ఈ ఏడాది అక్టోబర్ నెలలో శారదీయ నవరాత్రి వేడుకలు ఘనంగా ప్రారంభం కానున్నాయి. అక్టోబర్ 11 నుంచి ఘటస్థాపనతో మొదలయ్యే ఈ నవరాత్రి ఉత్సవాలు అక్టోబర్ 20న విజయదశమి (దసరా)తో ముగియనున్నాయి.

హిందూ ధర్మంలో అత్యంత పవిత్రంగా, భక్తిశ్రద్ధలతో జరుపుకునే శారదీయ నవరాత్రి వేడుకలకు రంగం సిద్ధమైంది. ఈ ఏడాది అక్టోబర్ నెలలో దేవీ నవరాత్రులు ప్రారంభం కానుండటంతో భక్తుల్లో ఆధ్యాత్మిక ఉత్సాహం నెలకొంది. అక్టోబర్ 11, 2026 నుంచి శారదీయ నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి.
ఇదే రోజున ఇళ్లలోనూ, ప్రత్యేకంగా అలంకరించిన ఆలయాలలోనూ కలశ స్థాపన (ఘటస్థాపన)తో అమ్మవారి పూజా కార్యక్రమాలు మొదలవుతాయి. నవరాత్రుల చివరి రోజున అంటే అక్టోబర్ 19న నవమి వేడుకలు జరగనుండగా, మరుసటి రోజు అక్టోబర్ 20న విజయదశమి లేదా దసరా పండుగను ఘనంగా జరుపుకోనున్నారు.
పంచాంగం ప్రకారం, ఆశ్వయుజ శుక్ల పక్ష ప్రతిపద తిథి అక్టోబర్ 10 రాత్రి సుమారు 9:19 గంటలకు ప్రారంభమై, అక్టోబర్ 11 రాత్రి 9:30 గంటల వరకు ఉంటుంది. ఉదయ తిథి ప్రామాణికతను బట్టి అక్టోబర్ 11వ తేదీనే నవరాత్రి తొలి రోజుగా శాస్త్రోక్తంగా నిర్ణయించారు.
అక్టోబర్ 11న ఘటస్థాపన విశిష్టత
నవరాత్రులలో మొదటి రోజైన ఘటస్థాపనకు అత్యంత ప్రాధాన్యత ఉంది. ఇదే రోజున తొమ్మిది రోజుల పాటు సాగే దుర్గాదేవి పూజా పర్వానికి అంకురార్పణ జరుగుతుంది. కలశ స్థాపన చేసిన తర్వాత భక్తులు ప్రథమ రూపమైన అమ్మవారి శైలపుత్రిని భక్తిశ్రద్ధలతో కొలుస్తారు. ప్రాంతీయ పంచాంగాలు, స్థానిక ఆచారాలను బట్టి పూజా ముహూర్తాల్లో స్వల్ప తేడాలు ఉండే అవకాశం ఉంది. పూజా మందిరంలో అఖండ దీపాన్ని వెలిగించడం హిందూ సనాతన ధర్మం ప్రకారం ఆనవాయితీగా వస్తోంది.
నవరాత్రులలో అమ్మవారి తొమ్మిది రూపాల పూజా క్రమం
నవరాత్రుల తొమ్మిది రోజుల్లో శక్తి స్వరూపిణి అయిన దుర్గాదేవిని వివిధ రూపాల్లో పూజిస్తారు. ఈసారి పూజా క్రమం ఈ క్రింది విధంగా ఉంటుంది:
అక్టోబర్ 11 - బాల త్రిపుర సుందరి దేవి : నవరాత్రి మొదటి రోజున బాల త్రిపుర సుందరి దేవిని ఆరాధిస్తారు.
అక్టోబర్ 12 - గాయత్రీ దేవి: రెండో రోజున గాయత్రీ దేవిని పూజిస్తారు.
అక్టోబర్ 13 -అన్నపూర్ణాదేవి: మూడో రోజున ధైర్యం, శక్తికి నిలయమైన అన్నపూర్ణాదేవి దర్శనం లభిస్తుంది.
అక్టోబర్ 14 - లలితా దేవి: నాల్గవ రోజున లలితా దేవిని పూజిస్తారు.
అక్టోబర్ 15 - చండీ దేవి: ఐదో రోజున చండీ దేవిని భక్తులు కొలుస్తారు.
అక్టోబర్ 16 - మహాలక్ష్మీదేవి: ఆరో రోజున మహాలక్ష్మీదేవిని ఆరాధిస్తారు.
అక్టోబర్ 17 - సరస్వతీదేవి: ఏడో రోజున సరస్వతీదేవి పూజ జరుగుతుంది.
అక్టోబర్ 18 - దుర్గాదేవి: ఎనిమిదో రోజున దుర్గాదేవిని పూజిస్తారు.
అక్టోబర్ 19 - మహిషాసుర మర్దిని: తొమ్మిదో రోజున మహిషాసుర మర్దినిని ఆరాధిస్తారు. ఇదే రోజున మహానవమి పండుగను జరుపుకుంటారు.
అక్టోబర్ 20- రాజరాజేశ్వరి దేవి: పదవ రోజు రాజరాజేశ్వరి దేవిని పూజించడం జరుగుతుంది.
{{/usCountry}}నవరాత్రుల తొమ్మిది రోజుల్లో శక్తి స్వరూపిణి అయిన దుర్గాదేవిని వివిధ రూపాల్లో పూజిస్తారు. ఈసారి పూజా క్రమం ఈ క్రింది విధంగా ఉంటుంది:
అక్టోబర్ 11 - బాల త్రిపుర సుందరి దేవి : నవరాత్రి మొదటి రోజున బాల త్రిపుర సుందరి దేవిని ఆరాధిస్తారు.
అక్టోబర్ 12 - గాయత్రీ దేవి: రెండో రోజున గాయత్రీ దేవిని పూజిస్తారు.
అక్టోబర్ 13 -అన్నపూర్ణాదేవి: మూడో రోజున ధైర్యం, శక్తికి నిలయమైన అన్నపూర్ణాదేవి దర్శనం లభిస్తుంది.
అక్టోబర్ 14 - లలితా దేవి: నాల్గవ రోజున లలితా దేవిని పూజిస్తారు.
అక్టోబర్ 15 - చండీ దేవి: ఐదో రోజున చండీ దేవిని భక్తులు కొలుస్తారు.
అక్టోబర్ 16 - మహాలక్ష్మీదేవి: ఆరో రోజున మహాలక్ష్మీదేవిని ఆరాధిస్తారు.
అక్టోబర్ 17 - సరస్వతీదేవి: ఏడో రోజున సరస్వతీదేవి పూజ జరుగుతుంది.
అక్టోబర్ 18 - దుర్గాదేవి: ఎనిమిదో రోజున దుర్గాదేవిని పూజిస్తారు.
అక్టోబర్ 19 - మహిషాసుర మర్దిని: తొమ్మిదో రోజున మహిషాసుర మర్దినిని ఆరాధిస్తారు. ఇదే రోజున మహానవమి పండుగను జరుపుకుంటారు.
అక్టోబర్ 20- రాజరాజేశ్వరి దేవి: పదవ రోజు రాజరాజేశ్వరి దేవిని పూజించడం జరుగుతుంది.
{{/usCountry}}
అష్టమి, నవరమి మరియు దసరా వేడుకలు
ఈ ఏడాది అక్టోబర్ 18న అష్టమి పర్వదినం వచ్చింది. ఈ పవిత్ర దినాన మహాగౌరిని పూజించడంతో పాటు ఇళ్లలో హోమాలు, కన్య పూజలు నిర్వహిస్తారు. దీనికి మరుసటి రోజు అంటే అక్టోబర్ 19న మహానవమి జరుపుకుంటారు. నవరాత్రి వ్రతం ఆచరించే అనేక మంది భక్తులు నవమి రోజునే కన్య పూజ ముగించుకుని తమ ఉపవాసాలను విరమిస్తారు (వ్రత పారణ).
నవరాత్రుల ఉత్సవాల సమాప్తి తర్వాత అక్టోబర్ 20, 2026 నాడు విజయదశమి (దసరా) పండుగను జరుపుకోనున్నారు. ఈ పవిత్ర రోజున అమ్మవారి ప్రతిమలను నిమజ్జనం చేయడం జరుగుతుంది. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా రావణ, కుంభకర్ణ, మేఘనాథుల దిష్టిబొమ్మలను దహనం చేస్తారు. రావణాసురుడిపై శ్రీరాముడు సాధించిన విజయానికి మరియు మహిషాసురుడిపై దుర్గాదేవి పొందిన గెలుపునకు ఈ పండుగ ప్రతీకగా నిలుస్తుంది.