నవపంచమ రాజయోగం: సూర్య, గురువుల అనుగ్రహంతో ఈ 5 రాశులకు ఆర్థిక లాభాలు.. వీరిలో మీరూ ఒకరేమో చూసుకోండి!

మార్చి నెలలో చాలా శక్తివంతమైన నవ పంచమ రాజయోగం ఏర్పడుతుంది. ఇది సూర్యుడు, గురువుల కారణంగా ఏర్పడనుంది. ఈ రాజయోగం వల్ల కొన్ని రాశుల వారి కెరీర్‌, ఆర్థిక పరిస్థితుల్లో భారీ మార్పులు వస్తాయి. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. మంచి నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం పెరుగుతుంది. అదృష్టం వెతుక్కుంటూ వస్తుంది.

Published on: Feb 06, 2026 8:00 AM IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

గ్రహాలు ఎప్పటికప్పుడు వాటి సంచారంలో మార్పులు చేస్తూ ఉంటాయి. కొన్నిసార్లు గ్రహాల సంచారంలో మార్పుల కారణంగా శుభ ఫలితాలు, అశుభయోగాలు ఏర్పడతాయి. మరి కొన్నిసార్లు శుభ యోగాలు ఏర్పడుతూ ఉంటాయి. ప్రతి నెలా కూడా గ్రహాల సంచారంలో మార్పులు రావడం మనం చూస్తూ ఉంటాం.

నవపంచమ రాజయోగం: సూర్య, గురువుల అనుగ్రహంతో ఈ 5 రాశులకు ఆర్థిక లాభాలు (pinterest)
నవపంచమ రాజయోగం: సూర్య, గురువుల అనుగ్రహంతో ఈ 5 రాశులకు ఆర్థిక లాభాలు (pinterest)

నవ పంచమ రాజయోగం

మార్చి నెలలో చాలా శక్తివంతమైన నవ పంచమ రాజయోగం ఏర్పడుతుంది. ఇది సూర్యుడు, గురువుల కారణంగా ఏర్పడనుంది. ఈ రాజయోగం వల్ల కొన్ని రాశుల వారి కెరీర్‌, ఆర్థిక పరిస్థితుల్లో భారీ మార్పులు వస్తాయి. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. మంచి నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం పెరుగుతుంది. అదృష్టం కూడా వెతుక్కుంటూ వస్తుంది. పురోగతిని చూస్తారు. సమాజంలో గౌరవం, మర్యాదలు పెరుగుతాయి. ఇలా ఒక్కటి కాదు, అనేక లాభాలు కలుగుతాయి.

మార్చి 5న నవపంచమ రాజయోగం, ఈ రాశులకు విపరీతమైన అదృష్టం

ఈ శక్తివంతమైన రాజయోగం కొన్ని రాశుల వారి జీవితాన్నే మార్చేయబోతోంది. ఇది సూర్యుడు, గురువుల కారణంగా ఏర్పడుతుంది. సూర్యుడు, గురువు మార్చి 5న ఒకదానికొకటి 120 డిగ్రీల కోణంలో ఉండడంతో ఈ రాజయోగం ఏర్పడుతుంది. దీంతో కొన్ని రాశుల వారి అదృష్టం మారిపోతోంది. మరి ఏ రాశుల వారు ఎలాంటి లాభాలను పొందుతారు? ఈ యోగంతో ఏ రాశుల వారి జీవితం ఒక్కసారిగా మారుతుందో తెలుసుకుందాం. ఆ అదృష్ట రాశుల్లో మీరు ఉన్నారేమో చూసుకోండి.

1.మేష రాశి

మేష రాశి వారికి నవ పంచమ రాజయోగం బాగా కలిసి రాబోతోంది. సూర్య, గురువుల కలయికతో ఏర్పడే ఈ రాజయోగం మీ అదృష్టాన్ని పెంచుతుంది. పెండింగ్‌లో ఉన్న పనులను పూర్తి చేస్తారు. కాంపిటేటివ్ పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి కూడా ఇది అద్భుతమైన సమయం. విదేశీ ప్రయాణాలను విజయవంతంగా పూర్తి చేస్తారు. పని ప్రదేశంలో మీ పేరు, ప్రతిష్టలు పెరుగుతాయి. వ్యాపారంలో ఎక్కువ లాభాలు ఉంటాయి. ఆర్థికపరంగా బాగుంటుంది. వైవాహిక జీవితంలో ప్రశాంతత, సంతోషం పెరుగుతాయి.

2.సింహ రాశి

సింహ రాశి వారికి మార్చిలో ఏర్పడే నవ పంచమ రాజయోగం వివిధ లాభాలను కలిగిస్తుంది. ఈ సమయంలో ఈ రాశి వారు సంతోషంగా ఉంటారు. మంచి నిర్ణయాలు తీసుకుంటారు. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. వ్యాపారస్తులకు కూడా ఇది అద్భుతమైన సమయం. పూర్వికుల నుంచి ఆస్తిని పొందుతారు. పిల్లల నుంచి శుభవార్తలు వింటారు.

3.వృశ్చిక రాశి

వృశ్చిక రాశి వారు ఈ సమయంలో ఆనందంగా ఉంటారు. ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి. ఆదాయం పెరుగుతుంది. ఎప్పటి నుంచో రావాల్సిన డబ్బు మీ చేతికి వస్తుంది. చాలా కాలం నుంచి అనారోగ్య సమస్యలతో బాధ పడుతున్న వారికి ఈ సమయం ఉపశమనం కలిగిస్తుంది. ఊహించని విధంగా ఆర్థిక లాభాలు వస్తాయి. పాత ఇన్వెస్ట్మెంట్ల నుంచి డబ్బు అందుతుంది.

4.ధనస్సు రాశి

ధనస్సు రాశి వారికి ఈ రాజయోగం అద్భుతంగా మారిపోతుంది. కెరీర్‌లో మంచి మార్పులను చూస్తారు. ఉద్యోగస్తులకు ప్రమోషన్ వచ్చే అవకాశం ఉంది. వ్యాపారస్తులకు కొత్త అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి. మతపరమైన కార్యక్రమాల్లో ఆసక్తి పెరుగుతుంది. మానసిక ప్రశాంతత ఉంటుంది.

5.మీన రాశి

మీన రాశి వారికి ఈ రెండు ప్రధాన గ్రహాల కారణంగా ఏర్పడే ఈ యోగం అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది. వైవాహిక జీవితంలో సంతోషం ఉంటుంది. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. విద్యార్థులకు కూడా మంచి మార్పులను తీసుకొస్తుంది. కాంపిటేటివ్ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న వారికి కూడా ఇది శుభ సమయం. ఆర్థికపరంగా కూడా బాగుంటుంది. ఇలా మొత్తం మీద ఈ శుభయోగంతో అనేక మార్పులను చూస్తారు.

  • Peddinti Sravya
    ABOUT THE AUTHOR
    Peddinti Sravya

    పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More