...
...
Next Story

నాగుల చవితి 2025: ఈ ఏడాది నాగుల చవితి ఎప్పుడు వచ్చింది? తేదీ, సమయం, పూజా విధానంతో పాటు చదవల్సిన శ్లోకాలు ఇవిగో

తెలుగు రాష్ట్రాలలో నాగుల చవితిని ఆచరిస్తారు. ప్రకృతి, జంతువుల పట్ల గౌరవ సూచికంగా నాగుల చవితిని జరుపుతారు. ఈ ఏడాది నాగుల చవితి అక్టోబర్ 25న వచ్చింది. నాగుల చవితి నాడు భక్తులు పుట్టలో ఆవు పాలు పోసి గుడ్లు వేస్తారు. చలిమిడి, చిమ్మిలి నైవేద్యంగా పెడతారు. రోజంతా ఉపవాసం ఉండి, రాత్రి చిమ్మిలిని తింటారు.

Published on: Oct 23, 2025, 08:00:00 IST
Advertisement

ప్రతి ఏటా కార్తీక శుద్ధ చవితి నాడు నాగుల చవితిని జరుపుకుంటాము. తెలుగు రాష్ట్రాలలో నాగుల చవితిని ఆచరిస్తారు. ప్రకృతి, జంతువుల పట్ల గౌరవ సూచికంగా నాగుల చవితిని జరుపుతారు. ఈ ఏడాది నాగుల చవితి అక్టోబర్ 25న వచ్చింది. అయితే, ఇప్పుడు శుభ ముహూర్తం, పూజా విధానం తో పాటు పూర్తి వివరాలను తెలుసుకుందాం.

నాగుల చవితి 2025 తేదీ, శుభ ముహూర్తం

నాగుల చవితి 2025 తేదీ, శుభ ముహూర్తం (pinterest)
నాగుల చవితి 2025 తేదీ, శుభ ముహూర్తం (pinterest)

ఈ ఏడాది నాగుల చవితి అక్టోబర్ 25న వచ్చింది. చవితి తిథి అక్టోబర్ 25న తెల్లవారుజామున 1:19కి ప్రారంభమై, అక్టోబర్ 26న తెల్లవారుజామున 3:48కి ముగుస్తుంది.

నాగుల చవితి 2025 పూజ చేయడానికి శుభ ముహూర్తం

నాగుల చవితి పూజ చేయడానికి శుభ ముహూర్తం అక్టోబర్ 25 ఉదయం 8:09 నుండి 10:25 వరకు. ఈ సమయంలో నాగదేవతకు పూజ చేయడం వలన శుభఫలితాలు ఎదురవుతాయి.

నాగుల చవితి 2025 పూజా విధానం

  1. నాగుల చవితి నాడు భక్తులు పుట్టలో ఆవు పాలు పోసి గుడ్లు వేస్తారు. చలిమిడి, చిమ్మిలి నైవేద్యంగా పెడతారు. రోజంతా ఉపవాసం ఉండి, రాత్రి చిమిలిని ప్రసాదంగా తింటారు.
  2. నాగుల చవితినాడు జంట నాగుల విగ్రహాలకు అభిషేకం చేస్తే చాలా మంచి ఫలితం ఎదురవుతుంది.
  3. పాలు, పసుపు, కుంకుమలతో అభిషేకం చేయాలి. పుట్ట దగ్గర టపాసులు కూడా పేలుస్తారు.
  4. సౌభాగ్యం, సంతానం కలగాలని మహిళలు నాగుల చవితి నాడు సర్పపూజ చేస్తారు.
  5. నాగుల చవితి నాడు నాగదేవతను ఆరాధిస్తే రాహువు దుష్ప్రభావాల నుండి బయటపడొచ్చు. సర్పదోషాలు ఏమైనా ఉన్నా తొలగిపోతాయి.
  6. నాగుల చవితి నాడు నాగేంద్రుడు పరమేశ్వరుడికి వాసుకిగా, విష్ణువు ఆదిశేషుగా మారతారని చెబుతారు. అందుకనే భక్తులు నాగదేవతను ఆరాధిస్తారు. సంతానం లేని వారు నాగదేవుని ఆరాధిస్తే సంతానప్రాప్తి కలుగుతుంది.

రైతులకు ప్రత్యేకం

 
ABOUT THE AUTHOR
Peddinti Sravya

పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారు

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks