కుజ, శుక్రుల ధనశక్తి రాజయోగం, 4 రాశులకు అనేక లాభాలు.. బ్యాంకు బ్యాలెన్స్ పెరుగుతుంది, సంతోషం రెట్టింపు అవుతుంది!
కుజ, శుక్రుల కారణంగా ధనశక్తి రాజయోగం ఏర్పడింది. పంచాంగం ప్రకారం ఫిబ్రవరి 23, అనగా ఈరోజు కుజుడు కుంభరాశిలోకి ప్రవేశించాడు. శుక్రుడు ఇదే రాశిలో సంచారం చేస్తున్నాడు. దీంతో ధనశక్తి రాజయోగం ఏర్పడింది. ఈ యోగం కారణంగా కొన్ని రాశుల వారికి శుభ ఫలితాలు ఎదురవుతున్నాయి. ఈ రాశుల వారు భూములను కొనుగోలు చేస్తారు.
గ్రహాలు ఎప్పటికప్పుడు వాటి సంచారంలో మార్పు చేస్తూ ఉంటాయి. గ్రహాల సంచారంలో మార్పు వస్తే అది అన్ని రాశుల వారిపై ప్రభావాన్ని చూపిస్తుంది. గ్రహాలు ఎప్పటికప్పుడు రాశులను, నక్షత్రాలను మారుస్తూ ఉంటాయి. ఆ సమయంలో శుభ యోగాలను చూస్తూ ఉంటాం. కొన్నిసార్లు గ్రహాల సంయోగం కూడా ఏర్పడుతూ ఉంటుంది. అలాంటప్పుడు కూడా 12 రాశుల వారి జీవితంలో అనేక మార్పులు వస్తాయి.

ధనశక్తి రాజయోగం
ధనశక్తి రాజయోగం చాలా శక్తివంతమైన రాజయోగం. ఇది ఈరోజు ఏర్పడింది. ఈ రాజయోగం కొన్ని రాశుల వారికి వరం వంటిది. కుజ, శుక్రుల కారణంగా ఈ యోగం ఏర్పడింది. పంచాంగం ప్రకారం ఫిబ్రవరి 23, అనగా ఈరోజు ఉదయం 7:27కి కుజుడు కుంభరాశిలోకి ప్రవేశించాడు. శుక్రుడు ఇదే రాశిలో సంచారం చేస్తున్నాడు. దీంతో ధనశక్తి రాజయోగం ఏర్పడింది.
ఈ యోగం కారణంగా కొన్ని రాశుల వారికి శుభ ఫలితాలు ఎదురవుతున్నాయి. ఈ సమయంలో ఈ రాశుల వారు భూములను కొనుగోలు చేస్తారు. ధైర్యం పెరుగుతుంది. ఆర్థికపరంగా బాగుంటుంది. సంతోషం రెట్టింపు అవుతుంది. ఇలా ఒకటి కాదు, రెండు కాదు, అనేక లాభాలు కలుగుతాయి. మరి ఏ రాశుల వారికి ఎలాంటి లాభాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.
ధనశక్తి రాజయోగంతో ఈ రాశుల వారికి అనేక లాభాలు
1.వృషభ రాశి
వృషభ రాశి వారికి ధనశక్తి రాజయోగం శుభ ఫలితాలను తీసుకొస్తుంది. ఈ సమయంలో ఈ రాశి వారు ఆనందంగా ఉంటారు. ఆర్థికపరంగా బాగుంటుంది. ఎప్పటి నుంచో రావాల్సిన డబ్బులు ఈరోజు మీ చేతికి వస్తాయి. కెరీర్‌లో మంచి మార్పులను చూస్తారు. ఉద్యోగస్తులకు కొత్త బాధ్యతలు వస్తాయి. ఇన్వెస్ట్మెంట్ చేస్తే బాగా కలిసి వస్తుంది. పెద్ద ప్రాజెక్టులను చేపడతారు.
2.వృశ్చిక రాశి
ఈ రాశి వారికి ఇది శుభ సమయం. ఈ సమయంలో ఈ రాశి వారు ఆనందంగా ఉంటారు. అనేక అవకాశాలు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి. సక్సెస్‌ను అందుకుంటారు. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. ఉద్యోగస్తులు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. మీ మాటల్లో మాధుర్యం ఉంటుంది. భాగస్వామితో బంధం బాగుంటుంది. ఒకరినొకరు బాగా అర్థం చేసుకుంటారు.
3.మకర రాశి
ఈ రాశి వారికి ధనశక్తి రాజయోగం శుభ ఫలితాలను అందిస్తుంది. ఈ సమయంలో ఈ రాశి వారు సంతోషంగా ఉంటారు. ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. కొత్త మార్గాల ద్వారా డబ్బు సంపాదిస్తారు. బ్యాంకు బ్యాలెన్స్ పెరుగుతుంది. కష్టానికి తగ్గ ఫలితాన్ని చూస్తారు. పూర్వీకుల నుంచి కలిగే ఆస్తి సమస్యల నుంచి బయటపడతారు. ఆనందం రెట్టింపు అవుతుంది.
4.కుంభ రాశి
కుంభ రాశి వారికి ఈ సమయం అద్భుతంగా ఉంటుంది. ధనశక్తి రాజయోగం శుభ ఫలితాలను తీసుకొస్తుంది. మీ పట్ల గౌరవ, మర్యాదలు పెరుగుతాయి. రిలేషన్‌షిప్ బాగుంటుంది. ప్రేమ జీవితంలో ఆనందం ఉంటుంది. ఆర్థికపరంగా బాగుంటుంది. కొత్త వాటిని ప్రారంభించడానికి కూడా ఇది శుభ సమయం. కొత్త ఉద్యోగం లేదా వ్యాపారాన్ని పొందుతారు.
ABOUT THE AUTHORPeddinti Sravyaపెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More

E-Paper


