ఇంటి గుమ్మానికి ఎదురుగా మునగ చెట్టు ఉంటే శుభమా, అశుభమా? చాలా మంది తెలియక చేసే పొరపాట్లు ఇవి!

చాలా మంది వారి ఇళ్లల్లో పెంచే మొక్కలు, చెట్ల విషయంలో కూడా వాస్తు ప్రకారం పాటిస్తూ ఉంటారు. వాస్తు ప్రకారం మొక్కలను, చెట్లను పెంచడం వలన సానుకూల శక్తితో సంతోషంగా ఉండడానికి వీలవుతుంది. ఇంట్లో మునగ చెట్టు ఏ దిశలో ఉంటే మంచిది? గుమ్మానికి ఎదురుగా ఉండొచ్చా? ఉండకూడదా? వంటి విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.

Published on: Nov 13, 2025 12:00 PM IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

చాలామంది వాస్తు ప్రకారం పాటిస్తారు. వాస్తు ప్రకారం పాటించడం వలన ఇంట్లో సానుకూల శక్తి కలిగి ఆనందంగా ఉండొచ్చు, ప్రతికూల శక్తి తొలగిపోతుంది. దీంతో ఏ బాధ లేకుండా ఉండొచ్చు. చాలా మంది వారి ఇళ్లల్లో పెంచే మొక్కలు, చెట్ల విషయంలో కూడా వాస్తు ప్రకారం పాటిస్తూ ఉంటారు. వాస్తు ప్రకారం మొక్కలను, చెట్లను పెంచడం వలన సానుకూల శక్తితో సంతోషంగా ఉండడానికి వీలవుతుంది.

వాస్తు ప్రకారం మునగ చెట్టు గుమ్మానికి ఎదురుగా ఉండొచ్చా? (pinterest)
వాస్తు ప్రకారం మునగ చెట్టు గుమ్మానికి ఎదురుగా ఉండొచ్చా? (pinterest)

ప్రధాన ద్వారం

ఇంటి ప్రధాన ద్వారం ఎప్పుడు శుభ్రంగా, అందంగా ఉండేలా చూసుకుంటారు. అయితే ఇంటి ప్రధాన ద్వారం ఎదురుగా ఉండే మొక్కల విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. ఇంట్లో మునగ చెట్టు ఏ దిశలో ఉంటే మంచిది? గుమ్మానికి ఎదురుగా ఉండొచ్చా? ఉండకూడదా? వంటి విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.

వాస్తు ప్రకారం మునగ చెట్టు గుమ్మానికి ఎదురుగా ఉండొచ్చా?

ఇంటి గుమ్మం లేదా ప్రధాన ద్వారం చాలా ముఖ్యమైనవి. వీటిని ఎప్పుడు శుభ్రంగా ఉంచుకోవాలి, అప్పుడు లక్ష్మీదేవి వస్తుంది. ప్రధాన ద్వారం శుభ్రంగా లేకపోతే లక్ష్మీదేవి అట్టు నుంచి అంటే వెళ్ళిపోతుంది. అందుకే గుమ్మాన్ని అందంగా అలంకరించుకుంటూ ఉంటారు. అలాగే గుమ్మం దగ్గర కొన్ని వస్తువులను కూడా పెడుతూ ఉంటారు. గుమ్మం ఎదురుగా చెట్లు ఉండకూడదు. గుమ్మానికి ఎదురుగా ఏ చెట్టు కూడా ఉండకూడదు, ఎందుకంటే గుమ్మానికి ఎదురుగా చెట్టు ఉంటే శక్తి ప్రవాహానికి అడ్డంకి కలుగుతుంది. పాజిటివ్ ఎనర్జీ రాకుండా అడ్డుపడినట్లు అవుతుంది.

ఇలా లేకుండా చూసుకోవాలి

ఎప్పుడూ కూడా గుమ్మానికి ఎదురుగా పెద్ద స్తంభాలు, చెట్లు వంటివి ఉండకూడదు. వాటి వలన ఆర్థిక సమస్యలు, అనారోగ్య సమస్యలు, మానసిక అశాంతి వంటివి కలుగుతాయి. మునగ చెట్టు పెద్దగా ఉండి గుమ్మాన్ని మొత్తం కప్పేసినట్లయితే శక్తి ప్రవాహాన్ని అడ్డుకున్నట్లే అవుతుంది. దీంతో ఇంట్లో సమస్యలు వస్తాయి. అదే గుమ్మాన్ని పూర్తిగా కప్పకుండా కాస్త గ్యాప్ ఉంటే లేదా గుమ్మానికి చెట్టుకి ఎక్కువ దూరం ఉంటే బాగుంటుంది. అలాగే గుమ్మం కంటే చెట్టు ఎత్తుగా ఉండకూడదు. అలా ఉంటే గాలి, వెల్తురు రాదు. శక్తి ప్రవాహానికి కూడా అడ్డుగా ఉంటుంది.

ఇలా ఉంటే మంచిదే

మునగ చెట్టును ఇంట్లో పెంచేటప్పుడు గుమ్మానికి మరీ దగ్గరగా లేకుండా, గుమ్మం కంటే ఎత్తుగా లేకుండా చూసుకోవాలి. అలాగే నీడ గుమ్మం పై పడినా, రాకపోకలకు అడ్డుగా ఉన్నా కూడా ప్రతికూల శక్తిని ఎదుర్కోవాల్సి ఉంటుంది. కాబట్టి ఈ పొరపాట్లు జరగకుండా చూసుకోవాలి. తగినంత దూరంలో, తక్కువ ఎత్తులో ఉంటే ఏ నష్టం కలగదు. ఇంట్లో మునగ చెట్టును పెంచుకోవాలనుకునే వారు పెరడులో మగ చెట్టును పెంచుకోవడం మంచిది. అలా చేయడం వలన వాస్తు దోషాలు కలగవు. ఇంట్లో మునగ చెట్టు ఉండడం ఎంతో శ్రేయస్కరం, అనేక లాభాలను పొందవచ్చు. ఆరోగ్యానికి కూడా మంచిదే

News/Rasi Phalalu/ఇంటి గుమ్మానికి ఎదురుగా మునగ చెట్టు ఉంటే శుభమా, అశుభమా? చాలా మంది తెలియక చేసే పొరపాట్లు ఇవి!
News/Rasi Phalalu/ఇంటి గుమ్మానికి ఎదురుగా మునగ చెట్టు ఉంటే శుభమా, అశుభమా? చాలా మంది తెలియక చేసే పొరపాట్లు ఇవి!