ఈ తేదీలలో జన్మించిన పురుషులు భార్యలకు ఉత్తమ భాగస్వాములు అవుతారు.. ప్రేమ, విధేయతకు ప్రతిరూపం!
న్యూమరాలజీలో ఒకటి నుంచి తొమ్మిది వరకు రాడిక్స్ సంఖ్యలు ఉంటాయి. ఈ సంఖ్య ఆధారంగా ఒక మనిషి వ్యక్తిత్వాన్ని తెలుసుకోవచ్చు. న్యూమరాలజీ ఒక మనిషి యొక్క రహస్యాలు అన్నిటినీ కూడా చెబుతుంది. ఈ తేదీలలో జన్మించిన పురుషులు భార్యలకు ఉత్తమ భాగస్వాములు అవుతారు. మరి ఈ రాడిక్స్ సంఖ్యల్లో మీరు కూడా ఉన్నారేమో చూసుకోండి.
న్యూమరాలజీ ఆధారంగా చాలా విషయాలను చెప్పవచ్చు. న్యూమరాలజీ ఆధారంగా ఒక మనిషి వ్యక్తిత్వం, తీరు ఎలా ఉంటుందనే విషయాన్ని చెప్పడంతో పాటుగా భవిష్యత్తు గురించి కూడా చెప్పొచ్చు. ఈరోజు న్యూమరాలజీకి సంబంధించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను తెలుసుకుందాం. న్యూమరాలజీలో ఒకటి నుంచి తొమ్మిది వరకు రాడిక్స్ సంఖ్యలు ఉంటాయి. ఈ సంఖ్య ఆధారంగా ఒక మనిషి వ్యక్తిత్వాన్ని తెలుసుకోవచ్చు. న్యూమరాలజీ ఒక మనిషి యొక్క రహస్యాలు అన్నిటినీ కూడా చెబుతుంది.

న్యూమరాలజీ
ఒక మనిషి బలహీనత ఏంటి, బలాలు ఏంటి, ఇలా చాలా రకాల విషయాలను తెలుసుకోవడానికి వీలవుతుంది. కెరీర్‌లో ఎలా విజయవంతం అవ్వచ్చు, వైవాహిక జీవితం ఎలా ఉంటుంది ఇలాంటి విషయాలు కూడా న్యూమరాలజీ చెబుతుంది. ఈ తేదీల్లో పుట్టిన అబ్బాయిలు భార్యకు మంచి జీవిత భాగస్వాములు అవుతారు. ఎల్లప్పుడూ వారిని ప్రేమగా చూసుకుంటారు. మరి ఈ రాడిక్స్ సంఖ్యల్లో మీరు కూడా ఉన్నారేమో చూసుకోండి.
ఈ తేదీల్లో పుట్టిన అబ్బాయిలు పెళ్లి తర్వాత భార్యను సంతోషంగా ఉంచుతారు:
ఏదైనా నెలలో 2, 11, 20, 29 తేదీల్లో పుట్టినట్లయితే, వారి రాడిక్స్ సంఖ్య రెండు అవుతుంది. రెండుకి అధిపతి చంద్రుడు. ఎమోషన్స్, మెదడు, ఆలోచనలు వంటి వాటికీ చంద్రుడు కారకుడు. ఈ సంఖ్యకు చెందిన వారు ప్రశాంతంగా ఉంటారు, కష్టపడి పని చేస్తారు.
త్వరగా సక్సెస్ అవుతారు
రాడిక్స్ నెంబర్ 2 వారు ఎంతో కష్టపడి పని చేస్తారు. ఎల్లప్పుడూ ప్రశాంతంగా ఉంటారు. ఎలాంటి వాతావరణంలోనైనా సరే ప్రశాంతంగా పని చేస్తారు. ఏకాగ్రతతో పనులను సులభంగా పూర్తి చేస్తారు. జీవితంలో త్వరగా సక్సెస్ అవుతారు.
భార్యకు మంచి భర్తగా ఉంటారు
రాడిక్స్ నెంబర్ 2 వారు మంచి భర్తలుగా పేరు తెచ్చుకుంటారు. తమ భార్యను ఎప్పుడూ సంతోషంగా ఉంచుతారు. ఎల్లప్పుడూ వారి భావాలను అర్థం చేసుకుంటారు. ఇలా వారి వైవాహిక జీవితం ఆనందంగా సాగుతుంది. ఎల్లప్పుడూ సంతోషంగా ఉంటారు.
కుటుంబానికి విలువ:
రెండు రాడిక్స్ సంఖ్య కలిగిన అబ్బాయిలు కుటుంబానికి చాలా విలువ ఇస్తారు. కుటుంబ సభ్యులందరినీ సంతోషంగా ఉంచడానికి ఎల్లప్పుడూ ట్రై చేస్తూ ఉంటారు. కుటుంబంలో అందరూ వీరిని గౌరవిస్తారు. వీరి మాటకి విలువ ఇస్తారు.
భార్య కలలను నెరవేర్చే భర్తలు:
ఈ తేదీల్లో పుట్టిన అబ్బాయిలు తమ భార్య కలలను కూడా నెరవేర్చుతారు. ఎల్లప్పుడూ ఆమెకు సపోర్ట్ ఇస్తారు. ఎమోషనల్ సపోర్ట్ కూడా ఇస్తారు. ఎల్లప్పుడూ భార్య వైపు నిలబడతారు.
ABOUT THE AUTHORPeddinti Sravyaపెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More

E-Paper


