నవపంచమ రాజయోగం: కుజ, గురువుల అనుగ్రహంతో ఈ రాశుల వారికి ఆర్థిక లాభాలు.. వీరిలో మీరూ ఒకరేమో చూసుకోండి!
వేద జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మార్చి 22న కుజుడు, గురువు 120 డిగ్రీల వద్ద ఉండడంతో నవ పంచమ రాజయోగం ఏర్పడబోతోంది. ఇది కొన్ని రాశుల వారికి అదృష్టంగా మారబోతోంది. ఈ రెండు గ్రహాల కారణంగా ఏర్పడే ఈ నవ పంచమ రాజయోగం ఏ రాశుల వారికి ఎలాంటి లాభాలను తీసుకొస్తుంది, ఎవరు ఎలాంటి లాభాలను పొందుతారో తెలుసుకుందాం.
గ్రహాలు ఎప్పటికప్పుడు వాటి రాశులను మారుస్తూ ఉంటాయి. ఆ సమయంలో శుభ యోగాలను చూస్తూ ఉంటాం. కొన్నిసార్లు కొన్ని రాశుల వారు సమస్యలను ఎదుర్కొంటే, కొన్ని రాశుల వారు లాభాలనే పొందుతారు. వేద జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మార్చి 22న కుజుడు, గురువు 120 డిగ్రీల వద్ద ఉండడంతో నవ పంచమ రాజయోగం ఏర్పడబోతోంది. ఇది కొన్ని రాశుల వారికి అదృష్టంగా మారబోతోంది. ఈ రెండు గ్రహాల కారణంగా ఏర్పడే ఈ నవ పంచమ రాజయోగం ఏ రాశుల వారికి ఎలాంటి లాభాలను తీసుకొస్తుంది, ఎవరు ఎలాంటి లాభాలను పొందుతారో ఇప్పుడు తెలుసుకుందాం.

త్వరలో నవపంచమ రాజయోగం.. ఈ రాశుల వారికి వరం
త్వరలో నవపంచమ రాజయోగం ఏర్పడనుంది. విపరీతమైన అదృష్టాన్ని అందించబోతోంది. గ్రహాలు వాటి రాశులను మార్చినప్పుడు కొన్నిసార్లు గ్రహాల కలయిక ఏర్పడుతుంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మార్చి 22న కుజుడు, గురువు నవ పంచమ రాజయోగాన్ని ఏర్పరుస్తున్నారు. ఇది కొన్ని రాశుల వారి అదృష్టాన్ని విపరీతంగా పెంచుతుంది. అలాగే అనేక లాభాలు కలుగుతాయి. మరి ఆ అదృష్ట రాశులు ఎవరు? వారిలో మీరు కూడా ఉన్నారేమో చూసుకోండి.
నవపంచమ రాజయోగంతో ఈ రాశులకు అనేక లాభాలు
1.మేష రాశి
మేష రాశి వారికి నవ పంచమ రాజయోగం బాగా కలిసి వస్తుంది. ఈ సమయంలో ఈ రాశి వారు సానుకూల మార్పులను చూస్తారు. పూర్వీకుల నుంచి ఆస్తి లాభం కలుగుతుంది. అలాగే ఆనందం కూడా పెరుగుతుంది.
2.కర్కాటక రాశి
కర్కాటక రాశి వారికి ఈ యోగం సమస్యలను తొలగించి సంతోషాన్ని అందిస్తుంది. ఈ సమయంలో ఈ రాశి వారు విలాసవంతమైన జీవితాన్ని గడుపుతారు. ఎప్పటి నుంచో కంటున్న కలలు నిజమవుతాయి. కొత్త భూమిని కొనుగోలు చేస్తారు లేదా వాహనాలను కొనుగోలు చేస్తారు. పని ప్రదేశంలో మిమ్మల్ని అందరూ ప్రశంసిస్తారు. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోతాయి. మానసిక ప్రశాంతత కూడా ఉంటుంది.
3.సింహ రాశి
ఈ రాశి వారికి నవ పంచమ రాజయోగం వరంలాంటిది. ఈ సమయంలో ఈ రాశి వారు ఆనందంగా ఉంటారు. విద్యార్థులు సక్సెస్‌ను అందుకుంటారు. సంతానం కలగాలనుకునే వారికి కూడా ఇది శుభసమయం. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కూడా పెరుగుతుంది. కష్టాలను సులభంగా అధిగమిస్తారు.
4.ధనస్సు రాశి
ధనస్సు రాశికి అధిపతి గురువు. ఈ నవ పంచమ రాజయోగంతో ఈ రాశి వారు సంతోషంగా ఉంటారు. ప్రమోషన్లు వస్తాయి. ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. ఇన్వెస్ట్మెంట్ చేస్తే కూడా బాగా కలిసి వస్తుంది. మతపరమైన కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటారు.
5. వృశ్చిక రాశి
వివిధ మార్గాల ద్వారా డబ్బు సంపాదిస్తారు. బిజినెస్‌లో రావలసిన డబ్బు కూడా చేతికి వస్తుంది. ప్రేమ జీవితం మరింత దృఢంగా మారుతుంది. మీ భాగస్వామి సపోర్ట్ ఉంటుంది. నవ పంచమ రాజయోగంతో ఆనందాన్ని పొందుతారు.
ABOUT THE AUTHORPeddinti Sravyaపెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More

E-Paper


