారకుడు.. ఇప్పుడు చంద్రుడి నక్షత్రమైన రోహిణిలోకి అడుగుపెడుతున్నారు.
దృక్ పంచాంగ గణనల ప్రకారం.. జూలై 5, 2026(ఇవాళ) మధ్యాహ్నం 12:01 గంటలకు అంగారకుడు రోహిణి నక్షత్రంలోకి ప్రవేశించనున్నారు. ఈ నక్షత్రానికి అధిపతి చంద్రుడు కావడంతో.. ఇక్కడి నుంచి జూలై 24 వరకు అంగారకుడి సంచారం కొనసాగుతుంది. జ్యోతిష్య నిపుణులు పండిట్ నరేంద్ర ఉపాధ్యాయ్ విశ్లేషణ ప్రకారం.., అంగారకుడి ఈ నక్షత్ర మార్పు వల్ల 5 రాశుల వారికి గోల్డెన్ డేస్ ప్రారంభం కానున్నాయి.
మేష రాశి :
అంగారకుడు చంద్రుడి నక్షత్రంలోకి ప్రవేశించడం వల్ల మేష రాశి వారికి పరోక్ష లక్ష్మీ యోగం వంటి శుభ ఫలితాలు అందుతాయి. దీనివల్ల ఆకస్మిక ధనలాభ సూచనలు ఉన్నాయి. మీలో ఆత్మవిశ్వాసం రెట్టింపు అవుతుంది. నిరుద్యోగులకు, ఉద్యోగులకు పని రంగంలో ప్రత్యేక ప్రశంసలు దక్కుతాయి.
కర్కాటక రాశి :
కర్కాటక రాశి వారికి ఈ సమయం విశేష లాభాలను తెచ్చిపెడుతుంది. మీ దృష్టి అంతా లక్ష్యాలపైనే ఉంటుంది. తండ్రి మరియు గురువుల నుంచి ఆశించిన మద్దతు లభిస్తుంది. ముఖ్యంగా విద్యార్థులకు ఈ కాలం ఎంతో అనుకూలంగా ఉంటుంది.
ధనుస్సు రాశి :
కోర్టు కేసులు లేదా వివాదాల్లో చిక్కుకున్న ధనుస్సు రాశి వారికి ఈ సంచారం వల్ల విజయం లభిస్తుంది. మీ ప్రతిభ, చాకచక్యంతో ఎంతటి కష్టమైన సమస్యలనైనా సులభంగా అధిగమిస్తారు. కెరీర్‌పై పూర్తి ఫోకస్ పెట్టడానికి ఇది సరైన సమయం.
సింహ రాశి :
సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారు. వ్యాపార రంగంలో చాలా కాలంగా వేధిస్తున్న సమస్యలు క్రమంగా తొలగిపోతాయి. జీవిత భాగస్వామితో సంతోషంగా గడపడానికి, సడలిపోయిన బంధాలను బలోపేతం చేసుకోవడానికి ఇది మంచి అవకాశం.
మీన రాశి :
{{/usCountry}}సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారు. వ్యాపార రంగంలో చాలా కాలంగా వేధిస్తున్న సమస్యలు క్రమంగా తొలగిపోతాయి. జీవిత భాగస్వామితో సంతోషంగా గడపడానికి, సడలిపోయిన బంధాలను బలోపేతం చేసుకోవడానికి ఇది మంచి అవకాశం.
మీన రాశి :
{{/usCountry}}మీన రాశి వారికి ఈ కాలంలో వరుసగా శుభవార్తలు అందుతాయి. వృత్తి, వ్యాపారాల్లో ఎదురవుతున్న అడ్డంకులు ఒక్కొక్కటిగా తొలగిపోతాయి. కుటుంబంలో సుఖశాంతులు వెల్లివిరుస్తాయి. మీలో సానుకూల శక్తి (పాజిటివ్ ఎనర్జీ) పెరుగుతుంది.