Eclipse Yoga: కుంభ రాశిలో సూర్య, రాహువుల సంయోగంతో గ్రహణ యోగం.. 5 రాశులకు అష్టకష్టాలు.. జాగ్రత్తగా ఉండాలి!

2026 లో మొత్తం నాలుగు గ్రహణాలు ఉన్నాయి. ముందుగా మొదటి సూర్యగ్రహణం ఫిబ్రవరి 17, అనగా మంగళవారం నాడు ఏర్పడబోతోంది. కుంభ రాశిలో ఈ గ్రహణం ఏర్పడడంతో కొన్ని రాశుల వారికే సమస్యలు వచ్చే అవకాశం ఉంది. సుమారు 37 ఏళ్ల తర్వాత ఈ సూర్యగ్రహణం కుంభరాశిలో ఏర్పడుతోంది. సూర్య, రాహుల కలయికతో గ్రహణ యోగం కూడా ఏర్పడబోతోంది.

Published on: Feb 13, 2026 12:00 PM IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ప్రతి ఏటా గ్రహణాలు ఏర్పడడం చూస్తూ ఉంటాం. అలాగే 2026 లో మొత్తం నాలుగు గ్రహణాలు ఉన్నాయి. ముందుగా మొదటి సూర్యగ్రహణం ఫిబ్రవరి 17, అనగా మంగళవారం నాడు ఏర్పడబోతోంది. కుంభ రాశిలో ఈ గ్రహణం ఏర్పడడంతో కొన్ని రాశుల వారికే సమస్యలు వచ్చే అవకాశం ఉంది. సుమారు 37 ఏళ్ల తర్వాత ఈ సూర్యగ్రహణం కుంభరాశిలో ఏర్పడుతోంది. పైగా ఈ గ్రహణ సమయంలో రాహువు, బుధుడు, శుక్రుడు, చంద్రుడు కుంభరాశిలో సంచరిస్తారు.

Eclipse Yoga: కుంభ రాశిలో సూర్య, రాహువుల సంయోగంతో గ్రహణ యోగం (pinterest)
Eclipse Yoga: కుంభ రాశిలో సూర్య, రాహువుల సంయోగంతో గ్రహణ యోగం (pinterest)

మార్చి 7, 1989 లో ఇలాగే జరిగింది. ఈ సమయంలో సూర్య, రాహుల కలయికతో గ్రహణ యోగం కూడా ఏర్పడబోతోంది. ఈ గ్రహణ యోగం కొన్ని రాశుల వారి జీవితంలో సమస్యలను కలిగించే అవకాశం ఉంది. ఈ సమయంలో 12 రాశుల వారి జీవితంలో అనేక మార్పులు వచ్చినా, కొన్ని రాశుల వారు మాత్రం సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ఆర్థికపరంగా, ఆరోగ్యపరంగా ఎక్కువ శ్రద్ధ పెట్టడం మంచిది.

కుంభ రాశిలో సూర్య, రాహువుల సంయోగంతో గ్రహణ యోగం ఏర్పడుతుంది.. ఈ రాశుల వారు జాగ్రత్తగా ఉండాలి

1.మిథున రాశి

మిథున రాశి వారు ఈ సమయంలో జాగ్రత్తగా ఉండాలి. ఈ సమయంలో ఈ రాశి తొమ్మిదవ ఇంట్లో గ్రహణ యోగం ఏర్పడుతుంది. దీంతో అదృష్టంపై ప్రభావం పడుతుంది. అలాగే పిల్లలకు సంబంధించిన సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉంది. ఈ సమయంలో ఈ రాశి వారికి ఖర్చులు కూడా పెరుగుతాయి. అనవసరమైన ట్రిప్పులు వేసి డబ్బును వృథా చేసుకోవద్దు. ఆరోగ్యంపై కూడా శ్రద్ధ వహించాలి.

2.సింహ రాశి

సింహ రాశి వారికి ఏడవ ఇంట్లో ఈ గ్రహణ యోగం ఏర్పడుతుంది. ఈ సమయంలో ఈ రాశి వారికి సమస్యలు వచ్చే అవకాశం ఉంది. టెన్షన్ కూడా ఎక్కువ అవుతుంది. పార్ట్నర్‌షిప్‌తో వ్యాపారాలు చేసే వారు కూడా జాగ్రత్తగా ఉండాలి. అలాగే ఈ సమయంలో ఈ రాశి వారికి పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. డ్రైవింగ్ చేసేటప్పుడు కూడా ఎక్కువ జాగ్రత్త తీసుకోవాలి.

3.కన్య రాశి

కన్య రాశి వారికి ఆరవ ఇంట్లో ఈ గ్రహణ యోగం ఏర్పడుతుంది. దీంతో ఈ రాశి వారికి కూడా సమస్యలు రావచ్చు. ఈ సమయంలో ఈ రాశి వారు చుట్టూ ఉన్న వారిపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. ఆరోగ్యం సాధారణంగానే ఉంటుంది. పనిలో పురోగతి నెమ్మదిగా ఉంటుంది. మానసిక ఒత్తిడి ఎక్కువ అవుతుంది.

4.కుంభ రాశి

కుంభ రాశి వారికి కూడా ఈ గ్రహణ యోగం వలన సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ఈ రాశి వారు జాగ్రత్తగా ఉండాలి. రాహువు, సూర్యుని కారణంగా గాయాలు వంటివి ఉండొచ్చు. చిన్న చిన్న సమస్యలు కూడా కుటుంబంలో వచ్చే అవకాశం ఉంది. పెళ్లైన వారు జీవిత భాగస్వామితో చిన్నపాటి సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది.

5.మీన రాశి

మీన రాశి వారికి 12వ ఇంట్లో ఈ గ్రహణ యోగం ఏర్పడుతుంది. ఈ రాశి వారు కూడా సమస్యలను ఎదుర్కొనే అవకాశం ఉంది. ఆర్థికంగా నష్టం కలిగే అవకాశం ఉంది. అప్పులు ఎక్కువ అయ్యే అవకాశం కూడా కనపడుతోంది. విదేశీ ప్రయాణాలు చేయాలనుకునే వారికి కూడా ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. మానసికంగా ఇబ్బందులను ఎదుర్కొంటారు.