New Year Wishes 2026: నూతన సంవత్సర శుభాకాంక్షలను ఆయుష్షు, ఐశ్వర్యం కలిగించే శ్లోకాలు, మంత్రాలతో చెప్పేయండి!

New Year Wishes: 2026లోకి అడుగుపెట్టబోతున్నాము. ఈ కొత్త ఆంగ్ల సంవత్సరం అందరికీ బాగా కలిసి రావాలని అందరూ అనుకుంటూ ఉంటారు. మీరు కూడా మీ బంధువులు, మిత్రులు, కుటుంబ సభ్యులు కొత్త సంవత్సరం సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నారా? ఈ శ్లోకాలతో మీరు ఇష్టపడే వారికి శుభాకాంక్షలు తెలపండి.

Published on: Dec 30, 2025, 15:00:58 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

2025 ముగింపు దశకు వచ్చేసింది. 2026లోకి అడుగుపెట్టబోతున్నాము. ఈ కొత్త ఆంగ్ల సంవత్సరం అందరికీ బాగా కలిసి రావాలని అందరూ అనుకుంటూ ఉంటారు. మీరు కూడా మీ బంధువులు, మిత్రులు, కుటుంబ సభ్యులు కొత్త సంవత్సరం సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నారా? కొత్త సంవత్సరం ఆరంభం బాగుంటే ఏడాది (New Year 2026) మొత్తం సంతోషంగా ఉండొచ్చు. వారి బాగోగులను మీరు కోరుకుంటున్నారని తెలియజేయడానికి, వారు సంతోషంగా ఉండాలని ఆశిస్తూ, మీరు ఈ శ్లోకాలతో విషెస్ చెప్పేయండి.

New Year Wishes 2026: నూతన సంవత్సర శుభాకాంక్షలను ఆయుష్షు, ఐశ్వర్యం కలిగించే శ్లోకాలు, మంత్రాలతో (pinterest)
New Year Wishes 2026: నూతన సంవత్సర శుభాకాంక్షలను ఆయుష్షు, ఐశ్వర్యం కలిగించే శ్లోకాలు, మంత్రాలతో (pinterest)

కొత్త సంవత్సరం (New Year Wishes 2026) అందరికీ చదువుపరంగా, ఉద్యోగ పరంగానే కాకుండా ఆరోగ్యం, ఆనందం, అదృష్టం ఇవన్నీ కలిసి రావాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తూ, ఈ శ్లోకాలతో మీరు ఇష్టపడే వారికి శుభాకాంక్షలు తెలపండి.

నూతన ఆంగ్ల సంవత్సరం 2026 విషెస్ & కోట్స్.. న్యూఇయర్ విషెస్, కోట్స్, శ్లోకాలతో న్యూఇయర్ విషెస్

1. ఓం గం గణపతయే నమః

మీకు, మీ కుటుంబ సభ్యులకు ఆనందం ఎప్పుడూ ఉండాలని, ఏ పని మొదలుపెట్టినా అడ్డంకులు ఉండకూడదని ఆకాంక్షిస్తూ.. హ్యాపీ న్యూ ఇయర్

2. ఆదిత్యాయచ సోమాయ మంగళాయ బుధాయచ.. గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః

ఈ నూతన సంవత్సరం నవగ్రహ బాధలు తొలగిపోవాలని, ఏడాది అంతా ఆనందంగా ఉండాలని కోరుకుంటూ - నూతన సంవత్సర శుభాకాంక్షలు 2026

3. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే

సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే..

ఆ శ్రీరాముడి ఆశీస్సులు మీ కుటుంబ సభ్యులందరికీ ఉండాలని, రాముని అనుగ్రహంతో అన్నిటా విజయాలే ఉండాలని కోరుకుంటూ - హ్యాపీ న్యూ ఇయర్ 2026

4. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ

నిర్విఘ్నం కురుమే దేవా సర్వ కార్యేషు సర్వదా

కొత్త సంవత్సరం ఎలాంటి అడ్డంకులు లేకుండా విజయవంతంగా ఉండాలని, ఏ పని మొదలు పెట్టినా అది దిగ్విజయంగా పూర్తవ్వాలని కోరుకుంటూ.. మీకు, మీ కుటుంబ సభ్యులకు న్యూ ఇయర్ శుభాకాంక్షలు

5. ఓం ప్రణో దేవి సరస్వతీ వాజే బిర్వాజినీవతి ధీనమవిత్ర్యవతు

ఆ సరస్వతి దేవి అనుగ్రహంతో ఏ విధమైన లోటు లేకుండా సంతోషంగా ఉండాలని కోరుకుంటూ.. ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు

6. వసుదేవ సుతం దేవం కంస చాణూర మర్దనం

దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం

కొత్త సంవత్సరం వెలుగులతో నిండి ఉండాలని, ఎలాంటి బాధలు కలగకుండా ఉండాలని కోరుకుంటున్నాను... హ్యాపీ న్యూ ఇయర్ 2026

7. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదామ్.. లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం

ఏడాది అంతా ఆనందంగా ఉండాలని కోరుకుంటూ - నూతన సంవత్సర శుభాకాంక్షలు 2026

8. కర్కోటకస్య నాగస్య దమయంత్యా నలస్య చ

ఋతుపర్ణస్య రాజర్షే కీర్తనం కలినాశనం..

కాలి బాధలు లేకుండా ఆనందంగా ఉండాలని, కొత్త సంవత్సరం వెలుగులతో నిండి పోవాలని కోరుకుంటూ హ్యాపీ న్యూఇయర్

9. ఓం శ్రీం మహాలక్ష్మై నమః

నూతన సంవత్సరం లక్ష్మీదేవి జ్ఞానం, ఐశ్వర్యం ప్రసాదించాలని కోరుకుంటూ.. మీకు మీ కుటుంబ సభ్యులకు ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు

10. ఓం నమో భగవతే వాసుదేవాయ నమః

శ్రీమహావిష్ణువు అనుగ్రహం ఎల్లవేళలా ఉండాలని, ఏ సమస్యలు లేకుండా కొత్త సంవత్సరం అంతా ఆనందాలే ఉండాలని కోరుకుంటూ.. మీకు మీ కుటుంబ సభ్యులకు నూతన సంవత్సరం శుభాకాంక్షలు

11. ఓం నమో వెంకటేశాయ నమః

శ్రీ వేంకటేశ్వర స్వామి కటాక్షంతో కష్టాలు తొలగిపోవాలని, మీ కోరికలు తీరి ఆనందంగా ఉండాలని కోరుకుంటూ.. ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు

  • Peddinti Sravya
    ABOUT THE AUTHOR
    Peddinti Sravya

    పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More