చాలామంది వాస్తు ప్రకారం అనుసరిస్తూ ఉంటారు. వాస్తు ప్రకారం పాటించడం వల్ల అనేక విధాలుగా ప్రయోజనాలను పొందడానికి వీలవుతుంది. వాస్తు ప్రకారం పాటించడం వల్ల సానుకూల శక్తి కూడా వ్యాపిస్తుంది. చాలా మంది ఇంట్లో వాస్తుకు తగ్గట్టుగా చిన్న చిన్న మార్పులు చేస్తూ ఉంటారు. స్మార్ట్‌ఫోన్ విషయంలో కూడా కొన్ని వాస్తు నియమాలను పాటించొచ్చు.

ఈ రోజుల్లో స్మార్ట్‌ఫోన్ లేని వారంటూ లేరు. రోజులో ఎన్నో సార్లు మనం మొబైల్ స్క్రీన్, గ్యాలరీలను చూస్తూ ఉంటాము. వాస్తు ప్రకారం, పదేపదే మనం చూసే చిత్రాలు మన మనసు, ఆలోచనలు, శక్తిపై ప్రభావాన్ని చూపిస్తాయని నమ్ముతారు. అందుకే మొబైల్ గ్యాలరీ, వాల్‌పేపర్‌లో సానుకూలతను కలిగించే చిత్రాలను పెట్టుకోవడం మంచిది. కొన్ని రకాల చిత్రాలను స్క్రీన్‌పై ఉంచుకోవడం ఏమాత్రం మంచిది కాదు.
మొబైల్ వాల్‌పేపర్‌లో ఎలాంటి చిత్రాలను పెట్టుకోవాలి? ఏ ఫోటోలను దూరంగా ఉంచాలి?
వాస్తు ప్రకారం, విరిగిన వస్తువులు, శిథిలాలు, ఎండిపోయిన చెట్లు, నిర్మానుష్య ప్రదేశాలు, భయానక దృశ్యాలు వంటివి మొబైల్ వాల్‌పేపర్‌గా ఉండడం మంచిది కాదు. ఇలాంటి చిత్రాలు మనలో ప్రతికూల శక్తిని, ప్రతికూల ఆలోచనలను కలిగిస్తాయని, నిరాశను పెంచుతాయని చెబుతారు.
ఏడుస్తున్న వ్యక్తుల ఫోటోలు, హింస, గొడవలు, ఆయుధాలు లేదా విషాదకరమైన సంఘటనలకు సంబంధించిన చిత్రాలను కూడా పెట్టుకోకూడదు. ఇలాంటివి పెట్టినట్లయితే మానసిక ఒత్తిడి, అశాంతి వంటివి కలుగుతాయని నమ్ముతారు.
గతంలో చేదు అనుభవాలు లేదా కష్టాలను గుర్తు చేసే పాత ఫోటోలు కూడా పెట్టుకోకూడదు. ఇలాంటి వాటిని గ్యాలరీలో కూడా ఉంచుకోవడం ఏమాత్రం మంచిది కాదు.
ఎలాంటి చిత్రాలు వాల్‌పేపర్‌గా ఉండొచ్చు?
మొబైల్‌ను సానుకూల శక్తికి ప్రతీకగా మార్చుకోవాలంటే ఉదయించే సూర్యుడు, పచ్చని చెట్లు, వికసించిన పూలు వంటి చిత్రాలను పెట్టుకోండి. అలాగే ప్రవహించే నదులు, నిర్మలమైన ఆకాశం, చిరునవ్వుతో ఉన్న ముఖాల ఫోటోలను కూడా పెట్టుకోవచ్చు. వాల్‌పేపర్‌గా లేదా గ్యాలరీలో కూడా ఇవి ఉంటే మంచిదే. ఇలాంటి దృశ్యాలు మనసును ప్రశాంతంగా మారుస్తాయి. సానుకూల ఆలోచనలను పెంపొందిస్తాయి.
{{/usCountry}}మొబైల్‌ను సానుకూల శక్తికి ప్రతీకగా మార్చుకోవాలంటే ఉదయించే సూర్యుడు, పచ్చని చెట్లు, వికసించిన పూలు వంటి చిత్రాలను పెట్టుకోండి. అలాగే ప్రవహించే నదులు, నిర్మలమైన ఆకాశం, చిరునవ్వుతో ఉన్న ముఖాల ఫోటోలను కూడా పెట్టుకోవచ్చు. వాల్‌పేపర్‌గా లేదా గ్యాలరీలో కూడా ఇవి ఉంటే మంచిదే. ఇలాంటి దృశ్యాలు మనసును ప్రశాంతంగా మారుస్తాయి. సానుకూల ఆలోచనలను పెంపొందిస్తాయి.
{{/usCountry}}ఇవన్నీ మతపరమైన, సాంప్రదాయ విశ్వాసాల ఆధారంగా ఉన్న అభిప్రాయాలు మాత్రమే. మానసిక ప్రశాంతత, ఆత్మవిశ్వాసం కోసం సానుకూల జీవనశైలిని పాటించండి. అలాగే మంచి ఆలోచనలు, సమతుల్య దినచర్య కూడా ముఖ్యమైనవి.
నిరాకరణ: ఈ వ్యాసంలో ఉన్న సమాచారం పూర్తిగా నిజం మరియు ఖచ్చితమైనదని మేము చెప్పము. మరిన్ని వివరాలు మరియు మరింత సమాచారం కోసం, సంబంధిత రంగంలో నిపుణుడిని సంప్రదించాలని నిర్ధారించుకోండి.