...
...
Next Story

నాగుల చవితి ఎప్పుడు? నాగేంద్రుడి పూజకు శుభ ముహూర్తం ఇదే.. ఈ నియమాలు తప్పక పాటించండి!

హిందూ సంప్రదాయంలో నాగుల చవితికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. 2026లో నవంబర్ 13, శుక్రవారం నాగుల చవితి పండుగను జరుపుకుంటారు. నవంబర్ 12 సాయంత్రం 6:09 గంటలకు ప్రారంభమయ్యే చవితి తిథి నవంబర్ 13 రాత్రి 8:42 గంటలకు ముగుస్తుంది.

Published on: Nov 9, 2026, 14:00:54 IST
Advertisement

ప్రతి ఏటా దీపావళి అమావాస్య తర్వాత వచ్చే చవితి రోజున నాగుల చవితిని జరుపుకుంటాము. నాగుల చవితి హిందువులు అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకునే పవిత్రమైన పండుగ. తెలుగు రాష్ట్రాల్లో నాగుల చవితికి ఎంతో ప్రాధాన్యత ఉంది. ఆ రోజు నాగదేవతలను పూజించడం వలన కుటుంబంలో సుఖ సంతోషాలు ఉంటాయని, సంతాన సౌభాగ్యం, ఐశ్వర్యం, ఆరోగ్యం సిద్ధిస్తాయని నమ్మకం.

నాగుల చవితి ఎప్పుడు? నాగేంద్రుడి పూజకు శుభ ముహూర్తం ఇదే.. ఈ నియమాలు తప్పక పాటించండి! (AI)
నాగుల చవితి ఎప్పుడు? నాగేంద్రుడి పూజకు శుభ ముహూర్తం ఇదే.. ఈ నియమాలు తప్పక పాటించండి! (AI)

2026లో నాగుల చవితి ఎప్పుడు వచ్చింది? తేదీ, సమయంతో పాటుగా ఏ సమయంలో పూజ చేసుకోవాలి? ఆధ్యాత్మిక విశిష్టత వివరాలు మొదలైన విషయాలను తెలుసుకుందాం.

2026లో నాగుల చవితి ఎప్పుడు వచ్చింది?

పంచాంగం ఆధారంగా చూసినట్లయితే నాగుల చవితి నవంబర్ 13, శుక్రవారం నాడు వచ్చింది. చవితి ప్రారంభం నవంబర్ 12 సాయంత్రం 6:09 గంటలకు. చవితి తిథి ముగింపు నవంబర్ 13 రాత్రి 8:42 గంటలకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:36 నుంచి మధ్యాహ్నం 12:24 వరకు. పంచాంగం ప్రకారం నవంబర్ 13, శుక్రవారం నాడు నాగుల చవితిని జరుపుకోవాలి. ఆ రోజే నాగులను పూజించాలి.

నాగుల చవితి విశిష్టత

నాగదేవతలను పూజించడం వలన కుటుంబంలో సుఖ సంతోషాలు, సంతాన సౌభాగ్యం, ఆయురారోగ్యాలు సిద్ధిస్తాయి. పిల్లలు ఆరోగ్యంగా ఉండడానికి, ఆయుష్షు పెరగడానికి, కుటుంబం క్షేమంగా ఉండడానికి ఆ రోజు మహిళలు ఉపవాసం ఉండి నాగేంద్రుని ప్రత్యేకంగా పూజిస్తారు.

శివుడి మెడలో నాగాభరణంగా, విష్ణువుకు ఆదిశేషుడిగా నాగులకు ప్రత్యేక స్థానం ఉంది. ఆ విశేషమైన నాగులను నాగుల చవితి నాడు ప్రత్యేకంగా పూజించడం వలన అనేక విధాలుగా ప్రయోజనాలు కలుగుతాయి.

నాగుల చవితి నాడు ఎలా పూజ చేయాలి?

పసుపు, కుంకుమలు, పువ్వులతో అలంకరించి పూజించాలి. కచ్చితంగా చలిమిడి, చిమిలి, వడపప్పు, అరటిపండ్లు, కొబ్బరికాయను నైవేద్యంగా సమర్పించాలి.

నాగ దేవతలకు భక్తిశ్రద్ధలతో హారతి ఇవ్వాలి. కుటుంబ సభ్యుల క్షేమం కోసం నాగ దేవతలను పూజించాలి.

నాగుల చవితి నాడు పాటించాల్సిన నియమాలు

పాములకు హాని చేయకూడదు. పుట్టలో పాలు పోయడం కంటే విగ్రహాలను పూజించడం మంచిది.

పేదలకు అన్నదానం, వస్త్రదానం వంటివి చేయడం వలన అద్భుతమైన ఫలితాలను చూడొచ్చు.

నాగదేవతను పూజించేటప్పుడు భక్తిశ్రద్ధలతో పూజించండి. కుటుంబ ఆచారాలను అనుసరించి ఉపవాసాన్ని పాటించండి.

 
ABOUT THE AUTHOR
Peddinti Sravya

పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారు

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks