ధన యోగం: కుంభ రాశిలోకి కుజుడు.. నాలుగు రాశులకు భూములు, డబ్బు, విజయాలతో పాటు ఎన్నో!

ప్రతి నెలలో కూడా ఏదో ఒక ప్రధాన గ్రహ సంచారంలో మార్పు ఉంటుంది. ఈ ఫిబ్రవరి నెలలో కూడా కొన్ని ప్రధాన గ్రహాల సంచారంలో మార్పును చూస్తాం. అలాగే ఫిబ్రవరి 23న కుజుడు కుంభ రాశిలోకి ప్రవేశిస్తాడు. ఇప్పటికే కుంభ రాశిలో బుధుడు ఉండడంతో ఈ రెండు గ్రహాల సంయోగం ఏర్పడుతుంది. ఈ రాశుల వారు భారీగా లాభాలను పొందుతారు.

Published on: Feb 21, 2026 12:00 PM IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

గ్రహాలు ఎప్పటికప్పుడు వాటి సంచారంలో మార్పు చేస్తూ ఉంటాయి. అలాంటప్పుడు శుభ యోగాలను చూస్తూ ఉంటాం. ప్రతి నెలలో కూడా ఏదో ఒక ప్రధాన గ్రహ సంచారంలో మార్పు ఉంటుంది. ఈ ఫిబ్రవరి నెలలో కూడా కొన్ని ప్రధాన గ్రహాల సంచారంలో మార్పును చూస్తాం. అలాగే ఫిబ్రవరి 23న కుజుడు కుంభ రాశిలోకి ప్రవేశిస్తాడు. ఇప్పటికే కుంభ రాశిలో బుధుడు ఉండడంతో ఈ రెండు గ్రహాల సంయోగం ఏర్పడుతుంది.

ధన యోగం: కుంభ రాశిలోకి కుజుడు.. నాలుగు రాశులకు భూములు, డబ్బు, విజయాలతో పాటు ఎన్నో (pinterest)
ధన యోగం: కుంభ రాశిలోకి కుజుడు.. నాలుగు రాశులకు భూములు, డబ్బు, విజయాలతో పాటు ఎన్నో (pinterest)

అలాగే మార్చి 15 వరకు సూర్యుడు కుంభరాశిలో ఉంటాడు. ఒకేసారి కుంభ రాశిలో అనేక గ్రహాల కలయిక ఏర్పడడంతో కొన్ని రాశుల వారికి బాగా కలిసి రాబోతుంది. ఈ రాశుల వారు భారీగా లాభాలను పొందుతారు. ఆర్థికపరంగా కూడా బాగుంటుంది. కొన్ని రాశుల వారికి కాసుల వర్షం కురుస్తుంది. మరి ఈ సమయంలో ఏ రాశుల వారు భారీగా లాభాలను పొందుతారు, ఎవరికి ఎలాంటి లాభాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.

కుంభ రాశిలో కుజ సంచారం.. ఈ రాశులకు అనేక లాభాలు

1.మేష రాశి:

మేష రాశి వారికి కుజ సంచారంతో బాగా కలిసి రాబోతోంది. కుజుడు కుంభరాశిలోకి ప్రవేశించడంతో ఈ రాశి వారికి ఆర్థికపరంగా లాభాలు కలుగుతాయి. ముఖ్యంగా కుటుంబ సభ్యుల నుంచి భారీగా డబ్బులు వస్తాయి. వ్యాపారస్తులకు కూడా ఇది శుభసమయం. అనేక అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి. కొత్త డీల్స్ కూడా ఉంటాయి.

2.వృషభ రాశి:

వృషభ రాశి వారికి ఇది అద్భుతమైన సమయం. ఈ సమయంలో ఈ రాశి వారికి ఊహించని మార్పులు వస్తాయి. అనేక విధాలుగా ప్రయోజనాలను పొందుతారు. రియల్ ఎస్టేట్ రంగాల వారికి కూడా బాగా కలిసి వస్తుంది. ఆర్థికపరంగా బాగుంటుంది. వైవాహిక జీవితంలో ఆనందం ఉంటుంది. వివిధ మార్గాల ద్వారా డబ్బు సంపాదిస్తారు. ఆరోగ్యం బాగుంటుంది.

3.వృశ్చిక రాశి:

ఈ రాశి వారికి ఇది అద్భుతమైన సమయం. ఈ సమయంలో ఈ రాశి వారు ఆనందంగా ఉంటారు. కొత్త భూములు, బిల్డింగ్‌లను కొనుగోలు చేస్తారు. ఆర్థికపరంగా బాగుంటుంది. తల్లి సపోర్ట్ ఉంటుంది. కొత్త కారును కూడా కొనుగోలు చేస్తారు. అనుకోకుండా మీ చేతికి డబ్బులు వస్తాయి.

4.మకర రాశి:

మకర రాశి వారికి కుజ సంచారంతో బాగా కలిసి వస్తుంది. విలాసవంతమైన జీవితాన్ని గడుపుతారు. ఆదాయం పెరుగుతుంది. మతపరమైన కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటారు. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. ముఖ్యమైన నిర్ణయాలను తీసుకోవడానికి కూడా ఇది శుభసమయం. మొత్తం మీద ఈ సంచారం మీకు అనేక విధాలుగా లాభాలను తీసుకొస్తుంది.

  • Peddinti Sravya
    ABOUT THE AUTHOR
    Peddinti Sravya

    పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More