Mobile Wall Paper Vastu: వాస్తు శాస్త్రం ప్రకారం మొబైల్ వాల్‌పేపర్ ఎలా ఉండాలి? ఈ చిత్రాలు అదృష్టాన్ని ఆకర్షిస్తాయట
వాస్తు శాస్త్రం ప్రకారం మొబైల్‌లో తరచుగా చూసే చిత్రాలు మన ఆలోచనలు, మనస్తత్వం, శక్తిపై ప్రభావం చూపుతాయని విశ్వసిస్తారు. అందువల్ల విరిగిన వస్తువులు, శిథిలాలు, ఎండిపోయిన చెట్లు, నిర్మానుష్య చిత్రాలను వాల్‌పేపర్ లేదా గ్యాలరీలో ఉంచకపోవడం మంచిదని సూచిస్తారు.
చాలామంది వాస్తు ప్రకారం అనుసరిస్తూ ఉంటారు. వాస్తు ప్రకారం పాటించడం వల్ల అనేక విధాలుగా ప్రయోజనాలను పొందడానికి వీలవుతుంది. వాస్తు ప్రకారం పాటించడం వల్ల సానుకూల శక్తి కూడా వ్యాపిస్తుంది. చాలా మంది ఇంట్లో వాస్తుకు తగ్గట్టుగా చిన్న చిన్న మార్పులు చేస్తూ ఉంటారు. స్మార్ట్‌ఫోన్ విషయంలో కూడా కొన్ని వాస్తు నియమాలను పాటించొచ్చు.

ఈ రోజుల్లో స్మార్ట్‌ఫోన్ లేని వారంటూ లేరు. రోజులో ఎన్నో సార్లు మనం మొబైల్ స్క్రీన్, గ్యాలరీలను చూస్తూ ఉంటాము. వాస్తు ప్రకారం, పదేపదే మనం చూసే చిత్రాలు మన మనసు, ఆలోచనలు, శక్తిపై ప్రభావాన్ని చూపిస్తాయని నమ్ముతారు. అందుకే మొబైల్ గ్యాలరీ, వాల్‌పేపర్‌లో సానుకూలతను కలిగించే చిత్రాలను పెట్టుకోవడం మంచిది. కొన్ని రకాల చిత్రాలను స్క్రీన్‌పై ఉంచుకోవడం ఏమాత్రం మంచిది కాదు.
మొబైల్ వాల్‌పేపర్‌లో ఎలాంటి చిత్రాలను పెట్టుకోవాలి? ఏ ఫోటోలను దూరంగా ఉంచాలి?
వాస్తు ప్రకారం, విరిగిన వస్తువులు, శిథిలాలు, ఎండిపోయిన చెట్లు, నిర్మానుష్య ప్రదేశాలు, భయానక దృశ్యాలు వంటివి మొబైల్ వాల్‌పేపర్‌గా ఉండడం మంచిది కాదు. ఇలాంటి చిత్రాలు మనలో ప్రతికూల శక్తిని, ప్రతికూల ఆలోచనలను కలిగిస్తాయని, నిరాశను పెంచుతాయని చెబుతారు.
ఏడుస్తున్న వ్యక్తుల ఫోటోలు, హింస, గొడవలు, ఆయుధాలు లేదా విషాదకరమైన సంఘటనలకు సంబంధించిన చిత్రాలను కూడా పెట్టుకోకూడదు. ఇలాంటివి పెట్టినట్లయితే మానసిక ఒత్తిడి, అశాంతి వంటివి కలుగుతాయని నమ్ముతారు.
గతంలో చేదు అనుభవాలు లేదా కష్టాలను గుర్తు చేసే పాత ఫోటోలు కూడా పెట్టుకోకూడదు. ఇలాంటి వాటిని గ్యాలరీలో కూడా ఉంచుకోవడం ఏమాత్రం మంచిది కాదు.
ఎలాంటి చిత్రాలు వాల్‌పేపర్‌గా ఉండొచ్చు?
మొబైల్‌ను సానుకూల శక్తికి ప్రతీకగా మార్చుకోవాలంటే ఉదయించే సూర్యుడు, పచ్చని చెట్లు, వికసించిన పూలు వంటి చిత్రాలను పెట్టుకోండి. అలాగే ప్రవహించే నదులు, నిర్మలమైన ఆకాశం, చిరునవ్వుతో ఉన్న ముఖాల ఫోటోలను కూడా పెట్టుకోవచ్చు. వాల్‌పేపర్‌గా లేదా గ్యాలరీలో కూడా ఇవి ఉంటే మంచిదే. ఇలాంటి దృశ్యాలు మనసును ప్రశాంతంగా మారుస్తాయి. సానుకూల ఆలోచనలను పెంపొందిస్తాయి.
ఇవన్నీ మతపరమైన, సాంప్రదాయ విశ్వాసాల ఆధారంగా ఉన్న అభిప్రాయాలు మాత్రమే. మానసిక ప్రశాంతత, ఆత్మవిశ్వాసం కోసం సానుకూల జీవనశైలిని పాటించండి. అలాగే మంచి ఆలోచనలు, సమతుల్య దినచర్య కూడా ముఖ్యమైనవి.
నిరాకరణ: ఈ వ్యాసంలో ఉన్న సమాచారం పూర్తిగా నిజం మరియు ఖచ్చితమైనదని మేము చెప్పము. మరిన్ని వివరాలు మరియు మరింత సమాచారం కోసం, సంబంధిత రంగంలో నిపుణుడిని సంప్రదించాలని నిర్ధారించుకోండి.
ABOUT THE AUTHORPeddinti Sravyaపెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More

E-Paper


