2026 తొలి సూర్య గ్రహణం: గ్రహణ సమయంలో పాటించాల్సిన పరిహారాలు, సూతక కాలం, ఏ దేశాల్లో సూర్య గ్రహణం కనపడుతుందో తెలుసుకోండి!
సూర్య గ్రహణం, చంద్ర గ్రహణం సమయంలో కొన్ని పనులు చేయరు. భోజనం తినడం వంటివి కూడా నిషిద్ధం. గ్రహణాల సమయంలో ఆహారం తీసుకోవడం వలన ఇబ్బందులు వస్తాయని, మంచిది కాదని అంటారు. 2026లో వచ్చే మొదటి సూర్యగ్రహణం ఏ సమయానికి మొదలవుతుంది? ఏ దేశాల్లో సూర్య గ్రహణం కనపడుతుందో తెలుసుకోండి.
ప్రతి ఏటా సూర్యగ్రహణం, చంద్రగ్రహణం ఏర్పడుతూనే ఉంటాయి. ఎప్పటిలానే ఈ ఏడాది కూడా సూర్య గ్రహణాలు, చంద్ర గ్రహణాలు ఏర్పడిపోతున్నాయి. హిందూ మతంలో ఈ గ్రహణాలను అశుభంగా భావిస్తారు. అయితే, సూర్య గ్రహణం, చంద్ర గ్రహణం సమయంలో కొన్ని పనులు చేయరు. భోజనం తినడం వంటివి కూడా నిషిద్ధం. గ్రహణాల సమయంలో ఆహారం తీసుకోవడం వలన ఇబ్బందులు వస్తాయని, మంచిది కాదని అంటారు.

గ్రహణ సమయంలో ధ్యానం చేయడం, భగవంతుని భక్తి పాటలు పాడుకోవడం, మంత్రాలను చదువుకోవడం వంటివి చేయొచ్చు. ఆధ్యాత్మిక పుస్తకాలను కూడా చాలా మంది గ్రహణ సమయంలో చదువుతూ ఉంటారు. ఈ ఏడాది మొదటి సూర్యగ్రహణం ఏర్పడుతోంది. అయితే ఇది భారతదేశంలో కనపడదు. అయినప్పటికీ గ్రహణ ప్రభావం ఇతర దేశాలపై ఉంటుంది.
2026లో వచ్చే మొదటి సూర్యగ్రహణం ఏ సమయానికి మొదలవుతుంది?
2026లో వచ్చే మొదటి సూర్యగ్రహణం ఫిబ్రవరి 17న, అనగా ఈరోజు, మాఘ అమావాస్య రోజున ఏర్పడుతోంది. ఈ గ్రహణం మధ్యాహ్నం 3:26కి మొదలవబోతోంది. రాత్రి 7:57కు ముగుస్తుంది. సుమారు నాలుగున్నర గంటల పాటు ఈ గ్రహణం ఉంటుంది. ఈ గ్రహణం భారతదేశంలో కనపడదు. కాబట్టి సూతక కాలం కూడా పరిగణించబడదు.
2026లో వచ్చే మొదటి సూర్యగ్రహణం ఎక్కడ కనపడుతుంది?
ఈ ఏడాది మొదటి సూర్యగ్రహణం భారతదేశంలో కనిపించదు. శ్రీలంక, నేపాల్, ఆఫ్ఘానిస్తాన్, మయన్మార్ దేశాల్లో కనిపించదు. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఆసియా దేశాల్లో కూడా కనపడదు. అలాగే మరి కొన్ని చోట్ల ఈ సూర్యగ్రహణం కనపడదు. జింబాబ్వే, దక్షిణ ఆఫ్రికా మరియు జాంబియాలో కనిపిస్తుంది. మౌరిషస్, అర్జెంటీనా, టాంజానియా, చిలీ, ఇతర దక్షిణ అమెరికా దేశాల్లో ఈ గ్రహణం కనిపిస్తుంది. దక్షిణ ఆఫ్రికా ప్రాంతాలు, దక్షిణ అట్లాంటిక్ మహాసముద్రం, దక్షిణ పసిఫిక్ మహాసముద్రం, అంటార్కిటికా ప్రాంతాల్లో కనిపిస్తుంది.
గ్రహణం సమయంలో ఏం చేస్తే శుభ ఫలితాలు కలుగుతాయి?
- గ్రహణ సమయంలో ప్రశాంతంగా కూర్చుని మంత్రాలను పఠిస్తే శుభ ఫలితాలు కలుగుతాయి. అలాగే సూర్య దోషాలను తొలగించడానికి కూడా పరిహారాలను పాటించొచ్చు.
- “ఓం హ్రాం హ్రీం హ్రౌం సూర్యాయ నమః” మంత్రాన్ని పఠించండి.
- అలాగే సూర్య గాయత్రి మంత్రాన్ని కూడా 11 సార్లు పఠించండి. “ఓం భాస్కరాయ విద్మహే మహాతేజాయ ధీమహి తన్నో సూర్యః ప్రచోదయాత్” అని 11 సార్లు పఠిస్తే శుభ ఫలితాలు కలుగుతాయి.
- అలాగే సూర్యగ్రహణం పూర్తయిన తర్వాత గోధుమలు, బెల్లం, రాగి వస్తువులను దానం చేయడం మంచిది.
- ఎర్రటి వస్త్రాలు, కుంకుమ పువ్వును దానం చేస్తే సూర్య దోషాలు తగ్గిపోతాయి.
- సూర్యగ్రహణం తర్వాత రోజు సూర్యుడికి అర్ఘ్యం సమర్పించి “ఓం సూర్యాయ నమః” మంత్రాన్ని పఠించండి.
- సూర్యగ్రహణం అయిపోయిన తర్వాత స్నానం చేసి ఇంట్లో గంగాజలాన్ని చల్లండి. హనుమాన్ చాలీసాను పఠిస్తే కూడా శుభ ఫలితాలు కలుగుతాయి.
ABOUT THE AUTHORPeddinti Sravyaపెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More

E-Paper


