...
...
Next Story

Mars Transit: కుజ నక్షత్ర సంచారంతో ఈ 4 రాశుల వారికి ఆర్థిక లాభాలు!

త్వరలో కుజుడు తన నక్షత్రాన్ని మార్చబోతున్నాడు. కుజుడు ధైర్యం, శక్తి మొదలైన వాటికి కారకుడు. ప్రస్తుతం శతభిష నక్షత్రంలో ఉన్న కుజుడు మార్చి 20న రాత్రి 9:29కి పూర్వభద్ర నక్షత్రంలోకి ప్రవేశిస్తాడు. ఇది అన్ని రాశుల వారిపై ప్రభావం చూపిస్తుంది. కొన్ని రాశుల వారు మాత్రం లాభాలను పొందుతారు.

Published on: Feb 28, 2026, 08:01:09 IST
Advertisement

గ్రహాలు ఎప్పటికప్పుడు వాటి రాశులను మారుస్తూ ఉంటాయి. గ్రహాల సంచారంలో మార్పు వస్తే అది 12 రాశుల వారి జీవితంలో అనేక మార్పులు తీసుకొస్తుంది. కొన్నిసార్లు శుభ ఫలితాలు కలిగితే, కొన్నిసార్లు అశుభ ఫలితాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. కుజుడు త్వరలో తన నక్షత్రాన్ని మార్చబోతున్నాడు. కుజ సంచారంలో మార్పు వచ్చినప్పుడు అది అన్ని రాశుల వారి జీవితంలో శుభ ఫలితాలను తీసుకువస్తుంది. కాలానుగుణంగా కుజుడు తన నక్షత్రాలను, రాశులను మారుస్తూ ఉంటాడు. ఇప్పుడు కుజ నక్షత్ర సంచారం జరగబోతోంది.

కుజ నక్షత్ర సంచారం

Mars Transit: కుజ నక్షత్ర సంచారంతో ఈ 4 రాశుల వారికి ఆర్థిక లాభాలు (pinterest)
Mars Transit: కుజ నక్షత్ర సంచారంతో ఈ 4 రాశుల వారికి ఆర్థిక లాభాలు (pinterest)

త్వరలో కుజుడు తన నక్షత్రాన్ని మార్చబోతున్నాడు. కుజుడు ధైర్యం, శక్తి మొదలైన వాటికి కారకుడు. ప్రస్తుతం శతభిష నక్షత్రంలో ఉన్న కుజుడు మార్చి 20న రాత్రి 9:29కి పూర్వభద్ర నక్షత్రంలోకి ప్రవేశిస్తాడు. ఇది అన్ని రాశుల వారిపై ప్రభావం చూపిస్తుంది. కొన్ని రాశుల వారు మాత్రం లాభాలను పొందుతారు. ముఖ్యంగా ఈ రాశుల వారికి ఆర్థిక లాభం కలగబోతోంది.

కుజ నక్షత్ర సంచారంతో ఈ రాశుల వారికి అనేక లాభాలు కలుగుతాయి.. ఈ రాశుల్లో మీరు ఉన్నారేమో చూసుకోండి

మేషరాశి

మేష రాశి వారికి ఇది శుభ సమయం. కుజ నక్షత్ర సంచారంతో ఈ రాశి వారు ఆనందంగా ఉంటారు. కొత్త వ్యక్తులతో పరిచయం ఏర్పడుతుంది. ఆర్థికపరంగా బావుంటుంది. అనుకున్నది సాధిస్తారు. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. ప్రశాంతత, సంతోషం రెట్టింపు అవుతాయి.

సింహ రాశి

సింహ రాశి వారికి ఇది అద్భుతమైన సమయం. కుజ నక్షత్ర సంచారం ఈ రాశి వారికి అనేక విధాలుగా లాభాలను తీసుకువస్తుంది. ఈ సమయంలో ఈ రాశి వారు ఆనందంగా ఉంటారు. వ్యాపారస్తులకు కూడా ఇది అద్భుత సమయం. అదృష్టం వెతుక్కుంటూ వస్తుంది. ప్రమోషన్లు వస్తాయి. జీతం పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయి.

వృశ్చిక రాశి

మీన రాశి వారికి నక్షత్ర సంచారం బాగా కలిసి వస్తుంది. కెరీర్‌లో మంచి మార్పులు చూస్తారు. కష్టానికి తగ్గ ఫలితం ఉంటుంది. పై అధికారుల సపోర్ట్ ఉంటుంది. క్రియేటివిటీ పెరుగుతుంది. కొత్త బిజినెస్ ప్రాజెక్టులను చేపడతారు. పాత గొడవలు తొలగిపోతాయి. కొత్త మార్గాల ద్వారా డబ్బు సంపాదిస్తారు.

 
ABOUT THE AUTHOR
Peddinti Sravya

పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారు

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks