...
...
Next Story

Moodam Effect on Marriages: పెళ్ళి ముహుర్తాలు ఇప్పట్లో లేవు.. ఈరోజు నుంచి మూఢం, 83 రోజుల పాటు పెళ్ళిళ్ళకు బ్రేక్!

Moodam Effect on Marriages: ఈరోజు నుంచి పెళ్లిళ్లకు బ్రేక్. శుక్ర మూఢమి మొదలవుతోంది. మౌడ్యమి అంటే శూన్యం, చీకటి అని అర్థం. గురువు లేదా శుక్రుడు సూర్యుడుతో కలిసి ఉన్నప్పుడు మూఢం అంటారు. గురువు, శుక్రుడు సూర్యుడికి దగ్గరగా వచ్చినప్పుడు అవి కాంతిని కోల్పోతాయి. అలాంటి సమయంలో మౌడ్యమి ఏర్పడుతుంది.

Published on: Nov 26, 2025, 11:00:16 IST
Advertisement

Moodam Effect on Marriages: ఈరోజు నుంచి పెళ్లిళ్లకు బ్రేక్. ఈరోజు నుంచి శుక్ర మూఢమి మొదలవుతోంది. దీనినే శుక్ర మౌడ్యమి అని కూడా అంటారు. మూఢం సమయంలో శుభకార్యాలు చేయకూడదు. ఇక ఈ శుక్ర మూఢం ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉండబోతోంది? ఈ సమయంలో ఏం చేయకూడదు? శుక్ర మూఢం అంటే అసలు ఏంటి వంటి విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.

శుక్ర మౌడ్యమి సమయంలో ఈ పనులు చేయకూడదు:

Moodam Effect on Marriages: పెళ్ళి ముహుర్తాలు ఇప్పట్లో లేవు.. ఈరోజు నుంచి మూఢం (pinterest)
Moodam Effect on Marriages: పెళ్ళి ముహుర్తాలు ఇప్పట్లో లేవు.. ఈరోజు నుంచి మూఢం (pinterest)

శుక్ర మౌడ్యమి సమయంలో పెళ్లిచూపులు, నిశ్చితార్థం, పెళ్లి, ఉపనయనం, గృహప్రవేశం, వాహనాలు కొనుగోలు చేయడం, ఇల్లు కొనుగోలు చేయడం, విగ్రహాలు ప్రతిష్టించడం, బోర్లు వేయించడం, పుట్టు వెంట్రుకలు తీయించడం, కొత్త వ్యాపారాలు మొదలుపెట్టడం, పదవి ప్రమాణ స్వీకారం చేయడం వంటివి చేయకూడదు. ఇలాంటి పనులు చేయడం వలన సమస్యలు వస్తాయని చెబుతారు. అందుకే శుక్ర మౌడ్యమి సమయంలో వీటిని చేయరు.

శుక్ర మౌడ్యమి ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉంది?

ఈ ఏడాది నవంబర్ 26 అంటే ఈరోజు నుంచి శుక్ర మౌడ్యమి ప్రారంభం కాబోతోంది. 2026 ఫిబ్రవరి 17 వరకు ఈ మౌడ్యమి ఉంటుంది. మొత్తం 83 రోజుల పాటు ఈ మౌడ్యమి కొనసాగుతుంది. మార్గశిర శుద్ధ షష్ఠి నుంచి మాఘ బహుళ అమావాస్య దాకా ఉండబోతోంది. ఈ సమయంలో ఎలాంటి శుభకార్యాలు చేయకూడదు. మాఘ మాసం వచ్చేదాకా పెళ్లిళ్లు చేయకూడదు. అప్పటి వరకు శుభముహూర్తాలు లేవు.

శుక్ర మౌడ్యమి అంటే ఏంటి?

మౌడ్యమి అంటే శూన్యం, చీకటి అని అర్థం. గురువు లేదా శుక్రుడు సూర్యుడుతో కలిసి ఉన్నప్పుడు మూఢం అంటారు. గురువు, శుక్రుడు సూర్యుడికి దగ్గరగా వచ్చినప్పుడు అవి కాంతిని కోల్పోతాయి. దీంతో చీకటి ఏర్పడుతుంది. అలాంటి సమయంలో మౌడ్యమి ఏర్పడుతుంది.

 
ABOUT THE AUTHOR
Peddinti Sravya

పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారు

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks