ఈరోజే శక్తివంతమైన బుధ, కుజుల కలయిక, 4 రాశులకు ఊహించని లాభాలు.. డబ్బు, కొత్త ప్రాజెక్టులతో పాటు అనేకం

జ్యోతిష శాస్త్రంలో కుజుడు ధైర్యం, శక్తి, భూమి మొదలైన వాటికి కారకుడు. కుజుడు మేష, వృశ్చిక రాశులకు అధిపతి. ఈరోజు మధ్యాహ్నం 2:43కి కుజుడు తులా రాశి నుంచి వృశ్చిక రాశిలోకి ప్రవేశిస్తాడు. ఇప్పటికే వృశ్చిక రాశిలో బుధుడు సంచారం చేస్తున్నాడు. దీంతో ఈ రెండింటి కలయిక ఏర్పడుతుంది.

Published on: Oct 27, 2025, 13:30:14 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

గ్రహాలు కాలానుగుణంగా ఒక రాశి నుంచి మరో రాశిలోకి ప్రవేశిస్తూ ఉంటాయి. అలాంటప్పుడు శుభ యోగాలు, అశుభ యోగాలు ఏర్పడడం సహజం. గ్రహాలు రాశులను, నక్షత్రాలను మార్చినప్పుడు ద్వాదశ రాశుల వారిపై అది ప్రభావం చూపిస్తుంది. జ్యోతిష శాస్త్రంలో కుజుడు ధైర్యం, శక్తి, భూమి మొదలైన వాటికి కారకుడు. కుజుడు మేష, వృశ్చిక రాశులకు అధిపతి.

బుధ, కుజుల కలయిక.. ఈ రాశులకు అనేక లాభాలు (pinterest)
బుధ, కుజుల కలయిక.. ఈ రాశులకు అనేక లాభాలు (pinterest)

బుధ, కుజుల కలయిక.. ఈ రాశులకు అనేక లాభాలు

అక్టోబర్ 27 అంటే ఈరోజు మధ్యాహ్నం 2:43కి కుజుడు తులా రాశి నుంచి వృశ్చిక రాశిలోకి ప్రవేశిస్తాడు. ఇప్పటికే వృశ్చిక రాశిలో బుధుడు సంచారం చేస్తున్నాడు. దీంతో ఈ రెండింటి కలయిక ఏర్పడుతుంది. ఈ రెండు గ్రహాలు సంయోగం చెందడంతో ద్వాదశ రాశుల వారిపై ప్రభావం చూపిస్తుంది. అయితే కొన్ని రాశుల వారికి మాత్రం శుభ ఫలితాలు ఎదురవుతాయి. ముఖ్యంగా ఈ నాలుగు రాశుల వారికి అనేక విధాలుగా కలిసి వస్తుంది. మరి ఏ రాశుల వారు ఎలాంటి లాభాలను పొందుతారో చూద్దాం.

బుధ, కుజుల కలయికతో నాలుగు రాశులకు ఊహించని లాభాలు

1.కర్కాటక రాశి:

కర్కాటక రాశి వారికి ఈ సంయోగం శుభ ఫలితాలను తీసుకు రాబోతోంది. ఈ సమయంలో ఈ రాశి వారు కొత్త అవకాశాలను పొందుతారు. కొత్త వ్యాపారాన్ని మొదలుపెట్టడానికి కూడా ఇది మంచి సమయం. ఈ సమయంలో ఈ రాశి వారు సంతోషంగా వుంటారు. వ్యాపారులకు బాగా కలిసి వస్తుంది. కెరీర్‌లో కూడా సానుకూల మార్పులను చూస్తారు.

2.వృశ్చిక రాశి:

వృశ్చిక రాశి వారికి ఈ సమయం బాగా కలిసి వస్తుంది. ఈ రాశి వారు సానుకూల శక్తితో ముందుకు వెళ్తారు. మంచి నిర్ణయాలను తీసుకుంటారు. ఆరోగ్యం, కెరీర్ పరంగా కూడా బాగా కలిసి వస్తుంది. అనుకున్న పనులను పూర్తిచేస్తారు.

3.మకర రాశి:

ఈ సమయం మకర రాశి వారికి బాగా కలిసి వస్తుంది. ఈ రాశి వారు సంతోషంగా ఉంటారు. ఆదాయం పెరుగుతుంది. కొత్త అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి. ఆర్థికపరంగా బాగుంటుంది. కొత్త ప్రాజెక్టులను చేపడతారు. మంచి నిర్ణయాలను తీసుకుంటారు.

4.మీన రాశి:

మీన రాశి వారికి ఈ సమయం బాగా కలిసి వస్తుంది. ఈ రెండు గ్రహాల సంయోగంతో ఈ రాశి వారు సంతోషంగా ఉంటారు. మీకోసం కొత్త అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి. మీ టాలెంట్‌ను చూపించడానికి కూడా ఇది సరైన సమయం. మీపై మీరు ఫోకస్ పెట్టి ముందుకు వెళ్తే, కచ్చితంగా అనుకున్నవి పూర్తవుతాయి. అయితే కాస్త సహనంతో ఉండడం చాలా అవసరం

  • Peddinti Sravya
    ABOUT THE AUTHOR
    Peddinti Sravya

    పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More