2025 ముగింపు దశకు వచ్చేసింది. 2026లోకి అడుగుపెట్టబోతున్నాము. ఈ కొత్త ఆంగ్ల సంవత్సరం అందరికీ బాగా కలిసి రావాలని అందరూ అనుకుంటూ ఉంటారు. మీరు కూడా మీ బంధువులు, మిత్రులు, కుటుంబ సభ్యులు కొత్త సంవత్సరం సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నారా? కొత్త సంవత్సరం ఆరంభం బాగుంటే ఏడాది (New Year 2026) మొత్తం సంతోషంగా ఉండొచ్చు. వారి బాగోగులను మీరు కోరుకుంటున్నారని తెలియజేయడానికి, వారు సంతోషంగా ఉండాలని ఆశిస్తూ, మీరు ఈ శ్లోకాలతో విషెస్ చెప్పేయండి.

కొత్త సంవత్సరం (New Year Wishes 2026) అందరికీ చదువుపరంగా, ఉద్యోగ పరంగానే కాకుండా ఆరోగ్యం, ఆనందం, అదృష్టం ఇవన్నీ కలిసి రావాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తూ, ఈ శ్లోకాలతో మీరు ఇష్టపడే వారికి శుభాకాంక్షలు తెలపండి.
నూతన ఆంగ్ల సంవత్సరం 2026 విషెస్ & కోట్స్.. న్యూఇయర్ విషెస్, కోట్స్, శ్లోకాలతో న్యూఇయర్ విషెస్
1. ఓం గం గణపతయే నమః
మీకు, మీ కుటుంబ సభ్యులకు ఆనందం ఎప్పుడూ ఉండాలని, ఏ పని మొదలుపెట్టినా అడ్డంకులు ఉండకూడదని ఆకాంక్షిస్తూ.. హ్యాపీ న్యూ ఇయర్
2. ఆదిత్యాయచ సోమాయ మంగళాయ బుధాయచ.. గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః
ఈ నూతన సంవత్సరం నవగ్రహ బాధలు తొలగిపోవాలని, ఏడాది అంతా ఆనందంగా ఉండాలని కోరుకుంటూ - నూతన సంవత్సర శుభాకాంక్షలు 2026
3. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే
సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే..
ఆ శ్రీరాముడి ఆశీస్సులు మీ కుటుంబ సభ్యులందరికీ ఉండాలని, రాముని అనుగ్రహంతో అన్నిటా విజయాలే ఉండాలని కోరుకుంటూ - హ్యాపీ న్యూ ఇయర్ 2026
4. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ
నిర్విఘ్నం కురుమే దేవా సర్వ కార్యేషు సర్వదా
కొత్త సంవత్సరం ఎలాంటి అడ్డంకులు లేకుండా విజయవంతంగా ఉండాలని, ఏ పని మొదలు పెట్టినా అది దిగ్విజయంగా పూర్తవ్వాలని కోరుకుంటూ.. మీకు, మీ కుటుంబ సభ్యులకు న్యూ ఇయర్ శుభాకాంక్షలు
5. ఓం ప్రణో దేవి సరస్వతీ వాజే బిర్వాజినీవతి ధీనమవిత్ర్యవతు
{{/usCountry}}కొత్త సంవత్సరం ఎలాంటి అడ్డంకులు లేకుండా విజయవంతంగా ఉండాలని, ఏ పని మొదలు పెట్టినా అది దిగ్విజయంగా పూర్తవ్వాలని కోరుకుంటూ.. మీకు, మీ కుటుంబ సభ్యులకు న్యూ ఇయర్ శుభాకాంక్షలు
5. ఓం ప్రణో దేవి సరస్వతీ వాజే బిర్వాజినీవతి ధీనమవిత్ర్యవతు
{{/usCountry}}ఆ సరస్వతి దేవి అనుగ్రహంతో ఏ విధమైన లోటు లేకుండా సంతోషంగా ఉండాలని కోరుకుంటూ.. ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు
6. వసుదేవ సుతం దేవం కంస చాణూర మర్దనం
దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం
కొత్త సంవత్సరం వెలుగులతో నిండి ఉండాలని, ఎలాంటి బాధలు కలగకుండా ఉండాలని కోరుకుంటున్నాను... హ్యాపీ న్యూ ఇయర్ 2026
7. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదామ్.. లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం
ఏడాది అంతా ఆనందంగా ఉండాలని కోరుకుంటూ - నూతన సంవత్సర శుభాకాంక్షలు 2026
8. కర్కోటకస్య నాగస్య దమయంత్యా నలస్య చ
ఋతుపర్ణస్య రాజర్షే కీర్తనం కలినాశనం..
కాలి బాధలు లేకుండా ఆనందంగా ఉండాలని, కొత్త సంవత్సరం వెలుగులతో నిండి పోవాలని కోరుకుంటూ హ్యాపీ న్యూఇయర్
9. ఓం శ్రీం మహాలక్ష్మై నమః
నూతన సంవత్సరం లక్ష్మీదేవి జ్ఞానం, ఐశ్వర్యం ప్రసాదించాలని కోరుకుంటూ.. మీకు మీ కుటుంబ సభ్యులకు ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు
10. ఓం నమో భగవతే వాసుదేవాయ నమః
శ్రీమహావిష్ణువు అనుగ్రహం ఎల్లవేళలా ఉండాలని, ఏ సమస్యలు లేకుండా కొత్త సంవత్సరం అంతా ఆనందాలే ఉండాలని కోరుకుంటూ.. మీకు మీ కుటుంబ సభ్యులకు నూతన సంవత్సరం శుభాకాంక్షలు
11. ఓం నమో వెంకటేశాయ నమః
శ్రీ వేంకటేశ్వర స్వామి కటాక్షంతో కష్టాలు తొలగిపోవాలని, మీ కోరికలు తీరి ఆనందంగా ఉండాలని కోరుకుంటూ.. ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు