హస్త నక్షత్రంలోకి బుధుడు - ఈ 7 రాశుల వారికి ఇక తిరుగుండదు..!

హస్త నక్షత్రంలోకి బుధుడి సంచారంతో 7 రాశుల వారికి మహర్దశ పట్టనుంది. సెప్టెంబర్ 13 నుంచి వ్యాపారం, ఉద్యోగం, ఆర్థిక విషయాల్లో ఈ రాశుల వారు అద్భుత ప్రయోజనాలు పొందుతారు.

Published on: Sep 9, 2026, 07:48:40 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల సంచారానికి, నక్షత్ర పరివర్తనకు విశేష ప్రాధాన్యత ఉంది. గ్రహాల కదలికల్లో వచ్చే మార్పులు ప్రతి ఒక్కరి జీవితంపైనా ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతాయి. నవగ్రహాలలో బుద్ధి, వ్యాపారం, కమ్యూనికేషన్‌కు కారకుడైన బుధ గ్రహం ఎప్పటికప్పుడు తన రాశినీ, నక్షత్రాన్నీ మారుస్తూ శుభ మరియు అశుభ ఫలితాలను అందిస్తుంటాడు. ప్రస్తుతం బుధుడు ఉత్తరఫల్గుణి నక్షత్రంలో, కన్యా రాశిలో సంచరిస్తున్నాడు. అయితే త్వరలోనే చంద్రుని నక్షత్ర సమూహమైన హస్త నక్షత్రంలోకి బుధుడు ప్రవేశించబోతున్నాడు.

హస్త నక్షత్రంలోకి బుధుడు
హస్త నక్షత్రంలోకి బుధుడు

హిందూ పంచాంగం ప్రకారం…. సెప్టెంబర్ 13, 2026న ఉదయం 10:47 గంటలకు బుధుడు హస్త నక్షత్రంలోకి అడుగుపెడతాడు. ఈ నక్షత్రంలో సెప్టెంబర్ 21 వరకు బుధుడి గోచారం కొనసాగుతుంది. చంద్రుడికి చెందిన హస్త నక్షత్రంలోకి బుధుడు మారడం వల్ల కొన్ని రాశుల జాతకులకు విశేష లాభాలు కలగనున్నాయి.

ప్రముఖ జ్యోతిష్య నిపుణులు నరేంద్ర ఉపాధ్యాయ్ తెలిపిన వివరాల ప్రకారం…. ఈ నక్షత్ర సంచారం ప్రధానంగా 7 రాశుల వారికి అత్యంత శ్రేష్ఠమైన ఫలితాలను, సంపదనూ అందించబోతోంది. ఆ రాశులేవో, ఎవరికి ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో వివరంగా తెలుసుకుందాం.

మేష రాశి :

హస్త నక్షత్రంలో బుధుడి సంచారం మేష రాశి వారికి ఎంతో మేలు చేస్తుంది. మీరు మీ కెరీర్, ఉద్యోగానికి సంబంధించి గతంలో వేసుకున్న ప్రణాళికలు ఇప్పుడు అద్భుతమైన పురోగతిని చూపిస్తాయి. వ్యాపారంలో సరైన నిర్ణయాలు తీసుకోవడం ద్వారా మంచి అభివృద్ధి సాధిస్తారు.

వృషభ రాశి :

ఈ రాశి జాతకులకు ఈ నక్షత్ర పరివర్తన అత్యంత శుభప్రదంగా మారుతుంది. ముఖ్యంగా వ్యాపార రంగంలో ఉన్నవారికి ఆశించిన స్థాయిలో కలసివస్తుంది. వ్యాపారాభివృద్ధికి సంబంధించి కొన్ని కీలకమైన శుభవార్తలు వింటారు. ఆర్థికంగా పుంజుకునే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.

కర్కాటక రాశి :

కర్కాటక రాశి వారికి ఈ సంచారం అదృష్టాన్ని మోసుకొస్తుంది. చాలా కాలంగా వేధిస్తున్న కోర్టు కేసులు, చట్టపరమైన చిక్కుల నుంచి ఉపశమనం లభిస్తుంది. న్యాయపరమైన వ్యవహారాల్లో మీకు అనుకూలంగా శుభవార్తలు అందుతాయి. నిలిచిపోయిన పనులు వేగవంతమవుతాయి.

సింహ రాశి :

ఈ రాశి వారికి ఈ సమయం అద్భుతంగా కలసివస్తుంది. మీ ప్రణాళికలు, వ్యూహాల ముందు ప్రత్యర్థులు నిలబడలేరు. శత్రువులు మీకు ఎలాంటి హానీ చేయలేరు. సమాజంలో మీ బలం, ఆధిపత్యం పెరుగుతాయి.

తులా రాశి :

తులా రాశి జాతకులకు బుధుడి నక్షత్ర మార్పు సానుకూల ఫలితాలను ఇస్తుంది. ఇప్పటివరకు వేధించిన అనవసర ఖర్చులను నియంత్రించగలుగుతారు. అంతేకాకుండా, కుటుంబ సభ్యులతో ఆనందంగా సమయాన్ని గడుపుతారు. మానసిక ప్రశాంతత లభిస్తుంది.

ధనుస్సు రాశి :

ధనుస్సు రాశి వారికి ఈ గోచారం ఎంతగానో అనుకూలిస్తుంది. ఆర్థిక పరిస్థితులు మునుపటి కంటే మెరుగవుతాయి. వివిధ మార్గాల నుంచి ఆదాయం సమకూరే అవకాశం ఉంది. పాత బకాయిలు వసూలవుతాయి.

కుంభ రాశి :

కుంభ రాశి వారికి ఈ కాలం అత్యంత శుభప్రదంగా ఉంటుంది. సమాజంలో మీ పేరు ప్రఖ్యాతులు, గౌరవ మర్యాదలు రెట్టింపవుతాయి. ప్రతి రంగంలోనూ మీ ప్రతిభకు తగిన గుర్తింపు లభిస్తుంది.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More